X
Home టాప్ లిస్టింగ్

కాంట్ర‌వ‌ర్సీల‌తో మొద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా అడుగులేసిన టాప్ 7 మూవీస్

Author Administrator | Updated: Wednesday, July 12, 2023, 07:17 PM [IST]

చూడాల్సిందే కంటెంటే గురూ కాంట్ర‌వ‌ర్సీ కాదు.. అని సినీ ఇండ‌స్ట్రీలో చాలా చిత్రాలు నిరూపించాయి. ట్రైల‌ర్‌, టీజ‌ర్ రిలీజ్ త‌ర్వాత కొన్ని సినిమాల‌పై అయితే దేశ వ్యాప్తంగా వివాదాలు వ‌చ్చాయి. డిబేట్స్ పెట్టారు. స‌ద‌రు సినిమాల‌ను బ్యాన్ చేయాల‌న్నారు. కానీ ఆ సినిమాలు మాత్రం అడ్డంకుల‌ను అధిగ‌మించి బ్లాక్ బ‌స్ట‌ర్స్‌గా సినీ చరిత్ర‌లో నిలిచిపోయాయి. అవేంటో చూద్దాం...


cover image
1

ఆదా శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం ‘ది కేరళ స్టోరీ’. సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ తదితరులు కీలక పాత్రలో నటించారు. హిందూ అమ్మాయిలను ఐఎస్ఎస్‌లోకి ఎలా మ‌త మార్పిడి చేస్తున్నార‌నే అంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రంపై ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత వివాదం చేల‌రేగింది. సాక్షాత్తూ కేర‌ళ ముఖ్య మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్ సైతం సినిమాపై ఫైర్ అయ్యారు. బెంగాల్‌, త‌మిళ‌నాడు స‌హా కొన్ని రాష్ట్రాల్లో సినిమాను బ్యాన‌ర్ చేసిన‌ప్ప‌టికీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. 

2

షారూఖ్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత పూర్తి స్థాయి హీరోగా న‌టించిన చిత్రం ప‌ఠాన్‌. ఈ సినిమాలో బేష‌ర‌మ్ సాంగ్‌లో దీపి కా ప‌దుకొనె డ్రెస్సింగ్ వ‌ల్ల వివాదం రేగింది. స‌న్నివేశాల‌ను క‌ట్ చేయాలంటూ, సినిమాను బ్యాన్ చేయాలంటూ సోష‌ల్ మీడియాలో ప‌ఠాన్‌పై పెద్ద దుమార‌మే రేగింది. అయితే ప‌ఠాన్ విడుద‌లైన త‌ర్వాత మాత్రం తిరుగులేని క‌లెక్ష‌న్స్‌ను సాధించి షారూఖ్ ఖాన్ స్టార్ డ‌మ్‌ను మ‌రోసారి ప్ర‌పంచానికి తెలియ‌జేసింది. 

3

కాశ్మీర్‌లో నివ‌సిస్తోన్న కశ్మీరీ పండిట్స్ అక్క‌డ ఎదుర్కొంటోన్న ఇబ్బందుల‌ను తెలియజేస్తూ క‌శ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. వివేక్ అగ్ని హోత్రి సినిమాను తెర‌కెక్కించారు. అయితే ఈ సినిమాలో నిజానిజాల‌ను చూపించ‌కుండా ఓ వ‌ర్గం వారిదే త‌ప్పు అనేలా సినిమాను తెర‌కెక్కించారంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే సినిమా వివాదాలను దాటి బ్లాక్ బస్టర్ అయ్యింది. చాలా సైలెంట్‌గా ఎలాంటి భారీ ప్ర‌మోష‌న్స్ లేకుండా రిలీజైన క‌శ్మీర్ ఫైల్స్ ఏకంగా రూ.300 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 

4

దీపికా ప‌దుకొనె, షాహిద్ క‌పూర్‌, ర‌ణ్వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ప‌ద్మావ‌త్‌. నిజానికి ఈ సినిమాకు ముందుగా ప‌ద్మావ‌తి అనే టైటిల్‌ను పెట్టారు. అయితే ఈ సినిమా నుంచి రిలీజైన గుమ‌ర్ సాంగ్.. వివాదానికి తెర తీసింది. అందులో దీపికా ప‌దుకొనె డ్రెస్సింగ్ బాగోలేద‌ని, రాజ‌పుత్రులు ఎంతో గొప్ప‌గా చెప్పుకునే రాణి ప‌ద్మావ‌తి గౌర‌వాన్ని కించ‌ప‌రిచేలా ఉందంటూ ఓ వ‌ర్గం పెద్ద గొడ‌వ‌లే చేసింది. ఓ బ‌స్సును కూడా త‌గ‌ల‌బెట్టేశారు. చివ‌ర‌కు టైటిల్‌ను ప‌ద్మావ‌త్‌గా మార్చి రిలీజ్ చేస్తే సినిమా చాలా పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. 

 

5

ఆమిర్ ఖాన్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట మూవీ పీకే. రాజ్ కుమార్ హిరాణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత మ‌తాన్ని ప్ర‌శ్నించేలా సినిమా ఉంద‌ని, ఇది భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ తీసేలా ఉందంటూ డిబేట్స్ కూడా పెట్టారు. అయితే సినిమాను కామెడీ కోణంలో తెర‌కెక్కించ‌టం, సినిమాలోని కంటెంట్ పీకేను బాక్సాఫీస్ వ‌ద్ద టాప్ మూవీగా నిల‌బెట్టింది. ఇందులో ఆమిర్ ఖాన్ గ్ర‌హంత‌ర వాసిగా న‌టించారు. 

అర్జున్ రెడ్డి
6

విజ‌య్ దేవ‌రకొండ హీరోగా సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌లో భాగంగా వ‌చ్చిన లిప్ లాక్ పోస్ట‌ర్ వివాదానికి తెర తీసింది. వివాదం చేసే వారిపై విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన కామెంట్స్ ఇంకా ఆజ్యం పోసిన‌ట్ట‌య్యింది. కానీ సినిమా రిలీజ్ త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స్టార్ హీరోగా నిల‌బెట్టిన చిత్రంగా అర్జున్ రెడ్డి నిలిచిపోయింది. ఇదొక ఇన్‌టెన్స్ ల‌వ్‌స్టోరీగా చాలా సినిమాల‌ను బోల్డ్ కంటెంట్‌తో తెర‌కెక్కించ‌టానికి దారి చూపించింది. 

7

శృంగార తార‌గా పేరు తెచ్చుకుని స్టార్ హీరోలంద‌రూ ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసుకునేలా చేసిన న‌టి సిల్క్ స్మిత‌. ఆమె బయోపిక్‌ను బాలీవుడ్ మేక‌ర్స్ డ‌ర్టీపిక్చ‌ర్ పేరుతో తెర‌కెక్కించారు. ఆ మూవీ ట్రైల‌ర్ త‌ర్వాత కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్‌గా మారింది. సినిమాను బ్యాన్ చేయాల‌ని అన్నారు. కానీ విద్యాబాల‌న్ న‌ట‌న‌, మేక‌ర్స్ కంటెంట్‌ను తెర‌కెక్కించిన విధానం ఆడియెన్స్‌కి క‌నెక్ట్ అయ్యింది. దాంతో సినిమాను బ్లాక్ బ‌స్ట‌ర్ చేసేశారు మ‌రి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+