Sreemukhi: శ్రీముఖికి పెళ్లి కళ.. అలాంటి వాళ్ల కోసమే ఇన్నాళ్లూ అంటూ
Sreemukhi: టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల జాబితాలో ఉన్న స్టార్ యాంకర్ శ్రీముఖి. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తోంది. ఈ బుల్లితెర యాంకరమ్మ పెళ్లి వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. గత కొంతకాలంగా ఆమె వివాహంపై రకరకాల ప్రచారం జరుగుతుండగా, తాజాగా మరోసారి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్న శ్రీముఖి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే వేసవిలో ఆమె పెళ్లి పీటలెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాజాగా శ్రీముఖి పెళ్లి టాపిక్ హైలైట్‌గా నిలిచింది.
బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న షో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'. మరోసారి తాజా ప్రోమోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న శ్రీముఖి తన ఎనర్జీ, చలాకీతనంతో ఎప్పటిలాగే ఆకట్టుకోగా.. ఆమెతో కలిసి ముక్కు అవినాష్, హరి చేసిన కామెడీ పంచ్‌లు ప్రోమోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా శ్రీముఖి పెళ్లి ప్రస్తావన రావడంతో స్టేజ్‌పై జరిగిన సరదా సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

తాజా ప్రోమోలో యాంకర్ శ్రీముఖి ట్రెడిషనల్ లుక్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌ను తలపించేలా ఆమె స్టేజ్‌పైకి రావడంతో అక్కడున్న వారంతా చప్పట్లతో స్వాగతం పలికారు. రంగురంగుల సంప్రదాయ దుస్తుల్లో శ్రీముఖి మరింత అందంగా కనిపించడంతో కో-యాంకర్ హరి కూడా ఆమెను పొగడకుండా ఉండలేకపోయాడు. శ్రీముఖిని చూసిన హరి వెంటనే.. "బుగ్గల్లో మెరుపు వచ్చింది... కళ్లల్లో మెరుపు వచ్చింది... నాకు తెలిసి ఇది పెళ్లి కళే'అంటూ సరదాగా కామెంట్ చేశాడు. హరి మాటలు విన్న శ్రీముఖి సిగ్గుపడుతూ మురిసిపోయింది. ఆ కామెంట్‌ను ఎంజాయ్ చేస్తూ స్టేజ్‌పైనే చిన్నపిల్లలా సంబరపడింది.
వెంటనే ముక్కు అవినాష్ తనదైన స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చి, "అవునవును... వీళ్లిద్దరికీ పెళ్లి అనేది కలనే" అంటూ పంచ్ వేశాడు. ఒక్కసారిగా అవినాష్ కామెంట్‌తో స్టేజ్ మొత్తం నవ్వులతో మార్మోగిపోయింది. అయితే శ్రీముఖి "నువ్వు అలా మాట్లాడితే నేను ఫీల్ అవుతాను" అంటూ అవినాష్‌పై చిన్నగా అలిగినట్లు నటించింది. దీంతో పరిస్థితిని మార్చేందుకు హరి మరోసారి శ్రీముఖికి బిల్డప్ ఇచ్చాడు. 'అమ్మగారిని పెళ్లి చేసుకోవడానికి బయట 500 మంది లైన్‌లో నిల్చున్నారు. మీకు తెలుసా?'అంటూ భారీ డైలాగ్ వేశాడు. హరి మాటలు విన్న వెంటనే శ్రీముఖి కూడా ఏమాత్రం తగ్గకుండా.. "అరేయ్... ఆ లైన్ ఎక్కడ ఉందో నాకు కూడా చెప్పరా!'అంటూ అత్రుతగా అడిగింది.
శ్రీముఖి ఇచ్చిన ఆ ఒక్క కౌంటర్‌తో స్టేజ్‌పై ఉన్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ముక్కు అవినాష్, హరి ఇద్దరూ నవ్వు ఆపుకోలేకపోగా, అక్కడున్న సెలబ్రిటీలు కూడా నవ్వేశారు. ఈ ఫన్నీ మూమెంట్ ప్రోమోకు హైలెట్ నిలిచింది. ఇప్పటికే ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా శ్రీముఖి పెళ్లి ప్రస్తావన, హరి ఇచ్చిన బిల్డప్, ముక్కు అవినాష్ వేసిన పంచ్‌లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications



