ఆ హీరో అంటే పిచ్చి క్రష్.. అలా మనసు పారేసుకున్న కాజల్ అగర్వాల్

20 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా వెలుగొందుతున్నారు కాజల్ అగర్వాల్. క్యూన్ హో గయా నా అనే హిందీ చిత్రంతో నటిగా తన ప్రస్థానం ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మకు స్టార్ స్టేటస్‌ను, సక్సెస్‌ను ఇచ్చింది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమే. టాలీవుడ్‌ను కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా ఏలారు కాజల్. సీనియర్ల, జూనియర్లు అందరి హీరోల పక్కన నటించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ సత్తా చాటారు. పెళ్లి తర్వాత కూడా నటిస్తూ ఫ్యామిలీని, కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Also Read
రోజుకి 100 కోట్లు ఇచ్చినా అలా చేయను.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ షాకింగ్‌గా..
రోజుకి 100 కోట్లు ఇచ్చినా అలా చేయను.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ షాకింగ్‌గా..

పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్‌ను కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు కాజల్. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, కథా బలమున్న పాత్రలు చేస్తున్నారు. సత్యభామలో ఐపీఎస్ ఆఫీసర్‌గా పవర్ చూపించిన కాజల్.. కన్నప్పలో పార్వతి దేవిగా నటించారు. ప్రస్తుతం తెలుగులో నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతోన్న ఎన్‌బీకే 111లో నటిస్తున్నారు ఈ చందమామ.

Kajal Aggarwal Reveals Her Childhood Crush on Salman Khan During The India Story Promotions

హిందీలో కాజల్ ఫుల్ బిజీగా ఉంది. ప్రతిష్టాత్మక రామాయణలో మండోదరిగా ఆమె కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫోటోలు, వీడియోలలో కాజల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తాజాగా ఆమె నటించిన ది ఇండియా స్టోరీ విడుదలకు సిద్దమైంది. దేశంలో జరుగుతున్న ఆహార కల్తీ, ఫుడ్ పాయిజన్ తదితర అంశాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బీ షిండే నిర్మించారు. శ్రేయస్ తల్పడే, అశ్విని భండే, హర్దీకా జోషి, మురళి శర్మ, మనిష్ వాద్వా, అతుల్ తివారి, కమలేష్ సావంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిషాంత్ భగవత్ సినిమాటోగ్రాఫర్‌గా, మంగేష్ ధాక్డే సంగీత దర్శకుడిగా, అనీశ్ మాత్రే ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. జూలై 24న ది ఇండియా స్టోరీ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

Recommended For You
షారుఖ్‌తో సల్మాన్ ఖాన్ గొడవ.. 5 ఏళ్లు శత్రువుల్లా, ఆ హీరోయిన్ బర్త్ డే‌లో ఏం జరిగిందంటే?
షారుఖ్‌తో సల్మాన్ ఖాన్ గొడవ.. 5 ఏళ్లు శత్రువుల్లా, ఆ హీరోయిన్ బర్త్ డే‌లో ఏం జరిగిందంటే?

ది ఇండియా స్టోరీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కాజల్. ఇందుకోసం ముంబై, హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతున్నారు. 42 ఏళ్ల వయసులో కొంచెం బొద్దుగా మారినా కష్టపడి వర్కవుట్స్ చేసి స్లిమ్‌గా మారారు. తనకు గుర్తింపును, గౌరవాన్ని తీసుకొచ్చిన దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఇటీవల వస్తున్న వార్తలపై ఓ ఇంటర్వ్యూలో కాజల్ స్పందించారు. సౌత్ చిత్రాలలో హీరోయిన్ల బొడ్డు, నడుము చూపించడానికి ఆసక్తి చూపిస్తారని అంశంపై ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యారు. గతంలో అలాంటి అపోహ ఉండవచ్చు కానీ ఇటీవల దక్షిణాది చిత్ర పరిశ్రమ తనను తాను మార్చుకుంటోందని కాజల్ తెలిపారు.

You May Also Like
'ఆ హీరోయిన్‌కి నాకు గొడవలు పెట్టి.. ఉదయ్‌ కిరణ్‌తో అలా మిస్ అయ్యా’
'ఆ హీరోయిన్‌కి నాకు గొడవలు పెట్టి.. ఉదయ్‌ కిరణ్‌తో అలా మిస్ అయ్యా’

అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి కాజల్ సమాధానమిచ్చారు. తనకు చిన్నప్పటి నుంచి సల్మాన్ ఖాన్ అంటే క్రష్. నా చెల్లెలు నిషా షారుఖ్ అభిమాని కావడంతో నేను సల్మాన్ పక్షాన నిలిచేదానిని. ఆయనను ఒక్క మాట అన్నా ఊరుకునే దానిని కాదు. అందుకే మా ఇద్దరి మధ్య తరచుగా ఈ విషయంలో గొడవలు జరిగేవి. సినీరంగంలో అడుగుపెట్టిన తర్వాత కూడా సల్మాన్ తనను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉండేవాడని కాజల్ పేర్కొన్నారు. కాగా.. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన సికందర్‌లో ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తన చిన్ననాటి హీరోతో కలిసి పనిచేయడంతో కాజల్ చాలా సంతోషించారు.

Read more about: kajal aggarwal salman khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X