పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం పవన్ హరి హర వీరమల్లు చిత్రీకరణలో ఉన్నాడు. హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఆ తరువాత సాహూ ఫేమ్ సుజిత్ OG సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటితో పాటు మరో మూవీని కూడా పట్టాలెక్కించేశాడు. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ కామెడీ డ్రామా వినోదయ సిత్తం మూవీని పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయిన ఎందుకు ఆయనకి అంత క్రేజ్ ఉందో ఎవరికి తెలీదు ఆయనకి సినిమా పరంగా ఫ్యాన్స్ అయిన వాళ్ళు కొంత మంది అయితే వ్యక్తిగతంగా ఆయన కి ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలా మందే అని చెప్పవచ్చు. ఇటు సినిమాల్లో హీరోగా చేస్తూనే ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలి అని తనకి తానే అనుకొని ఒక ఉద్యమంలా ముందుకు నడుస్తున్నాడు.