అమీర్‌ ఖాన్‌ను చంపితే 5 కోట్ల బహుమానం.. మత గురువు సంచలన ప్రకటన

Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్న కథాంశాలతో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లను అందుకున్నారు. ఆయన సినిమా విడుదలైందంటే హిట్ అవ్వడమే కాదు.. కోట్లల్లో వసూళ్లు అందుకోవాల్సిందే. అలా బాలీవుడ్‌లో అగ్ర హీరోగా గుర్తింపు పొందారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మిస్టర్ పర్ఫెక్ట్ హీరో వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఇప్పటికే రెండు పెళ్లి, రెండు విడాకులతో వార్తల్లో నిలిచారు. తాజాగా జూలై 5న తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను మూడో వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య తపస్వీకి ఛావని మఠం అధిపతి, జగద్గురు పరమహంస ఆచార్య.. ఆమిర్‌ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

Also Read
అట్లీ 18 ఏళ్ల కలల ప్రాజెక్ట్.. రాకా లో మరో హీరోయిన్ ఫిక్స్..
అట్లీ 18 ఏళ్ల కలల ప్రాజెక్ట్.. రాకా లో మరో హీరోయిన్ ఫిక్స్..

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ మంత్రి నితేష్ రాణే ఆమిర్ ఖాన్‌ను "లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్"గా అభివర్ణిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రాజకీయ, సామాజిక దుమారానికి దారితీశాయి. ఈ వివాదం కొనసాగుతుండగానే తపస్వీ ఛావణి పీఠాధిపతి జగద్గురు పరమహంస ఆచార్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ విషయం మరింత వివాదాస్పదంగా మారింది.

Recommended For You
10 ఏళ్ల నిరీక్షణకు లెనిన్‌తో తెర.. అఖిల్ నెక్స్ట్ మూవీ ఏంటి?
10 ఏళ్ల నిరీక్షణకు లెనిన్‌తో తెర.. అఖిల్ నెక్స్ట్ మూవీ ఏంటి?
Aamir Khan Controversy

నితేష్ రాణే వ్యాఖ్యలు
ఇటీవల మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే మీడియాతో మాట్లాడుతూ.. ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలు సమాజంపై ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు. ఆ సందర్భంగా ఆమిర్ ఖాన్‌ను ప్రస్తావిస్తూ.. "లవ్ జిహాద్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఆమిర్ ఖాన్ కాదా?" అంటూ ప్రశ్నించారు. హిందూ యువత ఇలాంటి నటులను ఆదరించే ముందు ఆలోచించాలని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది.

You May Also Like
అల్లు అర్జున్ మరో క్రేజీ ప్రాజెక్ట్.. అట్లీ, లోకేశ్ తర్వాత ఎవరితో..
అల్లు అర్జున్ మరో క్రేజీ ప్రాజెక్ట్.. అట్లీ, లోకేశ్ తర్వాత ఎవరితో..

పరమహంస ఆచార్య మద్దతు
ఈ నేపథ్యంలో మంత్రి నితేష్ రాణే వ్యాఖ్యలకు జగద్గురు పరమహంస ఆచార్య మద్దతుగా నిలిచారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమిర్ ఖాన్ మూడు వివాహాలు చేసుకున్నారని, ఆ వివాహాలు హిందూ మహిళలతోనే జరిగాయని పేర్కొన్నారు. నితేష్ రాణే వ్యాఖ్యలు ఆరోపణలు కాదని, తన దృష్టిలో అవి వాస్తవాలని అన్నారు. సమాజంలో విభేదాలు సృష్టిస్తూ "లవ్ జిహాద్"ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రామ్ చరణ్-సుకుమార్ మూవీలో భారీ ట్విస్ట్.. పవర్‌ఫుల్ రోల్‌లో స్టార్ హీరోయిన్?
రామ్ చరణ్-సుకుమార్ మూవీలో భారీ ట్విస్ట్.. పవర్‌ఫుల్ రోల్‌లో స్టార్ హీరోయిన్?

రూ.5 కోట్ల బహుమతి
అయితే పరమహంస ఆచార్య చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్య ఏమిటంటే.. ఆమిర్ ఖాన్‌ను హత్య చేసే వ్యక్తికి రూ.5 కోట్ల బహుమతి ఇస్తానని ప్రకటించడం. అంతేకాకుండా, అలాంటి వ్యక్తికి ఎదురయ్యే న్యాయపరమైన ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని కూడా అన్నారు. ఇంకా "లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారని, ఇలాంటి వ్యక్తులను అరికడితే అలాంటి చర్యలు తగ్గుతాయి" అనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఆమిర్ ఖాన్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ అధికారికంగా స్పందించలేదు.

Read more about: aamir khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X