గత అనేక దశాబ్దాల నుండి, తెలుగు ప్రేక్షకులు తమిళ చిత్రాలను ప్రోత్సహిస్తున్నారు. కోలీవుడ్ నుండి చాలా మంది నటులు తెలుగు సినిమాలలో నటించారు. తెలుగు ఆడియన్స్ కి ఒక సినిమా నచ్చితే, అది తెలుగులో రూపొందిన చిత్రమా? లేక డబ్బింగ్ సినిమా నా? అని కూడా చూడకుండా దానిని ఆదరించడం ఒక్క తెలుగు ఆడియన్స్ కే చెల్లింది. తమిళ హీరోల, డైరెక్టర్లు కి తెలుగు ప్రేక్షకులలో ఆదరణ మాములుగా లేదు. తమిళ డబ్బింగ్ సినిమాలకు తెలుగు సినిమాలతో పోటీగా వసూళ్లు అందుతాయంటే అతిశయోక్తి కాదు. మొదట కమల్ హాసన్, రజినీకాంత్, సూర్య, అజిత్, కార్తీక్, విశాల్ తెలుగు లో మార్కెట్ పెంచుకోగా.. వారి తర్వాత లైన్ లోకి విజయ్ సేతుపతి మరికొందరు యువ హీరోలు వస్తున్నారు.