రామ్ చరణ్-సుకుమార్ మూవీలో భారీ ట్విస్ట్.. పవర్‌ఫుల్ రోల్‌లో స్టార్ హీరోయిన్?

పెద్ది తర్వాత రామ్ చరణ్ నెక్ట్స్ సినిమాపై అప్పుడే చర్చ మొదలైంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమామ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సక్సెస్ జోష్ కొనసాగిస్తూ.. రామ్ చరణ్ తదుపరి సినిమా సుకుమార్‌తో చేయనున్నారు. ప్రస్తుతం RC17 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్నది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తాజాగా మరో ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో స్టార్‌హీరోయిన్ నటించనున్నట్లు టాక్. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు?

Also Read
OTT Releases This Week: మా ఇంటి బంగారం డిజిటల్ ఎంట్రీ.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!
OTT Releases This Week: మా ఇంటి బంగారం డిజిటల్ ఎంట్రీ.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!

'రంగస్థలం' తర్వాత మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రిపీట్ కానున్నది. వీరిద్దరి కాంబోలో 2018 లో తెరకెక్కిన 'రంగస్థలం' ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో 'చిట్టిబాబు'గా చరణ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అప్పటివరకు ఉన్న మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి, పూర్తి పల్లెటూరి కుర్రాడిగా పాత్రలో జీవించారు. సుకుమార్ టేకింగ్ కూడా వేరే లెవల్ అనే చెప్పాలి. ముఖ్యంగా చివరలో వచ్చే ఎమోషనల్ ట్విస్ట్స్, క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.

Recommended For You
అల్లు అర్జున్ మరో క్రేజీ ప్రాజెక్ట్.. అట్లీ, లోకేశ్ తర్వాత ఎవరితో..
అల్లు అర్జున్ మరో క్రేజీ ప్రాజెక్ట్.. అట్లీ, లోకేశ్ తర్వాత ఎవరితో..
Nayanthara Rumoured for a Key Role in Ram Charan-Sukumar s RC17

పెద్ది సినిమా తరువాత మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే సుకుమార్ పూర్తి కథను రామ్ చరణ్‌కు వినిపించగా, ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దేందుకు సుకుమార్ తన రచయితల బృందంతో బిజీగా ఉన్నారని సమాచారం. కథ, స్క్రీన్‌ప్లే, పాత్రల రూపకల్పన, విజువల్ ప్రెజెంటేషన్ వంటి అంశాలపై ప్రత్యేకంగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు తెరపైకి రావడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

You May Also Like
అట్లీ 18 ఏళ్ల కలల ప్రాజెక్ట్.. రాకా లో మరో హీరోయిన్ ఫిక్స్..
అట్లీ 18 ఏళ్ల కలల ప్రాజెక్ట్.. రాకా లో మరో హీరోయిన్ ఫిక్స్..

ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఈ సినిమాలో నయన్ హీరోయిన్‌గా కాకుండా కథను మలుపు తిప్పే పవర్ పుల్ పాత్రలో కనిపించనున్నారట. సుకుమార్ సినిమాల్లో హీరో, హీరోయిన్‌లతో పాటు ఇతర పాత్రలు కూడా కథలో ప్రత్యేకత ఉంటుంది. 'రంగస్థలం'లో అధ్యక్షుడు, కుమార్‌బాబు, రంగమ్మ అత్త వంటి పాత్రలు ఎంత ప్రభావం చూపాయో తెలిసిందే. అలాగే 'పుష్ప'లో కూడా ప్రతి పాత్రకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అదే తరహాలో RC17లో కూడా నయనతార పాత్రను చాలా పవర్‌పుల్‌‌గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

10 ఏళ్ల నిరీక్షణకు లెనిన్‌తో తెర.. అఖిల్ నెక్స్ట్ మూవీ ఏంటి?
10 ఏళ్ల నిరీక్షణకు లెనిన్‌తో తెర.. అఖిల్ నెక్స్ట్ మూవీ ఏంటి?

ఒకవేళ ఈ వార్త నిజమైతే.. నయనతార కెరీర్‌లో ఓ ప్రత్యేక సినిమా కానున్నది. ఎందుకంటే.. ఇప్పటికే ఆమె చిరంజీవితో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తొలిసారి రామ్ చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉందనే వార్త మెగా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా చిరంజీవి తర్వాత ఆయన కుమారుడితో కూడా నటించబోతున్నారు. ఈ ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది.

రామ్ చరణ్-ఉపాసనల డ్రీమ్ ఫామ్‌హౌస్.. ప్రత్యేకతలు ఏంటంటే..!
రామ్ చరణ్-ఉపాసనల డ్రీమ్ ఫామ్‌హౌస్.. ప్రత్యేకతలు ఏంటంటే..!

మరోవైపు.. రామ్ చరణ్ ప్రస్తుతం తన గత సినిమా 'పెద్ది' తర్వాత కొంత విరామంలో ఉన్నారు. సుకుమార్ RC17 ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, ఈ ఏడాది అక్టోబర్‌లో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అనంతరం రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుకుమార్ లాంటి దర్శకుడు నయనతార కోసం నిజంగానే ఒక పవర్‌ఫుల్ పాత్రను సిద్ధం చేసి ఉంటే, RC17 స్థాయి మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read more about: ram charan nayanthara sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X