జబర్దస్త్ వర్ష దిమ్మతిరిగే సంపాదన... నెలకు ఆదాయం ఎన్ని లక్షలంటే?

తెలుగువారి టాప్ కామెడీ షో జబర్దస్త్‌లో ఒకప్పుడు లేడీ గెటప్స్‌ను కూడా మగాళ్లు వేసేవారు. అయితే ఆ తర్వాతి కాలంలో లేడీ కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చారు. సత్యశ్రీ, రోహిణి, ఫైమా తదితరులు మేల్ డామినేషన్ ఉన్న జబర్దస్త్‌లో తమ పంచ్‌లు, సెటైర్లు, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ కోవలోకే వస్తారు వర్ష. హీరోయిన్లను మించే అందంతో మెరిసిపోయే వర్ష.. కామెడీలోనూ తనదైన స్టైల్‌లో సత్తా చాటారు. జబర్దస్త్‌తో ఫేమస్ కావడంతో ఆమెకు వివిధ ఛానెల్స్‌, సినీ రంగం నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జబర్దస్త్ వర్ష రెమ్యునరేషన్ ఎంత? నెలకు ఆమె ఎంత? సంపాదిస్తోంది? అనేది ఆసక్తిగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
సొంత ఇంటిని శివజ్యోతి ఖాళీ.. కంటతడితో అద్దె ఇంట్లోకి, బిగ్‌బాస్ బ్యూటీకి ఏమైంది?
సొంత ఇంటిని శివజ్యోతి ఖాళీ.. కంటతడితో అద్దె ఇంట్లోకి, బిగ్‌బాస్ బ్యూటీకి ఏమైంది?

హైదరాబాద్‌కు చెందిన జబర్దస్త్ వర్ష తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన వర్ష తొలుత తెలుగు బుల్లితెరపై సీరియల్స్‌తో అడుగుపెట్టారు. అభిషేకం, ప్రేమ ఎంత మధురం, మనసిచ్చి చూడు తదితర సీరియల్స్‌లో నటించింది. అలాగే 2018లో వచ్చిన మన్యం అనే మూవీలో ఓ చిన్న పాత్ర పోషించింది. సీరియల్స్‌ చేస్తున్న దశలోనే ఈటీవీలో ప్రసారమవుతున్న మెగా కామెడీ షో జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది.

Jabardasth Varsha s Monthly Income Here s How Much the Popular TV Actress Reportedly Earns

జబర్దస్త్‌లో అడుగుపెట్టిన తర్వాత వర్ష కెరీర్ అనూహ్య మలుపు తిరిగింది. అందం విషయంలో జబర్దస్త్ యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌లతో పోటీపడుతూ ఆ షోకి గ్లామర్ అద్దారు. ఇక ఇమ్మాన్యుయేల్‌తో పరిచయం అతనితో కలిసి చేసిన స్కిట్స్, వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ వర్షను మరింత ఫేమస్ చేసింది. వీరిద్దరి మధ్య నిజంగా ప్రేమాయణం సాగుతోందని.. పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారంటూ అభిమానులు ప్రశ్నించేవారు. అయితే తాము కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకుమించి మా మధ్య ఏం లేదని వీరిద్దరూ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.

Recommended For You
రెమ్యునరేషన్ పెంచిన హైపర్ ఆది? జబర్దస్త్‌లో రీ ఎంట్రీ తర్వాత పారితోషికం ఎంతంటే?
రెమ్యునరేషన్ పెంచిన హైపర్ ఆది? జబర్దస్త్‌లో రీ ఎంట్రీ తర్వాత పారితోషికం ఎంతంటే?

ఎన్ని ఆఫర్లు వచ్చినా బుల్లితెరను మాత్రం వదిలిపెట్టకుండా తన పని తాను చేసుకుపోతోంది వర్ష. అయితే తనకు హీరోయిన్‌గా చేయాలనే ఆశ మాత్రం నెరవేరలేదని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసింది. కానీ మంచి పాత్రలు వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తానని చెబుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగచైతన్య తనకు ఇష్టమైన హీరోలని.. వీరి సినిమాలలో కనుక అవకాశం వస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటానని తెలిపింది. వర్షకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది . ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లలో వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటారు ఈ ముద్దుగుమ్మ. ఇక హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రాళ్లని పిచ్చెక్కిస్తుంటుంది.

You May Also Like
'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’
'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’

జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇతర షోలు, ప్రైవేట్ ఈవెంట్స్, మాల్స్ ఓపెనింగ్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు వర్ష. దాంతో ఆమె నెలకు ఎంత సంపాదిస్తారు? అంటూ నెటిజన్లు ఆరా తీస్తుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం .. వర్ష నెలకు 10 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారట. సంపాదించడమే కాదు సాయం చేయడంలోనూ వర్ష ముందుంటారు. కొన్నేళ్ల క్రితం తన ఇంటి వాచ్‌మెన్‌ కొడుకు చదువుకు అయ్యే ఖర్చును ఆమె భరించారు. ఈ విషయాన్ని స్వయంగా వర్ష వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X