X
Home టాప్ లిస్టింగ్

2021లో పెళ్లి చేసుకున్న తెలుగు సినీ సెలెబ్రిటిస్

Author Administrator | Published: Friday, December 3, 2021, 03:03 PM [IST]

ఈ యేడాది మొదట్లో సింగర్ సునీత ప్రముఖ వ్యాపారవేత్త మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వరుణ్ ధావన్, దియా మీర్జా, విష్ణు విశాల్, ఆపై ప్రణీత పెళ్లి పీఠలు ఎక్కారు. యామీ గౌతమ్ రహస్యంగా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక గొడవ మూవీ ఫేమ్ శ్రద్ధా ఆర్య కూడా మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసింది. హీరోగా కార్తికేయ లోహిత రెడ్డి ని పెళ్లి చేసుకున్నారు. మొత్తంగా 2021లో పెళ్లి పీఠలు ఎక్కిన సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారో మీరు ఓ లుక్కేయండి.


cover image
కార్తికేయ
1

కార్తికేయ తన స్నేహితురాలు లోహిత రెడ్డిని నవంబర్ 21న పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం హైదరాబాద్ లో బ్రాహ్మణ వేద మంత్రాల సాక్షిగా ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి  సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ప్రణీత సుభాష్
2

గుండ్రంగా ఉండే తన పెద్ద పెద్ద కళ్లతో, చక్కని చిరునవ్వుతో కుర్రకారు మనసు దోచి, తక్కువ టైంలోనే హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.  ప్రణీత సుభాష్ మే 31న ప్రముఖ వ్యాపార వేత్త నితిన్ రాజ్‌ను సింపుల్‌గా పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే వీరి వెడ్డింగ్‌కి అటెండ్ అయ్యారు.

 

యామి గౌతమ్
3

యామీ గౌత‌మ్ సినీ నటి తెలుగుతో బాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ చిత్రాలలో నటించింది. యామీ గౌత‌మ్ వివాహం 4 జూన్ 2021న సినీ ర‌చయిత‌, ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ ధ‌ర్‌ ను వివాహమాడింది. 

 

శ్రద్దా ఆర్య
4

హీరోయిన్  శ్రద్ధా ఆర్య  వివాహా బంధంలో అడుగు పెట్టింది. ఈమె  విషయానికొస్తే.. శ్రద్ధా ఆర్య తెలుగులో ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఆయన తనయుడు వైభవ్ హీరోగా పరిచయమైన ‘గొడవ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఈమె పలు టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై తమిళ సినిమాల్లో నటించింది. రీసెంట్‌గా  ఈమె దిల్లీకి చెందిన నేవి ఆఫీసర్ రాహుల్ శర్మను నవంబర్ 16న పెళ్లి చేసుకుంది, 

అశిస్ గాందీ
5

ప్రముఖ నటుడు ఆశీష్ గాంధీ తన సన్నిహితులైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నిఖితను జూన్ 4న పెళ్లి చేసుకున్నారు. 

సునీత (సింగర్)
6

టాలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత జనవరి 9న పెళ్లి చేసుకుంది.. మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని ఆమె వివాహం చేసుకుంది. దీంతో వీరిద్దరి పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈమె 19 ఏళ్లకే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సునీత విడాకులు ఇచ్చి కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంది. ఆ తర్వాాత చాలా యేళ్లకు రామ్ వీరపనేనిని వివాహాం చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+