X
Home టాప్ లిస్టింగ్

రీల్ లైఫ్ టు రియ‌ల్ లైఫ్ .. ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్స్,,!

Author Administrator | Updated: Thursday, July 6, 2023, 03:53 PM [IST]

రీల్ లైఫ్‌లో సిల్వ‌ర్ స్క్రీన్‌ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన మ‌న నాయ‌కా నాయిక‌ల్లో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న‌వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే రీల్ లైఫ్‌తో పాటు రియ‌ల్ లైఫ్‌లోనూ ఒక‌టైన జంట‌లు కొన్ని ఉన్నాయి. స‌క్సెస్‌ఫుల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తూ ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. అలాంటి జోడీలు ఏంటో ఇప్పుడు చూద్దాం..


cover image
నాగార్జున - అమ‌ల:
1

అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున‌తో అమ‌ల చాలా సినిమాల్లో జోడీ క‌ట్టింది. అందులో శివ సినిమా ఎవ‌ర్ గ్రీన్ మూవీ అనే చెప్పాలి. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కు వీరిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. పెళ్లి త‌ర్వాత అమ‌ల చాలా కాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉన్నారు. ఈ మ‌ధ్య ఆమె మ‌ళ్లీ న‌టిస్తున్నారు. అది కూడా కీల‌క పాత్ర‌ల్లో. ఒక‌రి అభిప్రాయాల‌కు మ‌రొక‌రు గౌర‌వం ఇచ్చుకుంటూ వీరు హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. 

రాజ‌శేఖ‌ర్ - జీవిత‌:
2

డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్‌తో క‌లిసి త‌లంబ్రాలు, అంకుశం, అహుతి వంటి సినిమాల్లో న‌టించిన జీవిత మ‌గాడు సినిమా త‌ర్వాత ఆయ‌న్ని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్ద‌రు కూతుళ్లు. వాళ్లు కూడా ఇప్పుడు హీరోయిన్స్‌గా నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 

మ‌హేష్ బాబు - న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌:
3

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా రూపొందిన వంశీ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌ను ప్రేమించి పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మ‌హేష్ వ్య‌వ‌హారాల‌ను, సినిమా ప‌నుల‌ను అన్నింటినీ న‌మ్ర‌త‌నే ప్లాన్ చేస్తుంటుంది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు. 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ - రేణు దేశాయ్‌:
4

బద్రి, జానీ చిత్రాల్లో త‌న‌తో క‌లిసి న‌టించిన రేణు దేశాయ్‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రేమించారు. రిలేష‌న్ షిప్‌లో ఉన్నారు. పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత‌నే పెళ్లి చేసుకున్నారు. అయితే చాన్నాళ్ల త‌ర్వాత వీరిద్ద‌రూ విడిపోయి అభిమానుల‌కు షాకిచ్చారు. 

సూర్య - జ్యోతిక‌:
5

కోలీవుడ్ హీరో, హీరోయిన్స్ అయిన‌ప్ప‌టికీ సూర్య‌, జ్యోతిక‌ల‌కు తెలుగు ప్రేక్ష‌కుల‌తోనూ మంచి అనుబంధం ఉంది. వీరిద్ద‌రూ క‌లిసి కాక్కా కాక్కా (తెలుగులో ఘ‌ర్ష‌ణ‌), సిల్లండ్రు ఒరు కాద‌ల్ (నువ్వు నేను ప్రేమ‌) వంటి సినిమాల‌తో పాటు అంత‌కు ముందు కూడా క‌లిసి న‌టించారు. చివ‌ర‌కు పెళ్లి చేసుకున్నారు. జ్యోతిక సైతం పెళ్లి త‌ర్వాత కొన్నాళ్లు పాటు సినీ రంగానికి దూరంగా ఉంటూ వ‌చ్చింది. ఇప్పుడిప్పుడే ప్ర‌ధాన పాత్ర‌ల్లో సినిమాలు చేస్తుంది. అందులో చాలా సినిమాల‌ను ఆమె భ‌ర్త సూర్య‌నే నిర్మించారు. 

నాగ చైత‌న్య - స‌మంత‌:
6

చైతు, స‌మంత క‌లిసి ఏమాయ చేసావె, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం వంటి సినిమాల్లో న‌టించారు. అదే స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. అంతా బావుంద‌ని అనుకుంటున్న త‌రుణంలో విడాకులు తీసుకుని అంద‌రికీ షాకిచ్చారు. 

ఆది పినిశెట్టి - నిక్కి గ‌ల్రాని:
7

తెలుగు వాడైన‌ప్ప‌టికీ ఆది పినిశెట్టి కోలీవుడ్‌లోనే సెటిల‌య్యాడు. తెలుగు, త‌మిళంలో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. త‌న‌తో కలిసి సినిమాలు చేసిన నిక్కిగ‌ల్రానీని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు నిక్కి సినిమాల్లో న‌టించ‌టం లేదు. ఫ్యామిలీకే త‌న స‌మ‌యాన్ని కేటాయిస్తుంది. 

వ‌రుణ్ సందేశ్ - వితికా శేరు:
8

హ్యాపీడేస్ మూవీ హిట్‌తో పేరు తెచ్చుకున్న వ‌రుణ్ సందేశ్ వ‌రుస సినిమాలు చేశాడు. అయితే అవేవీ త‌న‌ని పెద్ద హీరోగా నిల‌బెట్ట‌లేక‌పోయాయి. అయితే ప‌డ్డానండి ప్రేమ‌లో మ‌రి సినిమా చేస్తున్న‌ప్పుడు హీరోయిన్ వితికా శేరుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్ద‌రూ కూడా సంతోషంగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. 

వ‌రుణ్ తేజ్ - లావ‌ణ్య త్రిపాఠి:
9

హీరో వరుణ్ తేజ్,  లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే . వీరు తమ ప్రేమను పెద్దలను ఒప్పించి పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు. జూన్ 9  శుక్రవారం వీరి ఎంగేజ్మెంట్ కొంత మంది బంధు మిత్రుల సమక్షంలో జరిగింది.  

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+