సొంత ఇంటిని శివజ్యోతి ఖాళీ.. కంటతడితో అద్దె ఇంట్లోకి, బిగ్‌బాస్ బ్యూటీకి ఏమైంది?

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌లో ప్రసారమైన తీన్మార్ వార్తలతో ఫేమస్ అయ్యారు తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి అలియాస్ జ్యోతక్క. తెలంగాణ యాసలో సెటైరికల్‌గా ఆమె హోస్ట్ చేసిన ఈ కార్యక్రమం తెలుగునాట పాపులర్ అయ్యింది. ఈ షోతో వచ్చిన ఫేమ్‌తో బిగ్‌బాస్‌లోనూ అవకాశం దక్కించుకున్నారు సావిత్రి. గంగూలీ అనే వ్యక్తితో ప్రేమలో పడి ఆయనను వివాహం చేసుకున్నారు శివజ్యోతి. అయితే పెళ్లయి పదేళ్లు కావొస్తున్నా పిల్లలు లేకపోవడంతో ఆమె ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శివజ్యోతి ఇటీవల గర్బం దాల్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం పాపతో ఆడుకుంటూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు శివజ్యోతి. అయితే హైదరాబాద్‌లో ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇంటిని శివజ్యోతి దంపతులు ఖాళీ చేసి అద్దె ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో శివజ్యోతి ఎందుకు ఇల్లు ఖాళీ చేసింది? దీనికి తీసిన కారణాలపై ఆమె స్వయంగా వీడియోలో క్లారిటీ ఇచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’
'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’

మొన్న త్రీ బీహెచ్‌కే ఫ్లాట్‌కి షిఫ్ట్ అయినప్పుడే సామాన్లు సర్దుకోవడానికి వారం రోజులు పట్టింది. ఇక్కడ కూడా వారం రోజులు పట్టింది? మేం ఎందుకు షిఫ్ట్ అయ్యాం? ఎక్కడికి షిఫ్ట్ అయ్యాం? ఆ ఇల్లు ఏం చేశాం? ఇల్లు కొనుక్కున్నామా? ఇలాంటి డౌట్స్ వస్తాయి కాబట్టి అవన్నీ క్లియర్ చేయడానికే ఈ వీడియోను చేస్తున్నా. గతంలోనే నా హోమ్ టూర్ వీడియో చేసినప్పుడు కమ్యూనిటీకి ఎందుకు వెళ్లానో చెప్పాను. కమ్యూనిటీ వల్ల అన్ని సదుపాయాలు ఉంటాయి.. పిల్లలకు సెక్యూరిటీ కూడా బాగుంటుందని అనుకున్నా. మేం అప్పుడే విల్లా తీసుకోవాల్సింది.. కాకపోతే మా బడ్జెట్‌లో సిటీకి చాలా దూరంగా దొరికాయి. నాకు డ్రైవింగ్ రాదు.. 9 గంటల నుంచి 5 గంటల మధ్య జాబ్.. ఈ కారణాలతో విల్లా కొనాలనే ఆలోచనను విరమించుకున్నాం.

Shiva jyothi Reveals the Real Reason Behind Moving to a Rented Villa After Motherhood

అందుకే మంచి ఏరియాలో 3 బీహెచ్‌కే ఫ్లాట్ తీసుకున్నాం.. చాలా ఇష్టపడి, కష్టపడి ప్రతి కార్నర్ దగ్గరుండి డిజైన్ చేయించుకున్నాం. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఎందుకు ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది అనేది చూస్తే. విల్లాకి షిఫ్ట్ అయ్యాం.. కొనేశామని, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకోవద్దు. కిరాయికే వచ్చాం.. మరి ఆ ఇల్లు ఏం చేస్తావని మీరు అనుకోవచ్చు.. ఆ ఇంటిని కిరాయికి ఇచ్చాం. ఇదంతా ఎందుకు చేశానో నన్ను ఇష్టపడేవాళ్లు తెలుసుకోవాలి కదా? అందుకే ఇదంతా చెబుతున్నా. పాప పుట్టింది, నాకు పాపని చూసుకోవడానికి మా అమ్మ, ఫుల్ టైం కేర్ టేకర్ ఒకరు ఉన్నారు. అక్కడున్నది 3 బీహెచ్‌కే ఫ్లాట్.. హాల్ అనేది సెపరేట్‌గా ఏం లేదు. అదే డైనింగ్ ఏరియా.. వెన్నెలకు ఆడుకోవడానికి ప్లేస్ లేకుండా పోయింది.

Recommended For You
లాబీయింగ్‌తోనే ధనుష్‌కు నేషనల్ ఫిల్మ్ అవార్డ్? హీరో తండ్రి దిమ్మతిరిగే కౌంటర్
లాబీయింగ్‌తోనే ధనుష్‌కు నేషనల్ ఫిల్మ్ అవార్డ్? హీరో తండ్రి దిమ్మతిరిగే కౌంటర్

మా అమ్మ ఊరి నుంచి రావడంతో ఆమెకు ఇలా 3 బీహెచ్‌కే ఫ్లాట్‌లో ఉండటం కష్టంగా ఉంది. మరోవైపు డెలివరీ తర్వాత వచ్చే సమస్యలతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా.. కరోనా టైంలో కూడా పనిచేశా, ఎప్పుడు ఇంట్లో ఉండిపోలేదు. అలాంటిది పాపను చూసుకుంటూ అక్కడే ఉండిపోవడం కష్టంగా ఉంది. కేర్ టేకర్‌కి సెపరేట్ రూమ్ ఇవ్వాలి, మా అమ్మకి కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు ఇవన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. మేం మణికొండను విడిచిపెట్టి బతకలేం.. మా వ్యవస్థ, పనులు అన్నీ ఈ ఏరియా చుట్టూనే తిరుగుతాయి. మణికొండకు దగ్గరగా ఉండేటట్లు ఒక ఏరియాలో విల్లాకు రెంట్‌కి వచ్చాం. ఓనర్స్ చాలా మంచోళ్లు.. ఇంటిని బాగా డిజైన్ చేయించుకున్నారు, మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుని ఏమైనా కావాలా అని అడిగారు.

You May Also Like
ఆ నటుడి ఫోటోను నిప్పుల్లో కాల్చి.. బుల్లితెర నటి కావ్యశ్రీ సీరియస్
ఆ నటుడి ఫోటోను నిప్పుల్లో కాల్చి.. బుల్లితెర నటి కావ్యశ్రీ సీరియస్

ఇక్కడి నుంచి ఖాళీ చేస్తే మేం నేరుగా విల్లాలోకే వెళ్తాం.. కొనగలిగే శక్తి ఉంటే విల్లా కొంటాం, లేకపోతే మాకు కిరాయికి వచ్చే డబ్బుతో ఇలాగే ఏదో ఒక విల్లాలో కిరాయికి ఉంటాం. రేపొద్దున ఇంకో బేబీ వస్తే పిల్లలు ఆడుకునే వస్తువులు, వాళ్లని చూసుకునే మనుషులు అన్నీ ఎక్కువైపోతాయి అందుకే విల్లానే బెటర్. కొత్తి ఇల్లు చాలా బాగుంది, పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి.. కమ్యూనిటీ బాగుంది. కొన్ని చోట్ల కిరాయికి ఇంటి కోసం వెతుకుంటే ఓనర్స్ తీరు నచ్చలేదు.. పెళ్లి చేసుకోవడానికే కాదు అద్దె ఇల్లు కూడా గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్లకే ఇస్తారని ఇప్పుడే తెలిసింది.

ఆ హీరో అంటే పిచ్చి క్రష్.. అలా మనసు పారేసుకున్న కాజల్ అగర్వాల్
ఆ హీరో అంటే పిచ్చి క్రష్.. అలా మనసు పారేసుకున్న కాజల్ అగర్వాల్

విల్లా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, మాకున్న ఈఎంఐలు క్లియర్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి అందుకే ఈ షిఫ్ట్. రెండు మూడేళ్ల తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. మళ్లీ అందరికీ చెబుతున్నా.. మేం ఇక్కడికి రెంట్‌కి వచ్చాం, కొంటే గనుక ఖచ్చితంగా చెబుతా. టెక్నికల్ వర్క్ జరుగుతోంది, పాపకి ఆడుకునేందుకు మంచి ప్లేస్ దొరికింది. ఫ్లాట్‌లో ఉన్నప్పుడు మేం నలుగురమే ఉండేవాళ్లం, మేం కాకుండా ఎవరైనా ఏడిస్తే పాప ఏడ్చేది... కానీ ఇక్కడికి వచ్చాక మార్పులు కనిపిస్తున్నాయి. త్వరలో అన్నప్రాసన జరగబోతోంది. నేను ఫైనల్‌గా చెప్పేడి ఏంటంటే.. చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటారో, తల్లిని కూడా అలాగే చూసుకోండి అని శివజ్యోతి సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X