X
తెలుగు » సినిమాలు » అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి

Romance | 25 Aug 2017 | A |
Telugu

2.5 /5 Users

4 /5 Filmibeat

అర్జున్ రెడ్డి స్టోరీ

అర్జున్ రెడ్డి సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవర కొండ, షాలిని హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సందీప్ వహించారు మరియు భ్రదకాళి పిక్ఛర్స్ బ్యానర్ పై ప్రణయ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రధన్ స్వరాలు అందించారు.  కథ డాక్టర్ అర్జున్ రెడ్డి(విజయ్ దేవరకొండ) మంగుళూరులోని సెయింట్ మేరీ కాలేజీ ఫైనలియర్ మెడికల్ స్టూడెంట్. టాప్ ఆఫ్ ది క్లాస్, టాపర్ ఆఫ్ ది యూనివర్శిటీ. అయితే యాంగర్ మేనేజ్మెంటులో జీరో. కోపం వస్తే ఆదుపుచేసుకోలేడు. ఓ చిన్న గొడవలో క్షమాపణ చెప్పడం ఇష్టం లేని అర్జున్ రెడ్డి కాలేజీ వదిలి వెళ్లివెళ్లేందుకు సైతం సిద్ధమవుతాడు. అదే సమయంలో ఫస్టియర్లో కొత్తగా జాయినైన ప్రీతి(శాలిని)ని చూసి మనసు పారేసుకుంటారు. కాలేజీ వదిలి వెళ్లాలనే తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఇద్దరి మధ్య లవ్ లివ్ ఇన్ రిలేషన్ షిప్ స్థాయికి వెళ్లిపోతుంది. అర్జున్ రెడ్డి, ప్రీతి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే కులాలు వేరు కావడం వల్ల ప్రీతి తండ్రి నుండి నిరాకరణ ఎదురవుతుంది. ఈ క్రమంలో ప్రీతి తండ్రితో గొడవ పడ్డ అర్జున్ రెడ్డి తాను కావాలో, తండ్రి కావాలో తేల్చుకోవాలని.... 6 గంటల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గొడవపడి వచ్చేస్తాడు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మత్తుమందు తీసుకుంటాడు. అయితే అప్పటికే ఫుల్లుగా మందు కొట్టడంతో రెండు రోజుల పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. అపస్మారక స్థితి నుండి బయటపడి అర్జున్ రెడ్డి కళ్లు తెరిచే లోపు ప్రీతికి ఇంట్లోవాళ్లు బలవంతంగా పెళ్లి చేస్తారు. అంతా అయిపోయాక అర్జున్ వెళ్లి గొడవపడినా ఫలితం లేకుండా పోతోంది. పైగా ప్రీతి బంధువుల నుండి తన్నులు తిని వస్తాడు. తన పరువు తీశావనే కోపంతో అర్జున్ రెడ్డిని తండ్రి ఇంటి నుండి గెంటేస్తాడు. ప్రీతి జ్ఞాపకాల నుండి బయట పడలేక తాగుడుకు, డ్రగ్స్‌కు బానిసైపోతాడు, చివరకు పిచ్చోడిలా రోడ్డున పడేస్థాయి వస్తాడు.... ఆ తర్వాత కథ థియేటర్లో చూస్తేనే బావుంటుంది.
Read More

అర్జున్ రెడ్డి కాస్ట్ & క్రూ

అర్జున్ రెడ్డి సిబ్బంది సమాచారం

దర్శకత్వం సందీప్ రెడ్డి వంగ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రధన్
నిర్మాత ప్రణయ్ వంగ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అర్జున్ రెడ్డి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
‘అర్జున్ రెడ్డి' పాత్రలో విజయ్ దేవరకొండ సూపర్బ్‌గా నటించాడు. నటనలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరచుకున్న విజయ్ ‘అర్జున్ రెడ్డి' పాత్రలో మెప్పించాడు. కోపం కంట్రోల్ చేసుకోలేని సీన్లు, ఎమోషనల్ సీన్లు, సెంటిమెంటల్ సీన్లు దేనికదే సూపర్బ్‌గా చేశాడు. టాలీవుడ్లో విజయ్ దేవరకొండ ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ శాలిని పెద్ద అందత్తె కాకపోయినా.... 19 ఏళ్ల ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ పాత్రలో బాగా సెట్టయింది. క్యూట్ లుక్ తో, విజయ్ దేవరకొండకు తగిన జోడీగా పేరు తెచ్చుకుంది. అర్జున్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్ శివ పాత్రలో రాహుల్ రామకృష్ణ, సినిమాలో కనిపించే ప్రతినటుడు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి తొలి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ కొట్టేశాడు. అతడు ఎంచుకున్న కథాంశం కామన్ లవ్ స్టోరీనే అయినప్పటికీ దాన్ని నేరేట్ చేసిన విధంగా ప్రేక్షకుడిగా బాగా ఎక్కింది. అక్కడక్కడ కాస్త లాగినట్లు అనిపించినా.... మంచి పనితనం చూపించాడు. ‘అర్జున్ రెడ్డి' సినిమా చూస్తుంటే కథ రియల్ లైఫ్‌కు చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అర్జున్ రెడ్డికి కనెక్ట్ అయిపోతారు. 3 గంటల సినిమా అయినా మొదటి నుండి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు స్క్రీన్ ప్లే రన్ చేసిన తీరు బావుంది.

అర్జున్ రెడ్డి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అర్జున్ రెడ్డి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+