లాబీయింగ్‌తోనే ధనుష్‌కు నేషనల్ ఫిల్మ్ అవార్డ్? హీరో తండ్రి దిమ్మతిరిగే కౌంటర్
72వ జాతీయ చలనచిత్ర అవార్డులను జూలై 18వ తేదీన భారత ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 జనవరి 1వ తేదీ నుంచి 2024 డిసెంబర్ 31 మధ్య కాలంలో విడుదలైన సినిమాలకు సంబంధించి ఈ అవార్డులను ప్రకటించింది. ఈ పురస్కారాల్లో ఆర్టికల్ 370 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా.. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ బెస్ట్ పాపులర్ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డ్ సొంతం చేసుకుంది. మమ్ముట్టి- కార్తీక్ ఆర్యన్‌లకు ఉత్తమ నటుడి అవార్డ్‌ను సంయుక్తంగా ప్రకటించారు. ఉత్తమ నటిగా యామీ గౌతమ్.. బెస్ట్ డైరెక్టర్‌గా అమరన్ దర్శకుడు రాజకుమార్ పెరియా సామి ఎంపికయ్యారు.
అయితే 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలపై కొందరు పెదవి విరుస్తున్నారు. కొందరు నటులకు అన్యాయం జరిగిందని, సరైన విధంగా ఎంపిక జరగలేదని, కొందరు లాబీయింగ్ ద్వారా అవార్డ్ దక్కించుకున్నారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కి అవార్డ్ రావడంపై కొందరు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ పలుకుబడి, లాబీయింగ్ ద్వారానే ధనుష్ నేషనల్ అవార్డ్ జ్యూరీని ప్రభావితం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ వార్తలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. దీనికి హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఘాటుగా బదులిచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ మూవీకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డ్ దక్కింది. అలాగే ధనుష్ హీరోగా నటించిన అడ్వెంచర్ మూవీ కెప్టెన్ మిల్లర్‌కు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఫర్ ప్రమోటింగ్ నేషనల్, సోషల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ వాల్యూస్ విభాగంలో అవార్డ్ దక్కింది. ధనుష్ నటించిన రెండు సినిమాలకు ఒకేసారి జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో అవార్డ్ దక్కడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధనుష్ తన పరపతిని ఉపయోగించి నేషనల్ అవార్డ్స్ సంపాదించారని ఆరోపిస్తున్నారు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు.
ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ధనుష్ రాజకీయ రంగ ప్రవేశం, జాతీయ అవార్డులపై వస్తున్న విమర్శలపై క్లారిటీ ఇచ్చారు. రికమెండేషన్ లేదా రాజకీయ పరమైన పరపతి ద్వారా ధనుష్ ఈ అవార్డులు పొందారన్న వార్తలు అవాస్తవం. అలా అనుకుంటే తమిళ చిత్ర పరిశ్రమలో తమ కంటే పలుకుబడి కలిగినవారు, రాజకీయ నాయకులను ప్రభావితం చేయగలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. పరిచయాల ద్వారానే అవార్డులు పొందే వీలుంటే వారు కూడా అలాగే చేసేవారు కదా. జాతీయ చలన చిత్ర అవార్డుల ఎంపిక అనేది కేవలం ప్రతిభ, నటనా సామర్ధ్యాల ఆధారంగా స్వతంత్ర జ్యూరీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే జరుగుతుందని కస్తూరి రాజా తేల్చిచెప్పారు.
ధనుష్ ఇప్పటికే పలుమార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డులను గెలుచుకోవడమే కాకుండా హాలీవుడ్ సినిమాలలో నటించి అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందారు. అందువల్ల అక్రమ మార్గాలు, లాబీయింగ్ ద్వారా అవార్డులను పొందాల్సిన అవసరం ఆయనకు లేదు. ధనుష్ ఎప్పుడూ అవార్డుల కోసం వెంపర్లాడలేదు, మంచి కథలను సెలెక్ట్ చేసుకుని ఎలా నటించాలనే దానిపై దృష్టి పెట్టారు. కేవలం ధనుష్ ఎదుగుదల చూసి ఓర్చుకోలేక, ఆయన సాధించిన విజయాలను కించపరిచేలా ప్రయత్నిస్తున్నారని కస్తూరి రాజా మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. మరి కస్తూరి రాజా స్పందనతోనైనా ఈ వివాదానికి తెరపడుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications


