ప్రస్తుతం తెలుగు యాంకర్లు సంపాదించే లెక్క తెలిస్తే కొందరు సగటు మనిషి ఆశ్చర్యపోక తప్పదు. తెలుగులో యాంకర్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సుమ కనకాల పేరు ముందు ఉంటుంది. అనసూయ, రష్మి, శ్రీముఖి, మంజూష లాంటి వారు యాంకరింగ్‌కు గ్లామర్ అద్దారు. మూవీస్ లో నటించే హీరోయిన్ల కంటే కూడా టాప్ యాంకర్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. టివి షోస్ చేసుకొనే యాంకర్లే కదా ఏం సంపాదిస్తారులే అనుకుంటే పొరపాటు పడినట్టే.. వాళ్ల సంపాదన నమ్మడానికి కష్టంగా అనిపించినా కూడా నమ్మి తీరాల్సిందే. తెలుగు టాప్ యాంకర్లు ఎంత సంపాదన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..తెలుగులో ప్రస్తావన వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది సుమ కనకాల గురించే. యాంకర్ అనే పదానికి పర్యాయపదంగా మారిన ఆమె స్ఫూర్తితోనే ఎంతో మంది ఈ రంగంలోకి వచ్చారంటే నమ్మాల్సిందే. సుమ మాటలతో కట్టిపడేస్తే అనసూయ, రష్మి, వర్షిణి లాంటి వారు యాంకరింగ్‌కు గ్లామర్ అద్దారు.తెలుగు టాప్ యాంకర్స్ మైండ్ బ్లాంక్ చేస్తోన్న రెమ్యునరేషన్స్