»   »  త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ ‘అ..ఆ’ రిలీజ్ డేట్ ఖరారు!

త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ ‘అ..ఆ’ రిలీజ్ డేట్ ఖరారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ హీరోగా సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. 'అ...ఆ' (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. మే 6న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

త్రివిక్రమ్, దిల్ రాజు, వినాయక్, సుకుమార్ భార్యలు (రేర్‌ ఫోటోస్)
వాస్తవానికి ఈ సినిమాను ఏప్రిల్ నెలలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఈ నెలలో బన్నీ నటించిన 'సరైనోడు', పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్', మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' రిలీజ్ అయ్యే అవకాశం ఉండటంతో 'అ..ఆ' చిత్రాన్ని మే 6న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Trivikram's A Aa releasing on May 6

కెరీర్ తొలినాళ్లలో ఒకే రూములో కలిసున్న స్టార్స్ (ఫోటో ఫీచర్)
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హీరో నితిన్ తొలిసారిగా నటిస్తుండగా సూర్యదేవర రాధాకృష్ణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను త్రివిక్రమ్ స్వయంగా చూస్తున్నారు. సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సమంత నటిస్తుండగా.... మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. త్రివిక్రమ్ గత సినిమా 'అత్తారింటికి దారేది' మూవీలో కీలక పాత్ర పోషించిన నటి నదియా కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన హడావుడి ఏమీ లేదు. త్రివిక్రమ్ సైలెంటుగా తన పనికానిచ్చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ డేట్ ఫైనల్ అయిన నేపథ్యంలో మరో వారం రోజుల్లో ప్రచారం కార్యక్రమాలు మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమా టీజర్, పోస్టర్స్, ట్రైలర్ విడుదల చేయనున్నారు.

English summary
Ace director Trivikram’s upcoming family entertainer A Aa (Anasuya Ramalingam Vs Aanand Vihari) is all set to hit the screens on May 6th. Release date has been locked by the makers and they are planning to launch the publicity campaign within a week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu