»   » కెరీర్ తొలినాళ్లలో ఒకే రూములో కలిసున్న స్టార్స్ (ఫోటో ఫీచర్)

కెరీర్ తొలినాళ్లలో ఒకే రూములో కలిసున్న స్టార్స్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా పరిశ్రమలో ఎంట్రీ అంటే అంత సులుభం కాదు. వారసత్వమో, లేక ఎవరైనా తెలిసిన వాళ్లు ఉంటే ఫర్వా లేదు కానీ..... ఎవరి సపోర్టు లేకుంటే అవకాశాలు దక్కించుకోవడం అంటే చాలా కష్టమైన విషయమే. ఎలాంటి సపోర్టు లేకున్నా సినిమా రంగమే నా భవిష్యత్తు అని ఫిక్స్ అయిన వారు పట్టువదలని విక్రమార్కుల్లా అవకాశాలు దక్కించుకోవడానికి తమ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

అలా కష్టపడి ఇండస్ట్రీలో ఎదిగిన వారు టాలీవుడ్లో చాలా మందే ఉన్నారు. కెరీర్ తొలి నాళ్లలో త్రివిక్రమ్, సునీల్ రూమ్మేట్స్ అని ఈ మద్య తరచూ వార్తల్లో వింటూనే ఉన్నాం. ఇటీవల కూడా సునీల్ తన తాజా సినిమా 'కృష్ణాష్టమి' ప్రమోషన్లలో భాగంగా అప్పట్లో తాను, త్రివిక్రమ్ ఒకే రూమ్‌లో కలిసి ఉన్నామని, సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డామని గుర్తు చేసుకున్నారు.

గతేడాది ఓ ఇంటర్వ్యూలో మధ్య కెమడియన్ సుధాకర్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ...నేను, చిరంజీవి, హరి ప్రసాద్ ఒకే రూములో ఉండేవారం...చిరంజీవి అన్నం వండేవాడు, తాను కూరలు చేసేవాడిని, మార్కెట్ నుండి కావాల్సిన హరి ప్రసాద్ తీసుకువచ్చేవాడని సుధాకర్ చెప్పుకొచ్చారు.

ఇలా కెరీర్ తొలి నాళ్లలో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, వివి వినాయక్, రవితేజ లాంటి స్టార్స్ ఇతర స్టార్స్ తో కలిసి ఒకే రూములో కలిసున్న వారే వారికి సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

సీనియర్ ఎన్టీఆర్, టీవీ రాజు

సీనియర్ ఎన్టీఆర్, టీవీ రాజు


సీనియర్ ఎన్టీఆర్, మ్యూజిక్ డైరెక్టర్ టీవీ రాజు అప్పట్లో చెన్నైలో ఒకే రూములో కలిసి ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారట.

చిరంజీవి, సుధాకర్

చిరంజీవి, సుధాకర్


మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ కమెడియన్ సుధాకర్ అప్పట్లో చెన్నైలో కలిసి ఒకే రూములో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించారు. వీరితో పాటు హరిప్రసాద్ కూడా ఉండేవారట.

వినాయక్, డాలీ, బుజ్జి

వినాయక్, డాలీ, బుజ్జి


ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న వివి వినాయక్.... అప్పట్లో మరో దర్శకుడు డాలీ(కిషోర్ పార్ధసాని), నిర్మాత నల్లమలుపు బుజ్జితో కలిసి ఒకే రూములో ఉండేవారట.

పూరి, రఘు కుంచె

పూరి, రఘు కుంచె


ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె అప్పట్లో ఒకే రూములో కలిసి ఉండేవారట.

శ్రీను వైట్ల, అనిల్ సుంకర

శ్రీను వైట్ల, అనిల్ సుంకర


దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత అనిల్ సుంకర అప్పట్లో ఒకే రూములో కలిసి ఉండేవారు.

కృష్ణ వంశీ, ఉత్తేజ్

కృష్ణ వంశీ, ఉత్తేజ్


దర్శకుడు కృష్ణ వంశీ, ఉత్తేజ్ కెరీర్ తొలి నాళ్లలో ఒకే రూములో కలిసి ఉండేవారు.

రవితేజ, గుణశేఖర్

రవితేజ, గుణశేఖర్


దర్శకుడు గుణశేఖర్, రవితేజ, వైవిఎస్ చౌదరి కెరీర్ తొలి నాళ్లలో ఒకే రూములో కలిసి ఉండే వారట.

నిఖిల్, చందూ మొండేటి, సుధీర్ వర్మ

నిఖిల్, చందూ మొండేటి, సుధీర్ వర్మ


హీరో నిఖిల్ నిఖిల్, డైరెక్టర్స్ చందూ మొండేటి, సుధీర్ వర్మలు కెరీర్ తొలి నాళ్లలో ఒకే రూమ్ లో కలిసి ఉండేవారు.

గోపీ మోహన్, వీరు పొట్ల, సుదాకర్ రెడ్డి

గోపీ మోహన్, వీరు పొట్ల, సుదాకర్ రెడ్డి


గోపీ మోహన్, వీరు పోట్ల, సుధాకర్ రెడ్డి కెరీర్ తొలి నాళ్లలో ఒకే రూములో కలిసి ఉండేవారు.

త్రివిక్రమ్, సునీల్, ఆర్‌పిపి, కులశేఖర్

త్రివిక్రమ్, సునీల్, ఆర్‌పిపి, కులశేఖర్


దర్శకుడు త్రివిక్రమ్, నటుడు సునీల్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, లిరిక్ రైటర్ కుల శేఖర్ అప్పట్లో ఒకే రూములో కలిసి ఉండే వారు.

కొరటాల, బివిఎస్ రవి

కొరటాల, బివిఎస్ రవి


దర్శకుడు కొరటాల శివ, బివిఎస్ రవి, గోపాల కృష్ణ తదితరులు కూడా కెరీర్ తొలి నాళ్లలో ఒకే రూములో కలిసి ఉండేవారట.

ఇళయరాజా, భారతీ రాజా

ఇళయరాజా, భారతీ రాజా


తమిళ స్టార్స్ ఇళయారాజా, భారతీరాజా కెరీర్ తొలినాళ్లలో ఒకే రూములో కలిసి ఉండేవారట.

English summary
Tollywood stars who were roommates in their early career days!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu