X
Home టాప్ లిస్టింగ్

లైగర్​ఫ్లాప్​టాక్​..నెగిటివ్ ట్రోలింగ్.. అందుకు గల 7 కారణాలు

Author Administrator | Published: Saturday, August 27, 2022, 12:51 PM [IST]

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన లైగర్ ఆగ‌స్ట్ 25న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అంచనాలకు భిన్నంగా లైగర్​ఫ్లాప్​టాక్​ను మూటగట్టుకుంటోంది. అందుకు కారణాలేంటో ఓ లుక్కేద్దామా!


cover image
పూరి జగన్నాధ్
1

పూరీ రొటీన్ స్టోరీని రాసుకున్నా.. ఆకట్టుకునే రీతిలో కథనం అల్లుకోలేకపోయాడు. స్టొరీ పాయింట్ ఆల్ మోస్ట్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయిని పోలి ఉన్నప్పటికీ పూరీలో ఒకప్పటి కసి మాత్రం కనిపించలేదు…. అతి సాధారణమైన స్టొరీ పాయింట్ ని తీసుకుని హీరోకి అస్సలు సెట్ అవ్వని నత్తిని జోడించిన పూరీ ఏ దశలో కూడా డైరెక్టర్ గా తన పవర్ ని చూపించలేదు. 

 

అనన్య పాండే
2

హీరోయిన్ అనన్యా పాండే నటనకు నెగిటివ్ మార్కులు పడ్డాయి. హీరోయిన్ అనన్య పాండే వచ్చిన సీన్స్ మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలాగానే ఉన్నాయి. సహజంగానే పూరి సిననిమాల్లో హీరోయిన్ల నుంచి రొమాన్స్​, సాంగ్స్​తప్ప ఏం ఆశించలేం. అయితే వీళ్లిద్దరి లవ్ ట్రాక్​కనీసం మూవీని నడిపించే విధంగా లేకపోవడంతో మైనస్​గా మారింది. 

విజయ్ దేవరకొండ
3

హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డారు. ఆయన ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌ గ్రేట్..  కానీ తనకి నత్తి అస్సలు సెట్ కాక పోవడం, లవ్ ట్రాక్ చాలా వీక్ గా ఉండటం, కథలో అసలు సత్తా లేక పోవడంతో సినిమా కోసం విజయ్ దేవరకొండ పడ్డ కష్టం అంతా వృధా అయింది.  పాన్ ఇండియా మార్కెట్‌కు ఇటువంటి సినిమాతో ఇంట్రడ్యూస్ కావటం, ఇదొక బ్యాడ్ ఛాయస్. 

రమ్య కృష్ణన్
4

రమ్యకృష్ణకు పవర్​ఫుల్​రోల్​పడితే అదరగొట్టేస్తారు కానీ లైగర్​లో ఆమె పాత్ర గోలగోలగా ఉంది. రమ్యకృష్ణ పెర్ఫార్మెన్స్ బాగున్నా ఆ రోల్ చేసే ఓవర్ యాక్షన్ బరించడం కష్టమే

 

మైక్ టైసన్
5

అంత పెద్ద బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో నటిస్తున్నారు అంటే ఎంత మంచి రోల్ చేస్తున్నారో అని అనుకున్నారు. సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర మైక్ టైసన్ పాత్రని కొట్టడం చూసే వారికి ఏమాత్రం నచ్చలేదు.  మైక్ టైసన్ రోల్ మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేయలేదు

సునీల్ కశ్యప్
6

లైగర్​ఫ్లాప్​టాక్ మరో కారణం మ్యూజిక్.. ఒకటి రెండు పాటలు తప్ప మిగతావి అంతగా ఆకట్టుకోలేదు. అవి కూడా రిపీటెడ్​గా వినేంతగా లేవు. ఈ మూవీకి సునీల్​కశ్యప్​, విక్రమ్​సహా పలువురు మ్యూజిక్​డైరెక్టర్స్​పనిచేశారు. వారు అందించిన బీజీఎం అంతగా ఆకట్టుకోలేదు 

చార్మి కౌర్
7

ఈ సినిమాకు ఊహించని విధంగా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ పెరిగింది. సినిమా పోస్టర్లు, టీజర్​, సాంగ్స్, ట్రైలర్​మరింత ఊపునిచ్చింది.  మళ్లీ ఈ మూవీలో లెజండరీ బాక్సర్​మైక్​టైసన్​నటించడం, ప్రమోషనల్స్​లో భాగగా విజయ్​ను బోల్డ్​గా చూపించడం విజయ్​దేవరకొండ నగ్నంగా ఉండే పిక్ తో మరింత హైప్​క్రియేట్ అయింది. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+