తెలుగు సినిమా స్థాయిని పెంచిన వాళ్ళలో చిరంజీవి ఒకరు. ఒక సాధారణమైన కుటుంబం నుండి వచ్చి సహాయ పాత్రలతో తన కెరీర్ ని మొదలు పెట్టి, తర్వాత హీరోగా ఎన్నో సినిమాలను చేశారు. చిరంజీవి నుండి సుప్రీం హీరో చిరంజీవి వరకు మళ్లీ అక్కడి నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు ఎదిగే క్రమంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150తో సూపర్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోయారు. ఇక ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’తో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించారు. మొత్తంగా చిరు గత ఐదు సినిమాల టోటల్ కలెక్షన్స్ విషయానికొస్తే..