X
Home టాప్ లిస్టింగ్

2022 ఆగ‌స్ట్ నెలలో రిలీజ్ కానున్న తెలుగు సినిమాలు ఇవే

Author Administrator | Published: Saturday, July 30, 2022, 04:26 PM [IST]

ఆగస్ట్ నెలలో రిలీజ్ కి సిద్ధంగా వున్నా భారీ బడ్జెట్ తెలుగు మూవీస్ ఏవంటే... ! విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్' నితిన్, నిఖిల్ తో పాటు పలువురు స్టార్స్ ఆగస్ట్ నెలలో ప్రేక్షకలు ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆగస్ట్ లో రిలీజ్ కానున్న తెలుగు సినిమాలు ఏవంటే...


cover image
బింబిసారా
1

క‌ల్యాణ్‌రామ్, సంయుక్త మీన‌న్‌, కేథ‌రిన్ తదితరులు నటించిన బింబిసార చిత్రం ఆగ‌స్ట్ 5న రిలీజ్ కానుంది. ఫాంట‌సీ హిస్టారిక‌ల్ డ్రామాగా రూపొందిన బింబిసార చిత్రంతో వ‌శిష్ట్ మ‌ల్లిడి ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు. 

 

సీతా రామం
2

దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్ జంట‌గా పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన చిత్రం సీతారామం. వార్ బ్యాక్‌డ్రాప్‌కు ప్రేమ‌క‌థ‌ను జోడించి ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమాను తెర‌కెక్కించారు.  చిత్రం ఆగ‌స్ట్ 5న రిలీజ్ కానుంది. 

మాచర్ల నియోజకవర్గం
3

నితిన్ హీరోగా న‌టించిన మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమా ఆగ‌స్ట్ 12న రిలీజ్ కానుంది. రాజ‌కీయ అంశాల‌తో తెర‌కెక్కిన ఈ సినిమాతో ఎడిట‌ర్ ఎం.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కృతిశెట్టి, కేథ‌రిన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 

కార్తికేయ 2
4

నితిన్ తో పోటీగా ఆగ‌స్ట్ 12న నిఖిల్ కార్తికేయ -2తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ సీక్వెల్‌కు చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అనుప‌మ‌ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

 

తీస్‌ మార్‌ ఖాన్‌
5

ఆదిసాయికుమార్, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా న‌టించిన తీస్‌మార్‌ఖాన్ సినిమా ఆగ‌స్ట్ 19న రిలీజ్ కానుంది. క‌ళ్యాణ్ జి గోగన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

 

కమిట్‌మెంట్
6

తేజ‌స్వి మ‌దివాడ‌, అన్వేషిజైన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన క‌మిట్‌మెంట్ సినిమా ఆగ‌స్ట్ 19న ప్రేక్ష‌క‌లు ముందుకు రానుంది.

లైగర్
7

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా, అన‌న్యా పాండే హీరోయిన్‌గా పూరి దర్శకత్వంలో వస్తోన్న లైగర్ సినిమాపై దేశ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.  తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, కన్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఆగ‌స్ట్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది.

 

ప్రిన్స్
8

అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టిస్తున్న ద్విభాషా చిత్రం ప్రిన్స్‌. ఈ చిత్రం ఆగ‌స్ట్ 31న రిలీజ్ కానుంది. 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+