టాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరోల్లో వెంకటేష్ కు ప్రత్యేక స్థానం ఉంది. అందరి హీరోల్లా ఈయన మాస్ ఇమేజ్ కోసం పరితపించిపోలేదు.కెరీర్ ప్రారంభం నుండీ కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలనే చేస్తూ వచ్చారు. హిట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న హీరో కూడా ఇతనే. వెంకటేష్ చేసిన రీమేక్ మూవీస్ అన్ని ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి. నిజానికి రీమేక్ సినిమాలో నటించడం అంత ఈజీ కాదు. ముందుగా ఆ పాత్రని ఎంతో ఓన్ చేసుకుంటేనే కానీ… ఆ పాత్రకి హీరో న్యాయం చేసే అవకాశం ఉండదు. అయితే వెంకటేష్ మాత్రం ఎంతో ఈజ్ తో చాలా రీమేక్ లలో నటించారు. అవేంటో ఓ లుక్కేద్దాం రండి.