ఆ నటుడి ఫోటోను నిప్పుల్లో కాల్చి.. బుల్లితెర నటి కావ్యశ్రీ సీరియస్

Photo Courtesy: ETV Telugu India

ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద కన్నడ నటుల డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఏ ఛానెల్ చూసినా హీరో హీరోయిన్లు, సహాయక పాత్రలు కన్నడ నటులతో నిండిపోతున్నాయి. తెలుగు నేర్చుకోవడంతో పాటు అందం, అద్భుతమైన నటన కారణంగా వీరు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఈ కోవలకే వస్తారు కావ్యశ్రీ. స్టార్ మాలో ప్రసారమైన గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కావ్య .. ఆ తర్వాత కోయిలమ్మ, గువ్వా గోరింకా తదితర సీరియల్స్‌తో తెలుగునాట ఫేమస్ అయ్యారు. వీటితో పాటు తెలుగులో పలు ఎంటర్‌టైన్‌మెంట్ షోలలో కావ్యశ్రీ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ప్రసారమైన ఓ షోలో బుల్లితెర నటుడిపై కావ్యశ్రీ సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Also Read
సిల్క్ స్మిత సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు.. అంతిమ క్షణాల్లో ఏం రాసిందంటే?
సిల్క్ స్మిత సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు.. అంతిమ క్షణాల్లో ఏం రాసిందంటే?

కొద్దినెలల క్రితం స్టార్ యాంకర్ సుమ కనకాల ఈటీవీలో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సమీర్‌తో పాటు బుల్లితెర సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ సందర్భంగా కొందరి ఫోటోలను అతికించి వారందరినీ వేదిక మీదకి పిలిచింది సుమ. న్యూఇయర్ సందర్భంగా మీ రెజిల్యూషన్ చెప్పడం కాదు.. పక్కవాడి రెజిల్యూషన్ చెప్పాలి, అంటే వాళ్లలో ఏ మార్పు వస్తే మంచిది అనే కారణం చెబుతూ వారి ఫోటోను ఈ నిప్పుల్లో కాల్చాలని టాస్క్ ఇచ్చింది సుమ.

Kavya Shree Slams Tejas Gowda on TV Show Burns His Photo During Suma Kanakala s Task Here is why

Photo Courtesy: ETV Telugu India

తొలుత ఇమ్యాన్యుయేల్‌ను పిలవగా .. ఆమె అరియానా ఫోటోను మంటల్లో వేసి తను ఏమనుకుంటున్నాడో చెప్పాడు. ఆ తర్వాత హైపర్ ఆది వచ్చి రీతూ చౌదరి‌లో ఎలాంటి మార్పు రావాలో తెలిపాడు. ఆ తర్వాత జబర్దస్త్ నూకరాజు వచ్చి అప్పటి జబర్దస్త్ యాంకర్ సౌమ్యారావు నడిగ్‌ తెలుగు నేర్చుకోవాలని ఆమె ఫోటోను నిప్పుల్లో వేసి కాల్చాడు. దీనికి సౌమ్యారావు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తెలుగు, కన్నడ అనే భాషాభేదాలు చూపించొద్దని సీరియస్ అయ్యింది. విషయం హాట్ హాట్‌గా మారుతుండటంతో సుమ రంగ ప్రవేశం చేసి ఇద్దరినీ కూల్ చేసింది. సౌమ్యారావును దగ్గరికి తీసుకుని హత్తుకుంది.

Recommended For You
Jabardasth: జబర్దస్త్‌లో ఊహించని మార్పులు.. 13 ఏళ్ల తర్వాత ఈటీవీ సంచలన నిర్ణయం!
Jabardasth: జబర్దస్త్‌లో ఊహించని మార్పులు.. 13 ఏళ్ల తర్వాత ఈటీవీ సంచలన నిర్ణయం!

ఈ గొడవ ముగిసిన తర్వాత బుల్లితెర నటి కావ్యశ్రీ వచ్చింది. నేను తేజగారి ఫోటోను కాల్చాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో తేజస్ గౌడ షాక్ అయ్యాడు. కెమెరా ఉన్నప్పుడు ఒకలా.. కెమెరా లేనప్పుడు ఇంకొక లాగా బిహేవ్ చేయడం చూశాను. అన్ని చోట్లా, ఎప్పుడూ ఒకేలా ఉండాలి, తను తనలా ఉండాలని నేను అనుకుంటున్నానని కావ్యశ్రీ రీజన్ చెప్పింది. దీనికి తేజస్ గౌడ స్పందిస్తూ.. తను అనుకున్నట్లు నేను ఎలా ఉంటాను, నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను అని పేర్కొన్నాడు.

You May Also Like
అనన్య పాండేతో అసభ్య ప్రవర్తన.. పబ్లిక్‌గా హీరోయిన్‌ని అక్కడ టచ్ చేస్తూ..
అనన్య పాండేతో అసభ్య ప్రవర్తన.. పబ్లిక్‌గా హీరోయిన్‌ని అక్కడ టచ్ చేస్తూ..

మీ గురించి నేనే వేరే వాళ్ల దగ్గర నెగిటివ్‌గా మాట్లాడానా అని తేజస్ ప్రశ్నించగా.. ఔను నేను చూశాను అని కావ్య గట్టిగా చెప్పింది. అయినా ఎవరి ఓపీనియన్‌ని, ఎవరూ మార్చలేరు.. ఏ వ్యక్తయినా ఎలా ఉండాలని అనుకుంటాడో, అలాగే ఉంటాడు. మీ దృష్టిలో నేను అలా ఉంటే దానికి నేనేం చేయలేను అని తేజస్ చెబుతుండగానే అతని ఫోటోను నిప్పుల్లో వేసి కాల్చింది కావ్యశ్రీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X