ఎప్పుడైతే డిజిటల్ మాధ్యమాల హవాకు ఆదరణ పెరిగిందో.. కొత్త కాన్సెప్ట్ చిత్రాలకు ఆదరణ పెరిగింది. చిన్న, పెద్ద హీరోలనే తేడా లేదు. భాషతో పనే లేదు. దీంతో పెద్ద స్టార్స్ సైతం కమర్షియల్ సినిమాలకు పెద్ద పీట వేస్తూనే డిఫరెంట్ కాన్సెప్ట్స్, లుక్స్, రోల్స్‌కు ప్రాధానత్యను ఇస్తున్నారు. కథ డిమాండ్ మేరకు అగ్ర హీరోలు బోడి గుండుతో కనిపించటానికి రెడీ అనేస్తున్నారు. సూపర్‌స్టార్, మెగాస్టార్, యూనివర్సల్ హీరో.. ఇలా అందరూ అభిమానులను బాస్.. గుండు బాస్ రూపంలో అలరించారు. మరికొందరు అలరించటానికి రెడీ అవుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..