యాంకర్ ప్రదీప్‌కు అభిమాని లవ్ ప్రపోజల్.. మీ వల్లనే అలాంటి సమస్యలంటూ చిలిపిగా!

లేడీ డామినేషన్ కనిపించే యాంకరింగ్‌లో మగాళ్లు కూడా రాణించగలరని నిరూపించిన వారిలో ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు. తెలుగు బుల్లితెరపై యాంకర్లు అంటే ఒకప్పుడు అమ్మాయిలే కనిపించేవారు. ఉదయభాను, ఝాన్సీ, సుమ కనకాల, శిల్పా చక్రవర్తి, మల్లిక వంటి వారు తమ అందం, వాక్చాతుర్యంతో షోలను అద్భుతంగా నిర్వహిస్తూ బుల్లితెరను ఏలారు. అయితే అబ్బాయిలు కూడా యాంకరింగ్‌ను నిర్వహించగలరని చాటి చెప్పాడు ప్రదీప్ మాచిరాజు. తనదైన స్వాగ్, పంచ్‌లు, సెటైర్లతో అలరిస్తున్నారు ప్రదీప్.

Also Read
'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’
'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’

బుల్లితెరపై షోలతో పాటు సినిమా ఈవెంట్స్, ప్రైవేట్ ఫంక్షన్స్, సినిమాలు ఇలా అన్నింటిలోనూ తన ముద్ర వేసి ఫిమేల్ యాంకర్లకు గట్టి పోటీ ఇచ్చారు. ప్రదీప్ చూపించిన బాటలో సుడిగాలి సుధీర్, మానస్ నాగులపల్లి, రవి తదితరులు యాంకరింగ్‌ వైపు వచ్చి సక్సెస్ అవుతున్నారు. అయితే ప్రదీప్‌ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. పలుమార్లు ఆయన వివాహం గురించి ఊహాగానాలు వినిపించినా చివరికి అది పుకారుగా మిగిలిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రదీప్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిల్లో హీరో మాదిరిగా క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రదీప్‌కు ఓ వీరాభిమాని లైవ్‌లో ప్రపోజ్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

Fan Proposes to Pradeep Machiraju on Sridevi Drama Company Anchor s Cute Reaction Goes Viral

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. వారం వారం ఒక ప్రత్యేకమైన థీమ్‌తో బుల్లితెర సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు. తాజాగా ఈ వారానికి సంబంధించి ఈటీవీ ప్రోమోను రిలీజ్ చేసింది. తొలుత యాంకర్ ప్రదీప్ మాచిరాజు స్టైల్‌గా ఎంట్రీ ఇస్తాడు. ఇప్పటి నుంచి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి రాజు.. ఈ ప్రదీప్ మాచిరాజు అని చెబుతాడు. తద్వారా హోస్టింగ్ బాధ్యతలను రష్మి గౌతమ్ నుంచి తాను తీసుకున్నట్లుగా హింట్ ఇచ్చాడు.

Recommended For You
నా శాపం గట్టిగానే.. ఆ హీరో ఇంకా కోలుకోలేదు... యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్
నా శాపం గట్టిగానే.. ఆ హీరో ఇంకా కోలుకోలేదు... యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్

మొత్తం సండే మనదేనని ఈటీవీలో వచ్చిన మార్పులపై ఆది, ప్రదీప్‌లు పంచ్‌లు వేస్తుంటారు. ఆ తర్వాత గ్యాలరీలో కూర్చొన్న అభిమానిని బాగా చదువుతున్నావా, ఆడుతున్నావా అని అడగ్గా తగ్గేదే లేదని ఆన్సర్ ఇస్తుంది. మరి మార్క్స్ అని ప్రదీప్ ప్రశ్నించగా.. అవి కొంచెం తగ్గుతున్నాయని చెబుతుంది. మరో అమ్మాయి లేచి మీ వల్ల నేను ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతున్నాను అని చెబుతుంది.. పేపర్ ఏమైనా టఫ్ వచ్చిందా అని ప్రదీప్ అడగ్గా నా వాల్ పేపర్‌లో మీరే ఉన్నప్పుడు ఇక ఎగ్జామ్ ఎలా చదువుతా చెప్పండి అని ఇన్‌డైరెక్ట్‌గా ప్రపోజ్ చేయడంతో ప్రదీప్ సిగ్గుతో డ్యాన్స్ చేస్తాడు.

You May Also Like
లాబీయింగ్‌తోనే ధనుష్‌కు నేషనల్ ఫిల్మ్ అవార్డ్? హీరో తండ్రి దిమ్మతిరిగే కౌంటర్
లాబీయింగ్‌తోనే ధనుష్‌కు నేషనల్ ఫిల్మ్ అవార్డ్? హీరో తండ్రి దిమ్మతిరిగే కౌంటర్

ఆ వెంటనే సీనియర్ హీరోయిన్ మహేశ్వరి ఈవెంట్‌లో సందడి చేశారు. ఇన్విటేషన్ వచ్చింది అది మీ పెళ్లికే అనుకున్నాను అని మహేశ్వరి అనడంతో ప్రదీప్ షాక్ అవుతాడు. ఈ సంగతి పక్కన పెట్టండి.. అసలు మీ పెళ్లెప్పుడు అని మళ్లీ అడుగుతుంది మహేశ్వరి. దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సైలెంట్‌గా ఉండిపోతాడు ప్రదీప్. పెళ్లి సినిమాలో పృథ్వీ అని ఓ సైకో ఉన్నాడు, అలాంటోడు ఇక్కడ కూడా ఉన్నాడు తెలుసా అని మహేశ్వరి చెబుతుండగా.. హైపర్ ఆది కల్పించుకుని ఎవడు వాడు, వాడి సంగతి నేను చూసుకుంటానని చెబుతాడు. నేను మాట్లాడింది నీ గురించే బాబు నువ్వు ఇక్కడే ఉన్నావా అని మహేశ్వరి పంచ్ విసరడంతో ఆది అవాక్కవుతాడు. మాజీ జబర్దస్త్ యాంకర్ సౌమ్యారావు నడిగ్, ఫైమా - పొట్టి నరేష్‌, అత్తా కోడళ్లతో చేసిన సందడి ఈ వారం హైలైట్‌గా నిలిచింది. మరి ఈ సరదాలు, అల్లరి తెలియాలంటే ఆ ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X