హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఉగాది, రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు సినిమాపై అంచనాను పెంచేశాయి. గబ్బర్ సింగ్ తర్వాత దాదాపు 14 ఏళ్లకు హరీశ్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఆ హైప్ ఇంకా రెట్టింపు అయ్యింది.