రవికృష్ణతో రిలేషన్? ఇష్టాన్ని అలా బయటపెట్టేసిన నవ్యస్వామి
వెండితెర మీదే కాదు.. బుల్లితెరకు చెందిన నటీనటులు కూడా ప్రేమించిన ఘటనలు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో ఉన్నాయి. స్టార్స్ మాదిరిగానే వీరి మధ్య ఎఫైర్లు, బ్రేకప్స్ అదే స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి. వీరిలో కొందరు పెళ్లి వరకు వెళ్లగా.. మరికొందరు విడాకులు తీసుకున్నారు. ఇంకొందరు సీక్రెట్‌గా రిలేషన్‌ను కొనసాగిస్తున్న వారు వారు ఉన్నారు. తెలుగు బుల్లితెరపైనా అలాంటి జంటలు ఎన్నో ఉన్నాయి. ఈ కోవలోకే వస్తుంది నవ్యస్వామి- రవికృష్ణ జోడీ. వీరిద్దరూ కొన్నేళ్లుగా రిలేషన్‌ను కంటిన్యూ చేస్తున్నారు. కానీ పైకి మాత్రం మాది ఫ్రెండ్‌షిప్ అని కవర్ చేస్తున్నారు. తాజాగా శ్రీముఖి హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో ఈ జంట తమ రిలేషన్‌పై ఇన్‌డైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యింది. ఈ వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని మైసూరుకు చెందిన నవ్యస్వామి .. ఆహ్వానం, నా పేరు మీనాక్షి తదితర సీరియల్స్‌తో తెలుగునాట ఫేమస్ అయ్యారు. ఇక ఆమె కథ సీరియల్‌లో రవికృష్ణ, నవ్య స్వామి జంటకు మంచి మార్కులు పడ్డాయి. తెర మీదే కాకుండా బయట కూడా వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. వివిధ ఛానెల్స్‌లో ప్రసారమయ్యే స్పెషల్ షోలు, ఈవెంట్స్‌లో ఈ ఇద్దరూ కలిసి రచ్చ చేశారు. దాంతో నవ్య - రవి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ తెలుగు మీడియా కోడై కూస్తోంది. వీరి రిలేషన్ నిజమేనని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. రవి తనకు మంచి మిత్రుడు మాత్రమేనని అప్పట్లో నవ్య స్వామి క్లారిటీ ఇచ్చారు.

అటు రవికృష్ణ సీరియల్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలలో హీరో కావాలనే తన లక్ష్యం దిశగా ఈ కుర్రాడు అడుగులు వేస్తున్నాడు. విరూపాక్ష సినిమాలో నటించిన రవికృష్ణ.. ఇటీవల దండోరా సినిమాతో హిట్ అందుకున్నాడు. దాంతో రవి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. నవ్యతో రిలేషన్‌పై ఎన్నోసార్లు మీడియా ఆయనను ప్రశ్నించింది. కానీ చిరునవ్వుతో తప్పించుకునేవాడు. కానీ నవ్య ఏ చిన్న పోస్ట్ పెట్టినా ఫస్ట్ రెస్పాన్స్ అయ్యేది రవినే. ఇటీవల బుల్లితెరకు పూర్తిగా దూరంగా ఉంటున్న ఆయన తాజాగా నవ్యస్వామితో సందడి చేశాడు.
స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ఈ వారం స్నేహితుల దినోత్సవం స్పెషల్‌ను పురస్కరించుకుని బుల్లితెర, వెండితెరలపై బెస్ట్ ఫ్రెండ్స్ సందడి చేశారు. శేఖర్ మాస్టర్ - రఘు మాస్టర్.. ధనాధన్ ధనరాజ్- వేణు... సుప్రీత- నిఖిల్ విజయేంద్ర సింహా.. ఎక్స్‌ప్రెస్ హరి- యాదమ్మ రాజులు హల్‌చల్ చేశారు. వీరిలో నవ్యస్వామి - రవికృష్ణలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తాజా ప్రోమోను పరిశీలిస్తే..
మెగాస్టార్ చిరంజీవి హిట్ సాంగ్ రూపు తేరా మస్తానా సాంగ్‌కి రఘు మాస్టర్, శేఖర్ మాస్టర్‌లు అదిరిపోయే స్టెప్స్‌తో అలరించారు. ఆ తర్వాత నవ్యస్వామి, రవికృష్ణలను పిలిచి.. ఫ్రెండ్‌ను పేరు పెట్టి కాకుండా ఒకరినొకరు ఏమని పిలుచుకుంటున్నారో మేం తెలుసుకోవాలని అనుకుంటున్నామని ఇద్దరి మెడలో బోర్డులు తగిలించి దానిపై రాయమని టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. రవికృష్ణ బోర్డుపై హీరో అని రాసింది నవ్యస్వామి.. ఆ వెంటనే నవ్యస్వామి బోర్డుపై రౌడీ ఫెలో అని రాసాడు రవి. ఇవి లవర్స్ పిలుచుకుంటున్నట్లుగా ఉన్నాయని ఎక్స్‌ప్రెస్ హరి అనడంతో అంతా గోల గోల చేస్తారు. రవికృష్ణ నా దృష్టిలో ఎప్పటికీ హీరోనే అని చెప్పింది. దాంతో రవిపై తన ఇష్టాన్ని నవ్యస్వామి ఇలా బయటపెట్టిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ లవ్ బర్డ్స్ అల్లరి తెలియాలంటే ఈ వారం ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.


Click it and Unblock the Notifications


