షూటింగ్‌లో విషాదం.. ఆ న్యూస్‌తో హృదయం ముక్కలు.. తనూజ కంటతడి

బిగ్‌బాస్ తెలుగు 9 ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కన్నడ నటి తనూజ పుట్టస్వామి. తన ఆటతీరు, వ్యక్తిత్వం, పోరాట పటిమతో ఆ సీజన్‌కే హైలైట్‌గా నిలిచారు. ఖచ్చితంగా ఈసారి తనూజ గెలుస్తారని అంతా అనుకున్నారు. అయితే కామన్ మేన్‌గా వచ్చిన కళ్యాణ్ పడాల టైటిల్ విజేతగా నిలిచారు. అయినప్పటికీ తనూజ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. బిగ్‌బాస్‌తో ఆమెకు తెలుగునాట స్టార్‌డమ్ వచ్చింది. తండ్రికి ఇష్టం లేకుండా నటనా రంగం వైపు వచ్చిన తనూజ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే నాన్న అంటే తనకు ఎంతో ఇష్టమని పలుమార్లు చెప్పుకొచ్చారు. తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో తేజస్వి మదివాడ హోస్ట్‌గా ప్రసారమవుతున్న కాకమ్మ కథలు సీజన్ 3లో ఎపిసోడ్ 5కి రీతూ చౌదరితో కలిసి హాజరైంది తనూజ. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఓ విషాద ఘటనను ఈ కన్నడ కస్తూరి షేర్ చేసుకున్నారు ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
The India Story Day 1 Collections: ది ఇండియా స్టోరీ కలెక్షన్స్.. కాజల్ అగర్వాల్ మూవీకి తొలిరోజు ఎంతంటే?
The India Story Day 1 Collections: ది ఇండియా స్టోరీ కలెక్షన్స్.. కాజల్ అగర్వాల్ మూవీకి తొలిరోజు ఎంతంటే?

ఈసారి మామూలుగా ఉండదు మరి అని నాతో చెప్పారు ఎందుకో నాకు అర్ధం కాలేదు.. నువ్వు వస్తున్నావనే ఏమో అని ప్రోమో స్టార్టింగ్‌లోనే రీతూపై పంచ్ విసిరింది తేజస్వి. తనూజ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే భయంగా ఉంది.. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ లేడీకి ఉన్నంత మంది ఫ్యాన్స్ నాకు తెలిసి ఏ సీజన్‌లో, ఏ టీవీ షోలో ఇప్పటి వరకు ఎవ్వరికీ లేరు. ప్రతి ఇంట్లో కావాల్సిన కూతురు, కోడలు, సిస్టర్, మదర్ ఇలా ఉండాలని మీరు అనుకుంటారు.. కానీ ఎలా ఉంటారు నాలా ఉంటారని తేజస్వి చెప్పింది. ఫేమ్ గురించి మీరిద్దరూ ఏమనుకుంటున్నారో షేర్ చేసుకోమని అడగ్గా.. నాకు బిగ్‌బాస్‌కి వెళ్లాక మంచే జరిగింది, అంతకుముందు వరకు నేను షోలలో అల్లరిగా ఉండేదానిని, నన్ను ఒక వ్యక్తిగా వాళ్లెప్పుడూ కలవలేదని రీతూ చౌదరి చెప్పుకొచ్చింది.

Bigg Boss Fame Thanuja Puttaswamy Gets Emotional Recalls Father s Heart Stroke During Shoot

ఇక తేజస్విని తొలిసారి చూసిన సంఘటనను రీతూ గుర్తుచేసుకున్నారు. మీరు, హెబ్బా పటేల్ గారు ఒక సినిమాలో కలిసి నటించారని చెప్పగా.. నేను, నాన్న, నా బాయ్‌ఫ్రెండ్ అని సినిమా పేరు చెప్పింది తేజస్వి. అందులో చాలామంది అమ్మాయిల మధ్యలో నేను కూడా ఒక అమ్మాయిని.. నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీని చూసింది అంటే మిమ్మల్నే అని రీతూ చెప్పడంతో తేజస్వి ఎమోషనల్ అయి ఆమెను హగ్ చేసుకుంది.

Recommended For You
టార్చర్ చేసి.. తెలుగులో నాపై అలా బ్యాన్.. పల్లవి గౌడ షాకింగ్ కామెంట్స్
టార్చర్ చేసి.. తెలుగులో నాపై అలా బ్యాన్.. పల్లవి గౌడ షాకింగ్ కామెంట్స్

ఇక తన కెరీర్‌లో ఇబ్బందుల గురించి తనూజ చెబుతూ.. ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేని పరిస్ధితి. అమ్మ నాతోనే ఉంటున్నారు.. ఓ రోజున తెల్లవారుజామున అమ్మకి ఫోన్లు వస్తున్నాయి, విషయం ఏంటీ అనేది నాకు చెప్పడం లేదు. ఏమైంది? ఏం జరుగుతుంది అని అమ్మని అడిగితే షూటింగ్ లేట్ అవుతుంది కదా వెళ్లమని బలవంతం చేసింది. నాకు అనుమానం వచ్చి నాకెందుకో భయం వేస్తోంది, నువ్వు అబద్ధాలు చెబుతున్నావని గట్టిగా అడిగితే.. కంగారు పడొద్దు నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ అని చెప్పడంతో నాకేం అర్ధం కాలేదు. లోకేషన్‌లో నా కోసం వెయిట్ చేస్తున్నారు.. కింద వెహికల్, స్టాఫ్ వచ్చేశారు. టెన్షన్‌తో నేను పడిపోవడంతో అమ్మ ఏడ్చేశారు.. నీకిలా అవుతుందనే నేను చెప్పలేదని బాధపడింది.

You May Also Like
The India Story Movie Twitter Review: ది ఇండియా స్టోరీ మూవీ ట్విట్టర్ రివ్యూ
The India Story Movie Twitter Review: ది ఇండియా స్టోరీ మూవీ ట్విట్టర్ రివ్యూ

ఇటుపక్క ప్రొడ్యూసర్ బోల్డెంత ఖర్చు చేసి ఉన్నారు.. అదే సమయంలో నాకు నాన్న కూడా ఇంపార్టెంట్. ఆరోజు నా పరిస్ధితి ఎలా ఉందంటే.. ఆ నైట్ షూట్ కంప్లీట్ చేసుకుని, రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కి వెళ్లి ఒకరోజు నాన్న దగ్గర ఉండి.. నెక్ట్స్ డే షూట్‌కి వచ్చి మళ్లీ వెళ్లానని తనూజ కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా .. నటీనటుల జీవితాలలో చోటు చేసుకునే సంఘటనలు, బాధతోనే షూటింగ్‌లో పాల్గొనే పరిస్ధితులపై నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి తేజస్వి మదివాడతో తనూజ పుట్టస్వామి, రీతూ చౌదరిల అల్లరి చూడాలంటే కాకమ్మ కథలు సీజన్ 3లో ఎపిసోడ్ 5 ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.

Read more about: bigg boss thanuja rithu chowdary
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X