Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి తెలుగు స్టార్ హీరోయిన్.. అప్పుడు ఎన్టీఆర్‌తో అలా ఇప్పుడిలా!
అసలు ఎలాంటి అంచనాలు లేకుండానే తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. ఎవరూ ఊహించని రీతిలో చాలా తక్కువ సమయంలోనే సక్సెస్ అయిన షో బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే దీనికి రీచ్ ఎక్కువగా లభించింది. ఫలితంగా రికార్డు స్థాయి రేటింగ్‌తో ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇలా ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ నేమ్ తాజాగా బయటకు వచ్చింది. ఆ వివరాలను మీరే చూడండి!
మొత్తం 8.. అన్నీ సక్సెస్
హిందీలోకి చాలా కాలం క్రితమే వచ్చినా తెలుగులోకి బిగ్ బాస్ షో ఆలస్యంగా ఎంటరైంది. అయినా ఇది భారీ స్థాయిలో ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఫలితంగా ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు, ఈ సీజన్లు అన్నీ భారీ స్థాయిలో రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. తద్వారా ఈ షో దేశంలోనే టాప్ ప్లేస్‌కు వెళ్లిపోయింది.
Deepthi Sunaina: పైట తీసేసి దీప్తి సునైనా హాట్ షో.. అమ్మడి ఫోజులు చూస్తే అంతే!

8వ సీజన్ వివరాలు ఇవే
గత సీజన్ భారీ రెస్పాన్స్ అందుకోవడంతో ఇప్పుడు ఎనిమిదో సీజన్‌పై అంచనాలు అదిరిపోయేలా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే దీనికి సంబంధించిన అఫీషియల్ లోగోను విడుదల చేశారు. అలాగే, దీనిపై అఫీషియల్ ప్రోమోను సైతం నిర్వహకులు ఇప్పటికే వదిలారు. ఇక, ఈ సీజన్‌ను సెప్టెంబర్ 1వ తేదీ నుంచే ప్రారంభిస్తున్నారని కొద్ది రోజుల క్రితమే న్యూస్ లీకైంది.
కొత్త సీజన్ కాన్సెప్ట్ ఇదే
తెలుగులో బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు అన్నీ హిట్ అయ్యాయి. దీంతో ఎనిమిదో దానిపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఎనిమిదో సీజన్‌ను 'అంతులేని వినోదం' (ఇన్ఫినిటీ ఎంటర్‌టైన్‌మెంట్) అనే కాన్సెప్టుతో తెస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా పనులు పూర్తి అయ్యాయి. త్వరలోనే డేట్‌ను ప్రకటించనున్నారు.
సానియా టెన్నిస్ ఆడుతూ చూపిస్తుంది.. ఆ హీరోయిన్ బట్టలన్నీ విప్పేసింది: తెలుగు నటి కామెంట్స్
వాళ్లంతా వస్తున్నారని
ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల వివరాలు లీక్ అవుతున్నాయి. ఇలా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌లోకి ఇంద్రనీల్, నటి సన, బంచిక్ బబ్లూ, తేజస్విని గౌడ, అంజలి పవన్, అనిల్ గీలా, రీతూ చౌదరి, యాంకర్ వింద్యా, గాయత్రి గుప్తా, జబర్ధస్త్ పవిత్రలు ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని టాక్.
బిగ్ బాస్ షోలోకి సమీరా
గతంలో ఎన్నడూ చూపించని కంటెంట్‌తో మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలు ఇప్పటికీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇలా ఇప్పుడు ఓ క్రేజీ సెలెబ్రిటీ పేరు బయటకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఎనిమిదో సీజన్‌లోకి ఒకప్పటి స్టార్ హీరోయిన్ 'సమీరా రెడ్డి' కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది.

చాలా గ్యాప్ తర్వాతనే
తెలుగు పిల్ల సమీరా రెడ్డి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్టీఆర్‌తో 'నరసింహుడు', 'అశోక్' మూవీలు చేసింది. అలాగే, చిరంజీవితో 'జై చిరంజీవ'లో నటించింది. కానీ, ఇవేమీ విజయాన్ని అందుకోలేదు. దీంతో సినిమాలకు ఆమె దూరమైంది. అలాంటి ఈ హీరోయిన్‌ను ఇప్పుడు బిగ్ బాస్ నిర్వహకులు మరోసారి తెలుగు తెరపై చూపించబోతున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











