Maa Inti Bangaaram: ఓటీటీలో దుమ్మురేపుతున్న మా ఇంటి బంగారం.. సమంత మూవీ టాప్ ట్రెండింగ్‌గా!
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా సంచలనాలు నమోదు చేస్తూ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు చేరువైంది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల్లోను, అలాగే ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రినివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్, మ్యూజిక్: సంతోష్ నారాయణన్, ఫైట్స్: లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదర్ తదితరలు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజై బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. ఇటీవలే థియేట్రికల్ జర్నీని ముగించుకొన్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రికార్డు స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. దాంతో ఈ సినిమా ఓటీటీలో ఓ ట్రెండింగ్‌గా మారింది. ఈ చిత్రం ఓటీటీ పెర్ఫార్మెన్స్ వివరాల్లోకి వెళితే..

లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 27 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా టేబుల్ ఫ్రాఫిట్ సాధించింది. ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా సుమారుగా 35 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఈ సినిమాను ట్రాలాలా సంస్థ సొంతంగా రిలీజ్ చేసింది. థియేట్రికల్‌గా ఈ మూవీ మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. దాదాపు 4 వారాల్లో ఈ చిత్రం 100 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా డిజిటల్ అగ్రిమెంట్ ప్రకారం.. జూలై 17 నుంచి ఓటీటీలోకి వచ్చేసింది.
మా ఇంటి బంగారం సినిమా ఓటీటీలో కూడా ఆడియెన్స్‌ను భారీగా ఆదరిస్తున్నారు. సమంత యాక్షన్ ఎపిసోడ్స్‌కు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఒకటిగా నిలిచింది. స్ట్రీమింగ్ అవుతున్న తొలి రోజు నుంచి భారీగా యూజర్లు ఈ సినిమాను వీక్షిస్తున్నారు. ఈ చిత్రానికి థియేట్రికల్‌లోనే కాకుండా ఓటీటీలో కూడా భారీగా వీక్షిస్తున్నారు అని జియో హాట్ స్టార్ వెల్లడించింది.
జియో హాట్ స్టార్ యాప్‌లో సమంత నటించిన చిత్రం గత కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. దక్షిణాది సినిమా రంగంలో ఈ చిత్రం నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది. ఇండియాలో టాప్ 10 స్థానాల్లో ఒకటిగా ఉంది అని తెలిపారు. ఈ సినిమా కంటెంట్, సమంత పెర్ఫార్మెన్స్‌కు ఆమె అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడా ఫిదా అవుతున్నారు. దాంతో ఈ సినిమా టాప్ ట్రెండింగ్‌లో ఒకటిగా నిలిచింది.


Click it and Unblock the Notifications


