థియేటర్స్ క్లోజ్ అవడంతో చిన్న సినిమాలకు డిజిటల్ వేదికలు ప్రత్యామ్నాయ మార్గాలుగా మారాయి. ఇప్పటికే చాలా సినిమాలు డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ అవ్వగా, కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి ఓటిటి ప్లాట్‌ఫామ్స్ లో వస్తున్నాయి. 2021 మే నెలలో దాదాపు ఇప్పటి వరకు 8 సినిమాలు ఓటిటిల ద్వారా విడుదలయ్యాయి. అనసూయ థాంక్ యు బ్రదర్, సినిమా బండి, బట్టల రామస్వామి బయోపిక్కు లాంటి మొదలగు సినిమాలు.