Gundeninda Gudigantalu May 1st Episode: మీనాకు చింతామణి షాక్, 25 లక్షలతో పరార్, కేటుగాళ్లతో బాలు గొడవ,.

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతూ కథను కీలక మలుపులోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా మనోజ్ విల్లా ట్రాక్‌లో సస్పెన్స్ మరింత పెరిగింది. తక్కువ ధరకు విల్లా దొరకడం వెనుక ఏదో మోసం ఉందని అనిపించినప్పటికీ, రోహిణి ఒత్తిడితో మనోజ్ ఐదు లక్షల అడ్వాన్స్ ఇచ్చాడు. మోసగాళ్లు నకిలీ ప్రామిసరీ నోట్ ఇచ్చి, ముందే రెండు రోజులు విల్లాలో ఉండమని ఆఫర్ ఇవ్వడంతో అతను పూర్తిగా నమ్మకంలో పడిపోయాడు. ఇంటికి వచ్చాక ఈ విషయాన్ని చెప్పగా, ప్రభావతి ఆనందంతో మురిసిపోతుంది. అయితే బాలు మాత్రం ఇది స్పష్టమైన మోసం అని హెచ్చరిస్తూ కుటుంబాన్ని అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తాడు. రవి, శృతి కూడా అతనికి మద్దతుగా నిలుస్తారు. చివరికి నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో అందరూ కలిసి విల్లాకు వెళ్లాలని నిర్ణయించుకోవడం కథలో ఆసక్తిని పెంచింది.

Also Read
ఆ సమయంలో సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. ముక్కు అవినాష్ ఎమోషనల్..
ఆ సమయంలో సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. ముక్కు అవినాష్ ఎమోషనల్..

ఇక మరోవైపు మీనా ట్రాక్ కూడా ఆసక్తికరంగా మారింది. కొత్త డెకరేషన్ ఆర్డర్ కోసం వెళ్లిన ఆమెకు ఫంక్షన్ హాల్‌లో అడ్డంకులు ఎదురవుతాయి. ఇదే సమయంలో చింతామణి ఎంట్రీ ఇచ్చి మీనాను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తుంది. "ఎవరు తక్కువ కొటేషన్ ఇస్తే వాళ్లకే డీల్" అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంది. మీనా కూడా ధైర్యంగా పోటీకి దిగుతుంది. కానీ చింతామణి చతురతతో తక్కువ ధర కోట్ చేసి కస్టమర్లను కన్ఫ్యూజ్ చేస్తుంది. చివరికి కస్టమర్లు ఆలోచించేందుకు టైమ్ తీసుకోవడంతో మీనా-చింతామణి మధ్య బిజినెస్ రైవల్రీ ప్రారంభమవుతుంది. ఒకవైపు విల్లా మోసం, మరోవైపు బిజినెస్ పోటీ... ఈ రెండు ట్రాక్‌లు కథను మరింత రసవత్తరంగా మార్చాయి.

Gunde Ninda Gudi Gantalu serial episode 674 May 1st 2026 here is full story

photo courtesy jiohotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో కథ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ముఖ్యంగా మీనా-చింతామణి ట్రాక్‌లో జరిగిన పరిణామాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. డెకరేషన్ బిజినెస్‌లో అడుగుపెట్టిన మీనాకు మొదటి పెద్ద షాక్ ఎదురైంది. ఇప్పటికే ఫంక్షన్ హాల్‌లో మంచి అవకాశాన్ని పొందిన మీనా, తన ప్లాన్‌ను కస్టమర్లకు వివరించి ఆర్డర్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ అనుభవం, నెట్‌వర్క్‌తో ఉన్న చింతామణి రంగంలోకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. చింతామణి తన అనుభవాన్ని ఆయుధంగా మార్చుకుని, మీనా ఇచ్చిన కొటేషన్ కంటే తక్కువ ధరను చెప్పి కస్టమర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో మీనా చెప్పిన ప్రపోజల్‌పై సందేహాలు వ్యక్తం చేసిన కస్టమర్లు, చింతామణి వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిణామంతో మీనా తీవ్ర నిరాశకు గురై, ఆర్డర్ కోల్పోయిన భావనతో ఫంక్షన్ హాల్ నుంచి వెనుదిరుగుతుంది. అయితే బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళ మీనాను కలిసి కీలక విషయాలు చెబుతుంది.

Recommended For You
Kara Day 1 Box Office Collection: 'కర' మూవీ తొలి రోజు కలెక్షన్లు.. ధనుష్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Kara Day 1 Box Office Collection: 'కర' మూవీ తొలి రోజు కలెక్షన్లు.. ధనుష్ మూవీకి ఎన్ని కోట్లంటే?

చింతామణి అంత సాదాసీదా వ్యక్తి కాదని, ఈ ఫీల్డ్‌లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్లగలదని హెచ్చరిస్తుంది. ఇప్పటివరకు కొత్తగా ఎవరూ ఈ రంగంలో నిలబడకుండా చాలా ప్రయత్నాలు చేసినట్లు చెప్పి, ఆమెతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. ఈ మాటలు మీనాలో ఆందోళనను పెంచుతాయి. కొత్తగా మొదలుపెట్టిన తన బిజినెస్‌కు ఇది పెద్ద సవాలుగా మారిందని ఆమె గ్రహిస్తుంది. ఇక మరోవైపు చింతామణి తన అసలు స్ట్రాటజీని తన అసిస్టెంట్‌తో పంచుకుంటుంది. "ఇంత తక్కువ కొటేషన్ వేస్తే లాభం ఎలా వస్తుంది?" అని అడిగిన అసిస్టెంట్‌కు ఆమె చెప్పిన సమాధానం షాకింగ్‌గా ఉంటుంది. మొదట ఆర్డర్ మన చేతిలోకి రావడమే ముఖ్యం అని, తర్వాత పెళ్లి సమయానికి పూల ధరలు పెంచి లేదా పరిస్థితిని ఉపయోగించుకుని కస్టమర్లను తన మాట వినేలా చేయడం తన ప్లాన్ అని స్పష్టం చేస్తుంది. అవసరమైతే డెకరేషన్ చేయలేమని చెప్పి ఒత్తిడి పెంచి, ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయడం తన వ్యూహమని చెబుతుంది. "ఒక దెబ్బకు రెండు పిట్టలు" అన్నట్లుగా, తక్కువ కొటేషన్‌తో ఆర్డర్ దక్కించుకుని తర్వాత లాభాలను పెంచుకోవడం ఆమె గేమ్ ప్లాన్ అని వెల్లడిస్తుంది. ఈ సంఘటనలతో మీనా-చింతామణి మధ్య బిజినెస్ పోటీ మరింత హీట్ ఎక్కింది.

Kara Movie Twitter Review: 'కర' మూవీ ట్విట్టర్ రివ్యూ .. ధనుష్‌ మూవీ ఎలా ఉందంటే?
మరోవైపు కొత్త విల్లా కొనుగోలు చేసేందుకు సిద్ధమైన మనోజ్ కుటుంబంలో ఆనందం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ప్రభావతి అయితే ఊహల్లోనే కొత్త జీవితం ప్రారంభించేసింది. "ఇకపై మనం విల్లాలోనే జీవించబోతున్నాం" అంటూ అతిగా ఉత్సాహపడుతూ, రెండు రోజుల ట్రిప్‌నే పెద్ద ఈవెంట్‌లా మార్చేసింది. విల్లాలో ఉండేందుకు ఏ చీరలు తీసుకెళ్లాలో నిర్ణయించుకోవడానికి ప్రభావతి తన అల్మిరాలోని అన్ని చీరలను బయటకు తీసి పెద్దగా హడావుడి చేస్తుంది. ఈ సమయంలో సత్యంను సహాయం అడగగా, "నాకే ఆ సెలక్షన్ తెలిస్తే నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటా?" అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పడం సన్నివేశానికి నవ్వులు తెప్పించింది. దీంతో ప్రభావతి "ఈ విషయంలో న్యాయం చేయగలది రోహిణే" అంటూ కోడలు దగ్గరకు వెళ్తుంది. అదే సమయంలో మనోజ్-రోహిణి మధ్య కాస్త రొమాంటిక్ సన్నివేశం జరుగుతుండగా, అకస్మాత్తుగా ప్రభావతి ఎంట్రీ ఇవ్వడంతో ఆ క్షణం డిస్టర్బ్ అవుతుంది. మనోజ్ పరిస్థితిని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రభావతి మాత్రం అత్యవసర పని ఉన్నట్లు రోహిణిని తన గదికి తీసుకెళ్లి, చీర సెలక్షన్‌లో సహాయం కోరుతుంది. రోహిణి ఒక చీరను ఎంపిక చేసి "ఇది మీకు చాలా బాగుంటుంది" అంటూ అత్తను మెప్పిస్తుంది. దీనిపై సత్యం మరోసారి సెటైర్ వేస్తూ, "జోగి జోగి రాసుకుంటే ఇలానే ఉంటుంది" అంటూ చమత్కరిస్తాడు.

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్.. ఈ సినిమాలు డోంట్ మిస్..
ఇక మరోవైపు మీనా తన కొత్త ఆర్డర్ కోసం పూలు సిద్ధం చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ సమయంలో శృతి తన డ్రెస్సింగ్ విషయంలో సహాయం కోరగా, మీనా పని ఒత్తిడితో "నీకు నచ్చింది వేసుకో" అంటూ సింపుల్‌గా సమాధానం ఇస్తుంది. ఇదే సమయంలో ప్రభావతి అక్కడికి వచ్చి, "ఇంకా పని అయిపోలేదా?" అంటూ మీనాపై ఒత్తిడి పెంచుతుంది. మీనా తనకు ఉదయం ఇవ్వాల్సిన ఆర్డర్ ఉందని చెప్పినా, ప్రభావతి మాత్రం "నీ పూల దుకాణం పక్కన పెట్టి, కిచెన్ పూర్తిగా క్లీన్ చేయి... మనం రెండు రోజులు బయటికి వెళ్తున్నాం" అంటూ ఆదేశాలు జారీ చేస్తుంది. పరిస్థితిని అర్థం చేసుకున్న మీనా "సరే" అంటూ అంగీకరిస్తుంది. ఇంతలో బాలు ఇంటికి వచ్చి పరిస్థితిని గమనిస్తాడు. "ఏమిటి ఈ హడావుడి?" అని మీనాను ప్రశ్నించగా, ఆమె రెండు రోజుల విల్లా ట్రిప్ కోసం పనులు చేస్తున్నామని చెబుతుంది. దీనిపై బాలు వ్యంగ్యంగా స్పందిస్తూ, "రెండు రోజులకు ఇలా అయితే, రెండు నెలలు అయితే ఎలా ఉంటుందో!" అని అంటాడు. అలాగే విల్లా డీల్‌పై తన అనుమానాలను మరోసారి వ్యక్తం చేస్తూ, "ఇది కాస్త ఎక్కువైందే... అసలు విషయం బయటపడితే అప్పుడు అర్థమవుతుంది" అంటూ హెచ్చరిస్తాడు.

You May Also Like
మా నాన్న ఉన్నా లేనట్టే.. డబ్బుల కోసం చిత్రహింసలు.. బుల్లితెర యాంకర్ భావోద్వేగం
మా నాన్న ఉన్నా లేనట్టే.. డబ్బుల కోసం చిత్రహింసలు.. బుల్లితెర యాంకర్ భావోద్వేగం

మరుసటి రోజు ఉదయం బాలు, మీనాలను మినహాయించి ప్రభావతి కుటుంబం మొత్తం విల్లాకు చేరుకోవడంతో కథ ఉత్కంఠభరితంగా మారింది. అక్కడి భారీ ఇంటిని చూసిన ప్రభావతి ఆనందానికి అవధులు లేకుండా, "ఇంత పెద్ద ఇల్లు... హాల్ సినిమా హాల్‌లా ఉంది!" అంటూ ఎక్సైట్మెంట్ వ్యక్తం చేస్తుంది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన నకిలీ ఓనర్స్, ప్రభావతిని ప్రశంసలతో ముంచెత్తుతూ ఆమెను పూర్తిగా ఇంప్రెస్ చేస్తారు. "మీరు ఎక్కడ ఉంటే అక్కడ మహాలక్ష్మి తిరుగుతున్నట్లుంది" అంటూ పొగిడడంతో ఆమె మరింత నమ్మకంలో పడిపోతుంది. ఇల్లు మొత్తం చూసిన తర్వాత మనోజ్ ముందే అనుకున్న ప్రకారం 25 లక్షల రూపాయలను వారికి అప్పగిస్తాడు. అయితే ఆ డబ్బును వారు లెక్కించకుండా తీసుకోవడం అనుమానాలకు దారితీస్తుంది. ప్రశ్నించగా "మీ మీద నమ్మకం ఉంది... లెక్కపెడితే అవమానించినట్టే" అంటూ మనోజ్‌ను నమ్మిస్తారు. కానీ రవి, శృతి మాత్రం ఈ వ్యవహారంపై సందేహాలు వ్యక్తం చేస్తూ, "ఇంత మొత్తాన్ని లెక్క చేయకుండా తీసుకోవడం సరిగ్గా లేదు" అని అనుమానం వ్యక్తం చేస్తారు.

స్ట్రాటజీ మారింది.. రామ్ చరణ్‌తో సమంత పోటీ..
స్ట్రాటజీ మారింది.. రామ్ చరణ్‌తో సమంత పోటీ..

అదే సమయంలో నకిలీ ఓనర్స్ డాక్యుమెంటేషన్ పేరుతో మనోజ్, రోహిణి, మణికంఠలతో సంతకాలు చేయించుకుని, ఇంటి తాళాలను రోహిణి చేతిలో పెట్టి "మీకు అదృష్టం కలిసి వస్తుంది" అంటూ సెంటిమెంట్ డైలాగ్ చెబుతారు. వెంటనే ఫ్లైట్‌కు టైమ్ అయిందని చెప్పి 25 లక్షలతో అక్కడి నుంచి తొందరగా వెళ్లిపోతారు. బయటకు వెళ్లాక మాత్రం "ఇంత తక్కువకు విల్లా ఇస్తే కూడా విచారణ చేయలేదు" అంటూ కుటుంబాన్ని వెక్కిరించుకుంటూ తమ అసలు రంగు బయటపెడతారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన బాలు, వెళ్లిపోతున్న వారితో ఎదురుపడటం కథలో ట్విస్ట్‌గా మారింది. వారి ప్రవర్తన చూసి అనుమానం వచ్చిన బాలు, "మీ ముఖాలు చూస్తే ఫ్లైట్ ఎక్కే వాళ్లలా లేరు... దొంగలాగా ఉన్నారు" అంటూ వారిని నిలదీస్తాడు. దీంతో మాటల తూటాలు పెరిగి చిన్న గొడవకు దారితీస్తుంది. ఈ పరిస్థితిని గమనించిన మనోజ్, సత్యం వచ్చి గొడవను ఆపుతారు.

వారు వెళ్లిన తర్వాత మనోజ్, "వాళ్లు ఇంటి ఓనర్స్" అని చెప్పడంతో బాలు షాక్ అవుతాడు. "ఇంత పెద్ద ఇల్లు ఉన్నవాళ్లు టాక్సీలో ఎందుకు వెళ్తారు?" అంటూ మరింత అనుమానం వ్యక్తం చేస్తాడు. కానీ మనోజ్ మాత్రం వారు విదేశాలకు వెళ్తున్నారని చెప్పి విషయాన్ని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ బాలుకు ఏదో పెద్ద మోసం జరుగుతోందనే భావన తొలగదు. మరోవైపు ప్రభావతి మాత్రం ఈ అనుమానాలను పట్టించుకోకుండా, "మనోజ్ ఎదుగుతున్నాడు అంటే నువ్వు ఓర్వలేకపోతున్నావు" అంటూ బాలుని మందలిస్తుంది. దీంతో బాలు బాధతో మౌనం వహిస్తాడు. ఇక అత్త-కోడలు కలిసి ఇల్లు మొత్తం తిరిగి చూసి ఎంతో సంతోషపడుతుండగా, ప్రభావతి మాత్రం విల్లాలోనే రాజసంగా కూర్చొని తన ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. సోఫాలో కాలు మీద కాలు వేసుకొని, మీనాను టార్గెట్ చేస్తూ "నీ పూల దుకాణం మూసేయాలి... ఆ పని మొత్తం రోజైనా పూర్తవదు" అంటూ ఎగతాళి చేస్తుంది.

విజయ్ దేవరకొండకు జోడీగా మహేష్ బాబు బ్యూటీ! ఇది రష్మిక మందన్నా ప్లానింగా ?
విజయ్ దేవరకొండకు జోడీగా మహేష్ బాబు బ్యూటీ! ఇది రష్మిక మందన్నా ప్లానింగా ?

ఈ వ్యాఖ్యలకు బాలు వెంటనే కౌంటర్ ఇస్తూ, "ఎవరి ఇల్లు ఎవరు క్లీన్ చేయాలి... మాకు పని లేదా?" అంటూ ప్రశ్నిస్తాడు. అయినా ప్రభావతి తగ్గకుండా, "మనోజ్ ఈ స్థాయికి రావడానికి రోహిణి అదృష్టమే కారణం" అంటూ కోడల్ని పొగిడుతూ మీనాను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. దీనికి బాలు సెటైర్ వేస్తూ, "అలా అయితే మా నాన్నకు 30 ఏళ్ల క్రితమే అన్యాయం జరిగిందన్నమాట... మా అమ్మ అదృష్టవంతురాలు అయితే ఆయన కూడా అప్పుడే ఎదిగేవాడు" అని చెప్పడంతో సన్నివేశం కాస్త హీట్ అవుతుంది. ఈ టెన్షన్‌ను తగ్గించేందుకు ప్రభావతి వెంటనే టాపిక్ మార్చి, మీనాకు కాఫీ చేయమని ఆదేశిస్తుంది. అయితే కిచెన్‌కు వెళ్లిన మీనా "పాలు విరిగిపోయాయి" అని చెప్పడంతో పరిస్థితి కొంచెం అసౌకర్యంగా మారుతుంది. ఈ సందర్భంలో మనోజ్ "పర్లేదు... న్యూమరాలజిస్ట్ వస్తున్నారు కదా, అందరికీ ఒకేసారి కాఫీ పెడదాం" అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు.

ఇక్కడే కథలో మరో ట్విస్ట్ ఎంటర్ అవుతుంది. "న్యూమరాలజిస్ట్ ఎందుకు?" అని బాలు ప్రశ్నించగా, ఇంటికి పేరు పెట్టేందుకు పిలిపించానని మనోజ్ చెబుతాడు. దీనిపై బాలు ఆశ్చర్యపోతూ "మనుషులకు పేర్లు పెడతారని విన్నాం... ఇళ్లకూ పేర్లు పెడతారా?" అంటూ వ్యంగ్యంగా స్పందిస్తాడు. కానీ మనోజ్ మాత్రం ఆ న్యూమరాలజిస్ట్ గొప్పతనాన్ని చెప్పుకుంటూ అతనిపై అంధ విశ్వాసాన్ని చూపిస్తాడు. విల్లాకు ఇప్పటికే చేరుకున్న కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, మీనాక్షి ఎంట్రీతో వాతావరణం కొంత మారుతుంది. వెంటనే న్యూమరాలజిస్ట్ "అర ముఖం" గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడంతో సన్నివేశం మరో మలుపు తిరుగుతుంది. మనోజ్ స్నేహితుడు మణికంఠ అతని కాళ్లపై పడుతూ అతడిని భక్తితో స్వాగతించడం, అతని పట్ల కుటుంబంలో ఉన్న అంధ విశ్వాసాన్ని చూపిస్తుంది.

నా భార్యపై ట్రోలింగ్ ఆపండి.. బిగ్‌బాస్ నటుడు ఆవేదన
నా భార్యపై ట్రోలింగ్ ఆపండి.. బిగ్‌బాస్ నటుడు ఆవేదన

ఇంట్లోకి వచ్చిన న్యూమరాలజిస్ట్ మొదట అందరితో సంఖ్యలు చెప్పిస్తూ "ప్రతి సంఖ్యకు ఒక శక్తి ఉంటుంది" అంటూ న్యూమరాలజీ ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రయత్నిస్తాడు. అనంతరం ఇంటికి పేరు పెట్టే ప్రక్రియను ప్రారంభిస్తూ, ఎవరి పేరుపై పెట్టాలో అడుగుతాడు. బాలు "మనోజ్ పేరుపైనే చూడండి" అని చెప్పగానే, న్యూమరాలజిస్ట్ ఆశ్చర్యకరంగా స్పందిస్తూ "మనోజ్ అంటే సున్న... నీ దగ్గర ఏమీ ఉండదు, నిన్ను నమ్మిన వాళ్లూ ముంచేస్తారు" అని చెప్పడం అందరిని షాక్‌కు గురి చేస్తుంది. దీనిపై బాలు వెంటనే వ్యంగ్యంగా స్పందిస్తూ, "పెళ్లి టైమ్‌లోనే ముంచేశారు కదా" అని సెటైర్ వేస్తాడు. తర్వాత రోహిణి పేరును చూసి "ఆమె కూడా బలహీనమే" అని వ్యాఖ్యానిస్తాడు. కానీ ప్రభావతి పేరు చూసినప్పుడు మాత్రం "ఈ పేరుకు చాలా వెయిట్ ఉంది... చాలా పవర్‌ఫుల్" అని చెప్పడం హాస్యానికి దారితీస్తుంది. దీనిపై శృతి "మా అత్తయ్యకు కూడా వెయిట్ ఎక్కువే" అంటూ పంచ్ వేయడంతో సన్నివేశం నవ్వులు పూయిస్తుంది.

నా కులం కారణంగా ఛాన్స్‌లు ఇవ్వలేదు.. బిగ్ బాస్ సెలెబ్రిటీకి చేదు అనుభవం..
నా కులం కారణంగా ఛాన్స్‌లు ఇవ్వలేదు.. బిగ్ బాస్ సెలెబ్రిటీకి చేదు అనుభవం..

చివరికి రోహిణిలోని "రో", మనోజ్‌లోని "మా", ప్రభావతిలోని "తి" కలిపి "రోమతి" అనే పేరును ఇంటికి సూచిస్తాడు. ఈ పేరు వింతగా ఉందని శృతి, బాలు ఇద్దరూ విమర్శించినా, రోహిణి మాత్రం తన పేరు కలిసొస్తుందనే కారణంతో దాన్ని ఫైనల్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఫీజు విషయానికి వస్తే, న్యూమరాలజిస్ట్ "జస్ట్ 20 వేలు" అని చెప్పడంతో సత్యం షాక్ అవుతాడు. "మూడు అక్షరాలు పెట్టి 20 వేలా?" అంటూ ప్రశ్నిస్తాడు. కానీ న్యూమరాలజిస్ట్ తనను తాను గొప్పగా చెప్పుకుంటూ "నేను పేరు పెడితే ఎక్కడున్నా వాళ్లు నా దగ్గరికి వస్తారు" అని చెప్పడం మరింత హాస్యాస్పదంగా మారింది. దీనిపై బాలు "కొట్టడానికి వస్తారా?" అని కౌంటర్ వేయడంతో నవ్వులు పూశాయి.
మొత్తంగా ఈ ఎపిసోడ్ ఫన్నీ ఎండింగ్‌తో ముగిసింది. ఒకవైపు న్యూమరాలజీ పేరుతో జరిగే డ్రామా, మరోవైపు విల్లా డీల్‌లో దాగి ఉన్న మోసం-ఈ రెండు ట్రాక్‌లు కలిసి కథను మరింత ఆసక్తికరంగా మలుస్తున్నాయి. ఇక రాబోయే ఎపిసోడ్‌లలో మీనా-చింతామణి మధ్య పోటీ ఎలా ముదురుతుందో, అలాగే మనోజ్ మోసపోయిన విషయం బయటపడినప్పుడు బాలు ఎలా స్పందిస్తాడో అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X