రెమ్యునరేషన్ పెంచిన హైపర్ ఆది? జబర్దస్త్‌లో రీ ఎంట్రీ తర్వాత పారితోషికం ఎంతంటే?

జబర్దస్త్ వేదిక ద్వారా ఎందరో ప్రతిభావంతులు పరిచయమై అందరినీ నవ్వించారు. ఇక్కడి నుంచి వెళ్లిన వారు సినీ రంగంలో కమెడియన్లుగా, దర్శకులుగా, హీరోలుగా రాణిస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు హైపర్ ఆది. తన పంచ్‌లు, ప్రాసలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు ఆది. జబర్దస్త్‌లో సక్సెస్ కావడంతో ఆయనకు సినీరంగం నుంచి ఆఫర్లు వచ్చాయి. అక్కడ కమెడియన్‌గా, రచయితగా రాణించారు. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ తదితర కార్యక్రమాలలో అలరిస్తున్నారు ఆది. అయితే జబర్దస్త్‌లో ఆది కనిపించకపోవడంతో ఆ పంచ్‌లు,సెటైర్లను ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. ఈ లోటును పూరించడానికి, అభిమానులను తిరిగి అలరించడానికి జబర్దస్త్‌లోకి ఆది రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే జబర్దస్త్ సెకండ్ ఇన్నింగ్స్‌లో హైపర్ ఆది తన రెమ్యునరేషన్ పెంచేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
సొంత ఇంటిని శివజ్యోతి ఖాళీ.. కంటతడితో అద్దె ఇంట్లోకి, బిగ్‌బాస్ బ్యూటీకి ఏమైంది?
సొంత ఇంటిని శివజ్యోతి ఖాళీ.. కంటతడితో అద్దె ఇంట్లోకి, బిగ్‌బాస్ బ్యూటీకి ఏమైంది?

ప్రకాశం జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఆది చదువులో టాపర్. బీటెక్‌ను మంచి మెరిట్‌తో పూర్తి చేసిన ఆయన హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించారు. అయితే తనలోని నటుడు మాత్రం ఆయనను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. కొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి ఫేస్‌బుక్‌లో ఫన్నీ వీడియోలు, కామెడీ స్పూఫ్‌లు అప్‌లోడ్ చేసేవాడు. వాటికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేది. అలా ఓ రోజున ఆది వీడియోని చూసిన అదిరే అభి అతనిలోని టాలెంట్‌ను గుర్తించి కలవమని కబురుపెట్టాడు.

Hyper Aadi s Jabardasth Re-Entry Did He Hike His Remuneration for Top Comedy Show

అలా జబర్దస్త్‌లో అభి టీమ్ ద్వారా అడుగుపెట్టాడు. తొలుత స్క్రిప్ట్, రైటింగ్‌ బాధ్యతలు చూసుకున్న ఆదిని తర్వాత స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు అభి. తన టైమింగ్, పంచ్‌లు, కౌంటర్‌లతో ప్రేక్షకులను నవ్వించాడు ఆది. ఆ వెంటనే అభి టీమ్ నుంచి బయటకొచ్చి హైపర్ ఆది- రైజింగ్ రాజు టీమ్ పేరుతో సొంత టీమ్‌ను ప్రారంభించాడు. శాంతి స్వరూప్, దొరబాబు, పరదేశి, రైజింగ్ రాజు, గణపతి తదితరులతో కలిసి ఆది చేసిన స్కిట్స్ అలరించాయి. కొన్ని స్కిట్స్ అత్యధిక వ్యూస్‌తో జబర్దస్త్‌లో సంచలనం సృష్టించాయి. ఒకదశలో హైపర్ ఆది టీమ్ కోసమే జబర్దస్త్ చూసిన ప్రేక్షకులు కూడా ఉన్నారు.

Recommended For You
నా శాపం గట్టిగానే.. ఆ హీరో ఇంకా కోలుకోలేదు... యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్
నా శాపం గట్టిగానే.. ఆ హీరో ఇంకా కోలుకోలేదు... యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్

హైపర్ ఆది టాలెంట్‌ను గుర్తించిన సినీ ప్రముఖులు ఆయనకు పలు సినిమాలలో కమెడియన్‌గా, రైటర్‌గా అవకాశం కల్పించాయి. సినిమాలు, జబర్దస్త్, ఇతర షోలు, ఈవెంట్స్‌తో హైపర్ ఆది క్షణం తీరిక లేకుండా బిజీ అయిపోయాడు. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ నెలకొల్పిన జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. అయితే జబర్దస్త్‌కు ఇటీవల ఆదరణ తగ్గుతుండటంతో ఈటీవీ - మల్లెమాల సంస్థలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. దీనిలో భాగంగా జడ్జి నాగబాబు రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ వెంటనే జబర్దస్త్‌ను వీడి వెళ్లిన కొందరు పాత కమెడియన్లను కూడా తిరిగి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది కూడా తాజాగా జబర్దస్త్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

You May Also Like
ఆయనకి చిన్న పిల్లనే.. గుండెనిండా గుడిగంటలు ప్రభావతి ఎమోషనల్
ఆయనకి చిన్న పిల్లనే.. గుండెనిండా గుడిగంటలు ప్రభావతి ఎమోషనల్

జూలై 26న టెలికాస్ట్ అయ్యే జబర్దస్త్‌ షోలో ఆది పంచ్‌లు, ప్రాసల్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పటి వరకు వారానికి రెండు సార్లుగా ప్రసారమైన జబర్దస్త్.. ఇకపై వారానికి ఒకే షోగా.. అది కూడా ఆదివారం టెలికాస్ట్ కానుంది. ఇటీవల విడుదలైన ప్రోమోలో నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రోమోలో హైపర్ ఆది రీ ఎంట్రీని కూడా కన్ఫర్మ్ చేశారు. గతంలోనే ఆది జబర్దస్త్‌లోకి రీ ఎంట్రీ ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే తన బిజీ షెడ్యూల్స్ కారణంగా వాయిదా వేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు మల్లెమాల సంస్థ పట్టుబట్టి మరి ఆయనను రీ ఎంట్రీ ఇచ్చేలా ఒప్పించినట్లుగా ఫిలింనగర్ టాక్. హైపర్ ఆది ఎంట్రీతో ఖచ్చితంగా జబర్దస్త్‌కు పూర్వ వైభవం వస్తుందని అంచనా వేస్తున్నారు.

'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’
'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’

అయితే రీ ఎంట్రీలో హైపర్ ఆది భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. దీని ప్రకారం ఆయన ఒక్కో ఎపిసోడ్‌కి 5 లక్షల రూపాయల వరకు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆది అడిగినంత ఇచ్చేందుకు మల్లెమాల సిద్ధంగా ఉందా? మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more about: hyper aadi jabardasth nagababu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X