నాని సినీ కెరీర్ ప్రారంభంలో క్లాప్ బాయ్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. అష్టా చమ్మా సూపర్ హిట్ అవ్వడంతో నాని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిరాలేదు. తర్వాత వరుస సినిమాల్లో హీరోగా నటించాడు. రైడ్, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంద, ఈగ, వంటి సినిమాలు నానికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. సహజ సిద్ధమైన నటనతో ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చి నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. స్వయంకృషితోనే పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అతడు పదిహేనేళ్లుగా తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. హీరో నాని సినీ కెరీర్ క్లాప్ బాయ్ నుంచి టాప్ హీరో వరకు ఎలా ఎదిగాడు అనేది ఇప్పుడు చూద్దాం