Karthika Deepam 2లో హీరోని మించిన రోల్.. ఎవరీ సూరజ్? ఒక్క రోజుకి రెమ్యునరేషన్ ఎంతంటే?

స్టార్ మాలో ఒకప్పుడు టాప్ టీఆర్పీతో హీరోల సినిమాలను సైతం భయపెట్టిన సీరియల్ కార్తీక దీపం. ఏకంగా జాతీయ స్థాయిలో టాప్ షోలను సైతం వెనక్కి నెట్టిన రేటింగ్స్‌ ఈ సీరియల్ సొంతం. నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్, శోభా శెట్టి తారాగణంగా తెరకెక్కిన కార్తీక దీపం సీరియల్ మహిళా ప్రేక్షకులను ఆదరణను దక్కించుకుంది. నాటి సీరియల్‌కు సీక్వెల్‌గా కార్తీక దీపం 2 ను స్టార్ మాలో టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే గతంలో కథకు, ఇప్పుడు జరుగుతున్న కథకి.. నాటి పాత్రలకు, నేటి పాత్రలకు ఏ మాత్రం సంబంధం లేదు.

Also Read
నా శాపం గట్టిగానే.. ఆ హీరో ఇంకా కోలుకోలేదు... యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్
నా శాపం గట్టిగానే.. ఆ హీరో ఇంకా కోలుకోలేదు... యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్

చిన్నప్పటి నుంచి బావే ప్రాణంగా, అతనినే భర్తగా ఊహించుకుని బతకడం.. మధ్యలో మరొకరికి బావ సొంతం కావడం.. అంతలోనే బావ జీవితాన్ని పంచుకున్న స్త్రీయే తన ఇంటికి అసలు సిసలు వారసురాలని తెలియడం, తన భార్యను తన అసలు తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి హీరో చేసే ప్రయత్నమే ఈ కార్తీక దీపం 2 అసలు కథ. సీరియల్ ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఈ ధారావాహికకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ప్రారంభించారు. కార్తీక్, దీప, జ్యోత్స్న, శివన్నారాయణ, సుమిత్ర, దశరథ, పారిజాతం, కాంచనల చుట్టూ ఈ సీరియల్ నడుస్తోంది.

Karthika Deepam 2 Fame Suraj Remuneration How Much Does Srikar Krishna Earn Per Day

ఇప్పటి వరకు 700కు పైగా ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకుని 800వ ఎపిసోడ్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది కార్తీక దీపం 2. అయితే కొద్దిరోజుల క్రితం సూరజ్, దక్షిణామూర్తి, మాలిని అనే కొత్త పాత్రలు కథలో రంగ ప్రవేశం చేశాయి. జ్యోత్స్నకు జోడీగా.. కార్తీక్- దీపలకు స్నేహితుడిగా సూరజ్ అండగా నిలుస్తున్నాడు. జ్యోత్స్న వేసే ఎత్తుగడల నుంచి కార్తీక్, దీప, శివన్నారాయణలను కాపాడుతూ కొద్దిరోజుల్లోనే ఆడియన్స్‌కు ఫేవరెట్‌గా మారిపోయాడు సూరజ్. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు కార్తీక్ బాబును కూడా సూరజ్ పాత్ర డామినేట్ చేస్తూ అతనే హీరో అన్నంతగా ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సూరజ్ ఎవరు? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ? కార్తీక దీపం సీరియల్‌కు గాను అతనికి పారితోషికం ఎంత? అనేది ఆసక్తిగా మారింది.

Recommended For You
'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’
'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’

సూరజ్ రియల్ నేమ్ శ్రీకర్ కృష్ణ. విశాఖపట్నానికి చెందిన ఈ కుర్రాడు ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. తొలుత స్థానికంగానే మేజిషియన్‌గా, యాంకర్‌గా కొన్ని ఈవెంట్స్ చేశాడు. అనంతరం మంచి అవకాశాల కోసం హైదరాబాద్‌కు మకాం మార్చాడు. స్టార్ మా మ్యూజిక్‌లో యాంకర్‌గా తన కొత్త ప్రయాణం ప్రారంభించాడు. స్టార్ మా మహోత్సవంతో పాటు పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించాడు. బుల్లితెరపై నిలదొక్కుకుంటున్న సమయంలోనే సినిమాలలోనూ అవకాశాలు వచ్చాయి. నరసింహపురం అనే మూవీలో చిన్న పాత్ర పోషించాడు.

You May Also Like
 యాంకర్ ప్రదీప్‌కు అభిమాని లవ్ ప్రపోజల్.. మీ వల్లనే అలాంటి సమస్యలంటూ చిలిపిగా!
యాంకర్ ప్రదీప్‌కు అభిమాని లవ్ ప్రపోజల్.. మీ వల్లనే అలాంటి సమస్యలంటూ చిలిపిగా!

ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారమైన కళ్యాణ వైభోగం సీరియల్‌తో బుల్లితెర నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఈటీవీలో శతమానం భవతి, స్టార్ మాలో బ్రహ్మముడి సీరియల్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా బ్రహ్మముడిలో విలన్ రుద్రాణి కొడుకు రాహుల్‌గా కామెడీతో పాటు సీరియస్ రోల్‌లోనూ అద్భుతంగా ఒదిగిపోయాడు. బ్రహ్మముడిలో దుగ్గిరాల కుటుంబాన్ని అంతం చేసి చివరిలో హీరో చేతిలో చనిపోతాడు. ప్రస్తుతం కార్తీక దీపం 2లో సూరజ్‌గా ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. తన అందం, నటనతో కార్తీక్ బాబునే డామినేట్ చేస్తున్నాడు శ్రీకర్ కృష్ణ. సీరియల్స్‌తో పాటు ఆదివారం విత్ స్టార్ మా పరివారం, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోలలోనూ శ్రీకర్ కృష్ణ సందడి చేస్తున్నాడు.

400 కోట్ల జన నాయగన్ లీక్.. డైరెక్టర్ వినోద్ క్లారిటీ !
400 కోట్ల జన నాయగన్ లీక్.. డైరెక్టర్ వినోద్ క్లారిటీ !

ఇక కార్తీక దీపం 2 సీరియల్‌కి గాను శ్రీకర్ కృష్ణ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడు? ఒక్క రోజుకి పారితోషికం ఎంత? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి శ్రీకర్ కృష్ణకు కార్తీక దీపం 2 సీరియల్‌కి గాను ఒక రోజుకి 35 వేల రూపాయల చొప్పున పారితోషికంగా చెల్లిస్తున్నారట. 20 రోజుల వరకు షూటింగ్ ఉంటే ఈ లెక్కన నెలకు 7 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు సూరజ్. ఇది కాకుండా మిగిలిన సీరియల్స్, షోలు, ఈవెంట్స్‌తో కలిపి శ్రీకర్ కృష్ణ నెలకు 12 నుంచి 15 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉందని బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X