Gunde Ninda Gudi Gantalu: బిడ్డ ఇంట్లో చిచ్చుపెట్టిన శోభ.. బాలు ముందే తాళిని తీసేసిన మీనా..

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో బాలు తన ఫ్రెండ్స్ తో కలిసి బార్లో ఫుల్లుగా తాగుతాడు. ఆ తర్వాత సైలెంట్ గా ఇంటికి చేరుకుంటాడు. కానీ మీనా కు అనుమానం వస్తుంది. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లాగా మీనా ఓ టెస్ట్ పెడుతుంది. కానీ, ఆ టెస్ట్ లో బాలు దొరికిపోతాడు. ఆ తర్వాత తిందామని రమ్మని బాలును డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళుతుంది మీనా. ఇంతలోనే శృతి, రవి బయటికి వెళ్లి వస్తారు. వారిని కూడా తిందాం రమ్మని పిలుస్తుంది మీనా. కానీ, తాము బయటనే తినొచ్చామని బదులిస్తారు. దీంతో బాలుకి కోపం వస్తుంది. తినే ప్లేట్ ను కింద పడేసి, ఆలుమగలు ఇష్టం ఉన్నట్లు బయట బలాదూర్ గా తిరిగివచ్చి, బయటనే తిని వచ్చామని చెబితే ఎలా? మీ కోసం మీనా కష్టపడి చపాతీలు చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు బాలు.

యంగ్ హీరోయిన్ కి స్పెషల్ ట్రిట్ ఇచ్చిన ప్రభాస్‌.. డార్లింగ్ గురించి తెలిసిందేగా..
సారీ చెప్పినా బాలు పట్టించుకోకుండా రవిని లాక్కొచ్చి నోట్లో చపాతీలను కుక్కుతాడు. దీంతో శృతికి కోపం వస్తుంది. బుద్ధి లేదా చెబితే వినిపించుకోవా.. తాము బయట తినొచ్చామని చెప్తున్నా కదా.. పాడైతే డస్ట్ బిన్ లో పాడేయండి .. కానీ బలవంతంగా నోట్లో కుక్కుతారా ? అంటూ పొగరుగా సమాధానమిస్తుంది. ఈ క్రమంలో బాలుకి, శ్రుతికి మాటమాట పెరుగుతుంది. ఈ విషయం ఆల్రెడీ తనకు రవి చెప్పాడని, బాలు రోజు పీకలదాకా తాగి వచ్చి ఇంట్లో కూడా వచ్చేస్తాడని, ఇల్లును వారి జోన్ గా మార్చాలని రవి చెప్పాడని శృతి అంటుంది. దీంతో బాలు కోపం మరింత పెరుగుతుంది. ఏరా ఇంటికి వచ్చే ముందే నీ పెళ్ళానికి అన్ని విషయాలు చెప్పావా.. నేను మాత్రమే తాగుతానని చెప్తావా.. మనం నీ బర్త్ డే నాడు దాబాపై తాగిన విషయాన్ని నీ పెళ్ళాన్ని చెప్పలేదా? అని బర్త్ డే పార్టీ గురించి చెప్పి ఆలుమగల మధ్య చిచ్చుబెడుతాడు బాలు.

Gunde Ninda Gudi Gantalu serial expected episode 350 February 3rd 2024 here is full story

ఇక అప్ కమ్మింగ్ ఎపిసోడ్ లో మనోజ్ రవి తమరు తాము కవరింగ్ చేసుకోవడానికి తిప్పలు పడతారు. ఏదో బర్త్డే పార్టీ జోష్ లో తాను తాగానని రవి చెబుతాడు. మనోజ్ మాత్రం తనని బలవంతం చేసి తాగిపిచ్చారంటూ అబద్ధం చెప్తాడు. బలవంతం చేస్తే మూడు బీర్లు తాగుతారా అని బాలు ఇరికిస్తాడు. దీంతో ప్రభావతి అవమానంగా ఫీల్ అవుతుంది. మరోవైపు రూమ్ లోకి ఉంది అంటూ మనోజ్ కి రోహిణి వార్నింగ్ ఇస్తుంది. ఇక శృతి కూడా రవి మీద మండిపడుతుంది.

Marco OTT: ఓటీటీలోకి మార్కో మూవీ.. మోస్ట్ వయెలెంట్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరుసటి రోజు ఉదయం శ్రుతి వాళ్ళ తల్లి శోభ తన ప్లాన్ లో భాగంగా ప్రభావతి ఇంటికి చేరుకుంటుంది. తన ఐశ్వర్యాన్ని చూపించుకుని ప్రయత్నం చేస్తుంది. తన కూతురికి బంగారు ఆభరణాలు తీసుకువచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. శృతి వాటిని అంగీకరించకపోయినా ప్రభావతి వాటిని తీసుకునేలా చేస్తుంది. ఈ సమయంలో మీనాను అవమానించేలా శోభ మాట్లాడుతూ.. ఇంతకీ మీ రెండో కోడలు ఎంత తీసుకొచ్చింది అంటూ చిచ్చుపెడుతుంది. దీంతో ప్రభావతి తన అక్కసు బయట పెడుతూ.. మేమే ఎదురు కట్టిన ఇచ్చి మరి మీనాను పెళ్లి చేసుకుందాం.. అయినా వాళ్ల స్థాయి అంతే కదా..., పూలు అమ్ముకునే వాళ్ళు ఏం పెడతారు అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది.

దీంతో మీనా అవమానంగా భావిస్తోంది. మీరు ఇచ్చిన బంగారం మీరే తీసుకోండి అంటూ తన అత్తయ్యకు బంగారం ఇచ్చేస్తుంది. అయినా ప్రభావతి కనికరం లేకుండా నీ మెడలో వేసిన తాళి కూడా మేం పెట్టింది అంటుంది. దీంతో ఎవరు ఊహించిన విధంగా మీనా నిర్ణయం తీసుకుంటుంది. అందుకే మీరు పెట్టిన తాళిబొట్టుని కూడా తీసుకువచ్చాను అంటూ తన మెడలో తాళిబొట్టును తీసి ప్రభావతికి ఇస్తుంది. తన పుట్టింటి వారి పేదరికానికి సాక్ష్యంగా తాను పసుపు కొమ్మును కట్టుకున్నానని అందరికీ చూపిస్తుంది. దీంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. మెయిన్ గా ప్రభావతి నోట్లో నుండి మాట కూడా రాదు. ఈ ఘటనతో బాలు ఇంటి నుండి వెళ్లిపోతాడా.. లేదా రవి శృతి ఇంట్లో ఉండి వెళ్ళిపోతారా అనేది వేచిచూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X