నా రేటు తగ్గించను.. నెటిజన్‌కు విష్ణుప్రియ షాక్
తన క్రియేటర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కాసులు కురిపిస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా మారినవారు తమ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి నేరుగా షేర్ చేయడమే ఈ ప్లాన్. రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అయ్యే వారికి భిన్నంగా కొత్త కంటెంట్ లేదా అందరికంటే ముందుగా లభించడం ఇందులో ప్రత్యేకత. ఈ ఫీచర్ ద్వారా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
తెలుగునాట చాలామంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే యాంకర్ విష్ణుప్రియ ఈ ట్రెండ్‌ను బాగా పాపులర్ చేసిందని చెప్పవచ్చు. తన బోల్డ్ కంటెంట్ కావాలంటే డబ్బులు చల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని అప్పట్లో ఆమె కరాకండీగా చెప్పడంతో పాటు బోల్డ్ ఫోటోలు, వీడియోలతో అశ్లీల కంటెంట్‌ను వ్యాప్తి చేస్తోందని విష్ణుప్రియపై సాంప్రదాయవాదులు మండిపడ్డారు. ఆమెపై విజయవాడలోని సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది.

యాంకర్‌గా, స్టాండప్ కమెడియన్‌గా అందరినీ నవ్వించే విష్ణుప్రియ.. ఇలా డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తోందని.. యువతను, వీడియోను ఆకట్టుకునేలా అసభ్యకరమైన వీడియోలు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కావాలనుకుంటే సబ్‌స్క్రిప్షన్ ఫీజు కింద 390 రూపాయలు వసూలు చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి అర్థనగ్న ప్రదర్శనతో సమాజానికి ఏం మెసేజ్‌లు ఇస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వం విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేయాలని, ఆమెపై క్రిమినల్ కేసు పెట్టాలని కూడా డిమాండ్లు వినిపించాయి. ఈ కేసుపై విష్ణుప్రియ విచారణకు సైతం హాజరయ్యారు.
ఎన్ని విమర్శలు ఎదురైనప్పటికీ విష్ణుప్రియ మాత్రం సబ్‌స్క్రిప్షన్ కొనసాగించింది. ఈ వివాదం కాస్తా ఆమె నెత్తిన పాలు పోసినట్లుగా మారి.. సబ్‌స్క్రైబర్లు భారీగా వచ్చిపడ్డారు. గ్లామరస్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం విష్ణుప్రియ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 7000 పైనే ఉండొచ్చని భావిస్తున్నారు. నెలకు 390 రూపాయల సబ్‌స్క్రిప్షన్ ఫీజు ప్రకారం ఆమెకు ఒక్క నెలకు 27 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల రేంజ్‌లో ఆదాయాన్ని అందుకుంటోంది విష్ణుప్రియ. ఆమెను చూసి అనన్య నాగళ్ల, అషురెడ్డి, బిగ్‌బాస్ సిరితో పాటు ఎంతోమంది యాంకర్లు, సెలబ్రిటీలు పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లోకి దిగుతున్నారు.
ఇదిలాఉండగా.. విష్ణుప్రియ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు తగ్గించమని అడిగినందుకు ఆమె సీరియస్ అవుతూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ నెటిజన్.. అక్కా.. సబ్‌స్క్రిప్షన్ ఫీజు కొంచెం తగ్గించండి, నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతాం. ప్లీజ్ మా గురించి కూడా ఆలోచించండి, జాబ్ లేని కుర్రాళ్లం అని కామెంట్ పెట్టాడు. దీనికి విష్ణుప్రియ స్పందిస్తూ.. సెటైరికల్‌గా ఆన్సర్ ఇచ్చింది. అయ్యో.. అవునా ముందు నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టు, డబ్బు వృధా చేసుకోవద్దని కామెంట్ పెట్టింది. అంటే దీనికి అర్ధం ఆమె రేట్ తగ్గించను అనే కదా? ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మండిపడుతూ విష్ణును ట్రోలింగ్ చేస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్ ఫీజు అంత ఉండక్కర్లేదని, కొంచెం తగ్గించుకుంటే ఏమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వివాదం రేగుతుండగా.. విష్ణుప్రియ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications


