సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది . ముందుగా ఈ సినిమా నుంచి రిలీజయిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులని మెప్పించాయి. యూట్యూబ్ వీడియోలతో కెరీర్ స్టార్ట్ చేసి.. సిల్వర్ స్క్రీన్ పై నటుడిగా ఇమేజ్ సంపాదించుకున్నారు సుహాస్. కలర్ ఫోటో చిత్రానికి సినీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోగా సుహాస్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. కలర్ ఫోటో మూవీ జాతీయ అవార్డ్ అందుకుంది. సుహాస్ కు ‘హిట్2’ చిత్రంలో చేసిన విలన్ రోల్ కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు హీరోగా రెండో ప్రయత్నం రైటర్ పద్మభూషణ్ తో చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంటోంది. సుహాస్ ఫస్ట్ థియేటర్ రిలీజ్ మూవీ 'రైటర్ పద్మభూషణ్' హిట్ టాక్ రావడానికి గల కారణాలు