X
Home టాప్ లిస్టింగ్

2022లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న సినిమాలు

Author Administrator | Updated: Thursday, June 16, 2022, 08:00 AM [IST]

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ఐదు నెలల కాలంలో నెలకు ఒక్కో సినిమా చొప్పున బాక్సాఫీస్ దగ్గర హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాయి. 2022లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న సినిమాలు.


cover image
బంగార్రాజు
1

నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన సినిమా బంగార్రాజు. జవవరి 14న విడుదలైన  ఈ సినిమా 2022లో తొలి హిట్‌గా నిలిచింది. మొత్తంగా తొలి బ్రేక్ ఈవెన్ అందుకోని తెలుగులోనే కాదు.. మొత్తం దేశంలోనే తొలి హిట్ చిత్రంగా రికార్డులకు ఎక్కింది

 

డి జె టిల్లు
2

డిజే టిల్లు పెద్దగా సందడి లేకుండా వచ్చిన టిల్లు భాయ్ మంచి లాభాలు తీసుకొచ్చాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఫిబ్రవరిలో మొదటి  హిట్ స్టేటస్‌‌‌ను దాటి ‘బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.  

ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం
3

ఆర్ ఆర్ ఆర్  సినిమా మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆకాశమే హద్దుగా రూ. 235 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ప్రపంచ రికార్డు సాధించింది. ఈ సినిమా రూ. 1200 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రూ. 601 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. 

కేజీఎఫ్ చాప్టర్ 2
4

కెజియఫ్ ఛాప్టర్ 2 ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. అంతేకాదు రూ. 1000 కోట్ల క్లబ్బులో చేరిన మూడో సౌత్ సినిమాగా నిలిచింది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక నెల గ్యాప్‌లో రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. ఈ సినిమా ఇప్పటి వరకు 1212 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

మేజర్
5

మేజర్  సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్లకు అమ్మారు. ప్రపంచ వ్యాప్తంగా అదనంగా రూ. 5 కోట్లు కలిపి రూ. 18 కోట్లకు అమ్ముడుపోయింది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన మేజర్ మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 27.76 కోట్ల షేర్ ( రూ. 50.30 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా రూ.9 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది.

విక్రమ్
6

విక్రమ్  తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్ల షేర్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా నాలుగు రోజుల్లో లాభాల్లోకి వచ్చింది. తెలుగులో రూ. 12.53 కోట్ల షేర్ రాబట్టింది. బయ్యర్స్‌కు రూ. 5 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. ఓవరాల్‌గా రూ. 138 కోట్ల షేర్ (రూ. 273 కోట్ల గ్రాస్ ) వసూళ్లను సాధించింది. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+