ముంబై నుంచి వచ్చిన సౌత్‌లో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగుతున్న వారి సంగతి పక్కన పెడితే..... వారి తర్వాత సౌతిండియా సినీ పరిశ్రమల్లో ఓ రేంజిలో సత్తా చాటుతున్న భామలు మలయాళీ కుట్టీలు. సౌత్ సినీ పరిశ్రమల్లో ముంబై భామల తర్వాత ఎక్కువ మంది హీరోయిన్లు వచ్చింది కేరళ నుండే. పెర్ఫార్మెన్స్‌లో, అందాల ఆరబోతలో తమదైన శైలిని ప్రదర్శించడం, రొమాంటిక్ సీన్స్, శృంగార సన్ని వేశాల్లో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేలా నటించడం, చాలెంజింగ్ రోల్స్ చేయడంలో ప్రత్యేకత చూపడంలో మలయాళీ భామల తర్వాతే ఇంకెవరైనా అని చెప్పక తప్పదు. నయనతార, అసిన్, ప్రియమణి, లక్ష్మీరాయ్, మమతా మోహన్ దాస్, మీరా జాస్మిన్, శ్వేతా మీనన్, సింధు మీనన్ లాంటి హీరోయిన్లను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.