X
Home టాప్ లిస్టింగ్

2023 తెలుగు లో ప్రసారం అవుతోన్న టాప్ రియాలిటీ షో లు

Author Administrator | Updated: Tuesday, April 4, 2023, 10:09 AM [IST]

ప్రేక్షకులను అలరించటానికి వివిధ షోలు టీవీ లలో ప్రసారం అవుతుంటాయి. వాటిలో సక్సెస్ అయ్యేవి చాల తక్కువ ఉంటయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వైరల్ కంటెంట్, లవ్ ట్రాక్స్, కామెడీ లతో దూసుకుపోయే రియాలిటీ షో లకు మాత్రమే ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం తెలుగు లో ప్రసారం అవుతోన్న టాప్ రియాలిటీ షోస్ ఏవంటే.. !


cover image
1

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఫ్లాప్ తర్వాత బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోను ప్రారంభించారు మేకర్స్. ఈ షోకి న్యాయ నిర్ణేతలుగా అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు గ్లామరస్ హీరోయిన్ సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ వ్యవహరించారు. ఇక బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మగా పేరొందిన బొద్దుగుమ్మ శ్రీముఖి హోస్ట్ గా చేసింది. షోలో మొత్తంగా 9 జోడీలు పాల్గొన్నారు. ఇందులో టైటిల్ విజేతగా ఆర్జే సూర్య అండ్ ఫైమా జోడీ గెలిచి రూ. 25 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ అందుకున్నారు.

2

వారం వారం ఎంటర్టైన్మెంట్ ను పెంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ, ఆదరణ పొందుతూ వెళ్తోంది శ్రీదేవి డ్రామా కంపెనీ షో. శ్రీదేవి డ్రామా కంపెనీ  ప్రోగ్రాం లో ప్రతీ వారం కూడా ఒక కొత్త కాన్సెప్ట్ ఏర్పాటు చేసి తద్వారా ఆడియన్స్ లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టాలెంట్ ఉన్న వారిని గుర్తించడం మల్లెమాలవారు వారిని ఏకంగా వారి కార్యక్రమాలకు తీసుకువచ్చి వారికి సెలబ్రిటీ హోదాను కల్పిస్తున్నారు.

3

జబర్దస్త్ షో  కామెడీ పరంగా ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. జబర్దస్త్ షో కి జనాలలో విపరీతమైన క్రేజ్ రావటం లో ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రారంభించారు. ప్రతి శుక్రవారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌. రెండు షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పటి వరకు ఈ షోను బీట్ చేసే షో రాలేదు. ఈ షోలో ఎంతోమంది కమెడియన్స్ తమ పర్ఫామెన్స్ లతో బాగా ఆకట్టుకుంటారు. అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటారు.

4

బుల్లితెర పై  జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. కామెడీకు సరికొత్త రూపం ఇస్తూ ఎంతో మంది కమెడియన్స్ ను ఇండస్ట్రీకు పరిచయం చేసింది ఈ జబర్దస్త్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. ఎంతో మంది కమెడియన్స్ ఈ వేదికపై తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని సినిమా అవకాశాలు కూడా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం   జబర్దస్త్  షో కి  నటి ఇంద్రజ, కమెడియన్ కృష్ణ భగవాన్ లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. యాంకర్ గా యాంకర్ సౌమ్య రావు వున్నారు. 

5

తెలుగు బుల్లితెరపై తనడైన స్టార్​డమ్ తెచ్చుకున్న షోస్​లో ఢీ ఒకటి. సౌత్ ఇండియన్ డ్యాన్స్ రియాల్టీ షోలలోనే ఢీ షో ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. 14 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసి 15వ సీజన్‌లో అడుగు పెట్టింది. గణేష్‌ మాస్టర్‌, శ్రద్ధాదాస్‌ న్యాయ నిర్ణేతలుగా, ప్రదీప్‌ వ్యాఖ్యాతగా, హైపర్‌ ఆది, జెస్సీ ఎంటర్‌టైనర్స్‌గా వవహరిస్తున్నారు 

6

బుల్లితెర మీద పాడుతా తీయగా, స్వరాభిషేకం, ఆలీతో ఆరేళ్లుగా ఆలీతో సరదాగా షోను, వావ్ లాంటి రియాలిటీ షోలను నిర్మిస్తున్న ప్రవీణా, అనిల్ కడియాల మిస్టర్ అండ్ మిసెస్ షోను డిజైన్ చేశారు. ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఈటీవీలో అక్టోబర్ 11వ తేదీన స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతీ మంగళవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ షోకు టాప్ హీరోయిన్ స్నేహ, బిగ్‌బాస్ విన్నర్, నటుడు, నిర్మాత శివబాలాజీ, అనిల్ రావిపూడి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

7

అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో  తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న షో జీ తెలుగు స రి గ మ ప ఛాంపియన్​షిప్​. వారం వారం ఆకట్టుకునే ప్రదర్శనలతో పాటు అలరించే వినోదంతో అందరికీ పంచుతోంది.  మైమరపించే పాటలతో, సరదా సంభాషణలతో సంగీతాభిమానులతోపాటు అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ  విజయవంతంగా సాగుతున్న కార్యక్రమం స రి గ మ ప ఛాంపియన్​షిప్.  ఎవర్గ్రీన్ హిట్ ముఖాబులా పాటతో ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్, మెంటర్ల అదిరిపోయే ఎంట్రీతో షో ప్రారంభమవుతుంది.

8

ఈటీవిలో ప్రసారమైన  పాడుతా తీయగా  కార్యక్రమం 1996 మే 16న ప్రారంభమై.. నిర్వరామంగా ప్రసారమవుతూ.. భారతంలోనే మొట్టమొదటి సంగీత ఆధారిత రియాలిటీ షోగా సంగీత ప్రియులకు వినోదాన్ని పంచుతూ వుంది.  స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం మానస పుత్రికగా ఎదిగిన ఈ పోగ్రాం తిరుగులేని టీఆర్పీతో నిరాటంకంగా సాగిపోతాంది. ప్రస్తుతం బాలు వారసుడు చరణ్ బాలు ముందుకు తీసుకెళ్తున్నారు. 

9

సుమ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికగా ప్రతి శనివారం బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తున్న షో సుమ అడ్డా. ఈటీవీ లో సుమ ఆద్వర్యం లో వచ్చే క్యాష్ ప్రోగ్రాం ఎంత పెద్ద భారీ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఈ షో కి బదులుగా ఇప్పుడు సుమా ‘అడ్డా’ అనే కార్యక్రమం ప్రసారం అవుతుంది.ప్రతీ శనివారం ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాం కి టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ తమ సినిమాల ప్రొమోషన్స్ కోసం వస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+