సినిమా ట్రెండ్ మారింది. ఓటీటీల హవా పెరిగిన తర్వాత కొత్త దర్శకులు, కొత్త కథలు పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలను సాధిస్తుండటంతో మన స్టార్ హీరోలు సైతం కొత్త దర్శకులు, కంటెంట్ వైపు చూస్తున్నారు. పాత్ర నిడివితో సంబంధం లేకుండా నటించటానికి, మరో స్టార్ హీరో సినిమాలో సందర్భానుసారం గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వటానికి అస్సలు ఆలోచించటం లేదు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ లేదా కీలక పాత్రల్లో మెప్పించబోతున్న మన హీరోలెవరో చూద్దాం..