X
Home టాప్ లిస్టింగ్

టీవీ సీరియల్స్ లో నటిస్తూ తోటి నటులనే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు

Author Administrator | Updated: Wednesday, July 12, 2023, 07:17 PM [IST]

సినిమా నటులకు ఏమాత్రం తీసిపోకుండా సత్తా చాటడమే కాదు, ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్నారు. టీవీ సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులు తమ తోటి నటులనే ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు వున్నారు. టీవీ సీరియల్స్ లో నటిస్తూ తోటి నటులనే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు వారెవరో తెల్సుకుందాం.


cover image
1

ప్రియతమ్ అనగానే ముందుగానే గుర్తొచ్చేది ఈటీవీ లో ప్రసారమైన మనసు మమత సీరియల్ లోని రాజా పాత్ర. అలా ప్రియతమ్ తన నటన తో ఫ్యామిలీ ప్రేక్షకుల కు దగ్గర అయ్యాడు.  చంద్రముఖి క్యారక్ట్ ర్ తో అందరిని మెప్పించిన మానస. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో అనే సీరియల్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రియతమ్ చరణ్,మానస ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు.

2

చంద్రముఖి సీరియల్‌తో వీరి ప్రయాణం మొదలైంది. కన్నడ నటి అయిన మంజలు చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటికి నిరుపమ్ కూడా సీరియళ్లకు కొత్తే. అలా చంద్రముఖి సీరియల్ జరుగుతుండగానే.. వీరి మధ్య బంధం మొదలైంది.  పరిటాల నిరుపమ్,మంజుల ఒకరికొకరు ఇష్టపడి పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నారు.

3

అపరంజి, అనుబంధాలు,ఇద్దరమ్మాయిలు తదితర సీరియల్స్ లో నటించిన సీనియర్ హీరోయిన్,వెండితెర హీరోయిన్ సుహాసిని తనతో కల్సి ఇద్దరమ్మాయిలు సీరియల్ లో నటించిన ధర్మని పెళ్లాడింది.

4

సిద్ధార్థ వర్మ..  త్రినయని, కుంకుమపువ్వు,ఇద్దరమ్మాయిలు అభిషేకం వంటి సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.  పలు సీరియల్స్ లో నటించిన సిద్ధార్థ వర్మ బుల్లితెర నటి విష్ణు ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

5

'ఉయ్యాలా జంపాల' సీరియల్ తో తెలుగు టీవీ ఆడియన్స్ కి పరిచయమైన అమర్ సెకండ్ హీరోగా మెరిసి.. 'సిరిసిరి మువ్వలు' సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. తెలుగు, కన్నడ, తమిళంలో బుల్లితెరపై మెరుస్తోన్న తేజస్విని గౌడ కన్నడ సీరియల్ 'బిలి హెండి'లొ తొలిసారిగా నటించింది. ఆ తర్వాత 'కోయిలమ్మ' సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. 'సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్' తమిళ సీరియల్‌తో మంచి గుర్తింపు పొందింది

6

వైదేహి,సంఘర్షణ,కలవారి కోడలు,మనసు తదితర సీరియల్స్ లో కల్సి నటించిన హరిత,జాకీ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+