కన్నడ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ ను ఏలేస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఆమె టాప్ హీరోలతో వరుస సినిమాలు చేస్తోంది. పెళ్లి సందడిలాంటి అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన అందం, అభినయంతో శ్రీలీల దూసుకెళ్తోంది. శ్రీ లీల ఓ లక్కీ ఛార్మ్ గా మారిపోయింది. పెద్ద పెద్ద హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తోంది. ముఖ్యంగా ధమాకా సూపర్ హిట్ తర్వాత శ్రీలీల రేంజ్ మరో లెవల్ కు వెళ్లింది. శ్రీలీల చేతిలో తొమ్మిది సినిమాలు ఉన్నాయి. పైగా అన్నీ పెద్ద సినిమాలే. బడా ప్రొడక్షన్స్ హౌస్ సినిమాల అన్నింటిలో శ్రీలీలే హీరోయిన్ ఇప్పుడు. ఒకేసారి 9 సినిమాల షూటింగ్‌లతో బిజీబిజీగా ఉంటోంది. అందులో మూడు ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్నాయి. ఎస్ఎస్ఎంబీ28, ఉస్తాద్ భగత్‌సింగ్, వైష్ణవ్ తేజ్ మూవీ, నితిన్ 32, అనగనగా ఒక రాజు, జూనియర్ మూవీలతోపాటు బోయపాటి శ్రీను, బాలకృష్ణ మూవీ ఎన్‌బీకే108లోనూ నటించనుంది. అందం, నటనతోపాటు ఆమె డ్యాన్స్ లలోనూ ఇరగదీస్తుంది.