OTT Releases This Week: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం సినిమాలు, వెబ్‌సిరీస్‌లివే
OTT Releases This Week: 2026 ఆరంభంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ విందు అందిస్తున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాల నుంచి, బ్లాక్‌బస్టర్ సీక్వెల్స్, కాంట్రవర్సియల్ క్రైమ్ డాక్యుమెంటరీల వరకు ఈ వారం ఓటీటీల్లోకి వచ్చాయి. ముఖ్యంగా యాక్షన్, ఫాంటసీ, కామెడీ, రియల్ క్రైమ్ జానర్‌లకు చెందిన కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఓటీటీ లవర్స్‌కు ఇది పండగ వారం అనే చెప్పాలి. మరి ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమా లేదా వెబ్‌సిరీస్ అందుబాటులోకి వచ్చాయంటే?
అఖండ 2 (Akhanda 2: Thaandavam)
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ బ్లాక్‌బస్టర్ అఖండ 2 ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. గతేడాది డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాలయ్య పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఘన విజయం సాధించింది. జనవరి 9 అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్ మిస్ అయిన ప్రేక్షకులకు ఇది బిగ్ ట్రీట్‌గా మారింది.

అయలాన్ (Ayalaan)
తమిళ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటించిన ఏలియన్ కామెడీ మూవీ 'అయలాన్'. తమిళంలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూపులు పెడుతోంది. ఇప్పుడు ఆహా ఓటీటీలో జనవరి 7 నుంచి తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. దీంతో తెలుగు మూవీ లవర్స్‌లో ఉత్సాహం పెరిగింది.
The RajaSaab Day 1 Collections: ది రాజా సాబ్ ఫస్ట్ డే కలెక్షన్లు... ప్రభాస్ మూవీకి ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?
జిగ్రీస్ (Jigris)
కామెడీ పేరుతో ప్రేక్షకులను నవ్వించడం అంత ఈజీ కాదు. కానీ 'జిగ్రీస్' ఆ ఛాలెంజ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)తో పాటు సన్ ఎన్ఎక్స్టీ(Sun NXT)లో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఓటీటీలో ఈ యూత్‌ఫుల్ కామెడీ డ్రామాను ఆస్వాదిస్తున్నారు.
అందెల రవమిది (Andela Ravamidhi)
భారతీయ శాస్త్రీయ నృత్యం, కథానికను మేళవించి రూపొందిన చిత్రం 'అందెల రవమిది'. దర్శకురాలు ఇంద్రాణి దావుల పూరి దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ జనవరి 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Jana Nayagan: విజయ్ 'జననాయగన్'కు ఊరట..కోర్టు కీలక ఆదేశాలు.. విడుదల ఎప్పుడంటే?
గుర్రం పాపి రెడ్డి (Gurram Paapi Reddy)
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన 'గుర్రం పాపిరెడ్డి' థియేటర్లలో మంచి వినోదం పంచింది. ఇప్పుడు ఈ సినిమా జనవరి 16 నుంచి జీ 5 ( ZEE5)లో స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి కానుకగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ప్రిడమ్ ఎట్ మిడ్ నైట్ (Freedom at Midnight - Season 2)
భారత స్వాతంత్ర్యానంతర కాలంలో జరిగిన రాజకీయ, సామాజిక పరిణామాలను డార్క్ కోణంలో చూపించిన ఈ సిరీస్ ఇప్పుడు సీజన్ 2తో తిరిగొచ్చింది. సోనీ లివ్ వేదికగా జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు సహా పలు భాషల్లో అందుబాటులోకి రావడం విశేషం.
దే దే ప్యార్ దే 2 (De De Pyaar De 2)
అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన కామెడీ సినిమా 'దే దే ప్యార్ దే'. 2019లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో అద్భుతమైన హిట్‌గా నిలిచింది. మళ్లీ గతేడాది నవంబరు 21న దీని సీక్వెల్‌ని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ కామెడీ సీక్వెల్ జనవరి 9 నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix)లో హిందీ భాషలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినా, ఓటీటీలో కొత్త ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.
మొత్తానికి ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అన్ని జానర్‌ల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని భారీ కంటెంట్‌ను అందిస్తున్నాయి. మాస్ యాక్షన్ కావాలన్నా, రియల్ క్రైమ్ థ్రిల్ కావాలన్నా, కుటుంబంతో కూర్చుని చూడదగ్గ సినిమాలైనా... ప్రతి ఒక్కరికీ ఏదో ఒక స్పెషల్ కంటెంట్ అందుబాటులో ఉంది. ఓటీటీ ప్రియులకు ఇది నిజంగా పండగ వారం అనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











