X
Home టాప్ లిస్టింగ్

2020 లో మ‌రణించిన తెలుగు సినీ ప్ర‌ముఖులు

Author Administrator | Published: Friday, December 4, 2020, 08:42 PM [IST]

2020 సినీ ఇండస్ట్రీకి అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. సినియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో చనిపోగా.. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు కరోనా బారిన పడి కన్నుమూసారు. ఈయనతో పాటు 2020లో ఇప్టటి వరకు కన్నుమూసిన సినీ ప్రముఖులు వీళ్లే.


cover image
యస్ పి బాలసుబ్రమణ్యం
1

చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 74 ఏళ్ల  ఎస్పీ బాలసుబ్రమణ్యం 29/09/2020న కన్నుమూశారు.

జయప్రకాష్ రెడ్డి
2

తెలుగు సినియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. గుంటూరులోని తన స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. తూర్పు జయప్రకాశ్ రెడ్డి 1946 అక్టోబర్ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా సిర్వేల్ లో జన్మించారు. 

కోసూరి వేణు గోపాల్‌
3

కరోనా కాటుకు టాలీవుడ్ కమెడియన్ ఒకరు కన్ను మూశారు. ప్రముఖ సినీ నటుడు కోసూరి వేణు గోపాల్‌ కరోనా బారిన పడి చికిత్స పొందుతూ నిన్న పొద్దుపోయాక మరణించారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందారు వంటి సినిమాల్లో మంచి గుర్తింపు వచ్చింది. గత 26 ఏళ్ళగా సినిమాల్లో నటిస్తోన్న ఆయన ఎన్నో వందల సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేశారు.

బోగారి లక్ష్మీ నారాయణ
4

టాలీవుడ్ నిర్మాత బోగారి లక్ష్మీ నారాయణ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు..తెలుగులో శ్రీ భాగ్యలక్షి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ‘ఎదురీత’ అనే చిత్రాన్ని నిర్మించారు బోగారి లక్ష్మీ నారాయణ.

యాదా కృష్ణ
5

బి గ్రేడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో, నిర్మాత యాదా కృష్ణ కన్నుమూశారు. 20కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు.గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. యాదా కృష్ణ వయసు 61 సంవత్సరాలు. 20కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన యాదా కృష్ణ గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన చేసినవన్నీ బి గ్రేడ్ సినిమాలే. ‘గుప్త శాస్త్రం’, ‘వయసు కోరిక’, ‘పిక్నిక్’ లాంటి బి గ్రేడ్ సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు యాదా కృష్ణ. కొన్ని చిత్రాలను ఆయనే స్వయంగా నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+