ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ సలహా.. అలాంటి పట్టించుకోవద్దంటూ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో బన్నీ అడుగుపెట్టారు. వరుస విజయాలు అందుకుంటూ స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ క్రేజ్ మొత్తం మారిపోయింది. అతని కెరీర్‌ను పుష్ప ముందు పుష్ప తర్వాత అని డివైడ్ చేయొచ్చు. ఈ సినిమాతో పాన్ ఇండియా ఫేమ్ సొంతం చేసుకున్నారు.

Also Read
24 ఏళ్ల క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్? 33 ఏళ్ల హీరోయిన్ కొత్త లవ్ స్టోరీ!
24 ఏళ్ల క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్? 33 ఏళ్ల హీరోయిన్ కొత్త లవ్ స్టోరీ!

కోట్లాది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన అభిమానులతో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ ఫ్యాన్స్ మీట్‌లో బన్నీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

Allu Arjun s Fans Meet Icon Star Urges Fans to Ignore Trolls and Stay Positive

అల్లు అర్జున్ .. ఒకవైపు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' సినిమాలో నటిస్తుండగా, ఆ తర్వాత లోకేష్ కనగరాజ్‌తో మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ఇటీవల కుటుంబంతో విదేశీ విహారయాత్ర ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన బన్నీ.. అభిమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుఫ్‌గూడలోని శౌర్య భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన అల్లు అర్జున్.. సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్, ఫ్యాన్ వార్స్, నెగెటివిటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Recommended For You
52 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో మలైకా అరోరా? 19ఏళ్ల చిన్నవాడితో...
52 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో మలైకా అరోరా? 19ఏళ్ల చిన్నవాడితో...

ముఖ్యంగా అభిమానులు తమ సమయాన్ని అనవసరమైన వాదనల్లో వృథా చేసుకోవద్దని సూచించారు. "మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వదిలేయండి. కానీ వారిని హేట్ చేయడం, ట్రోల్ చేయడం కోసం మీ టైమ్, డబ్బు, ఎనర్జీ ఖర్చు పెట్టొద్దు" అని అల్లు అర్జున్ అన్నారు. "మీకు నచ్చిన పని చేసుకోండి. కావాలంటే మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు వెళ్లి నిలబడి ఎంజాయ్ చేయండి. కనీసం అప్పుడు అయినా మీరు హ్యాపీగా ఉంటారు" అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. "మీ దగ్గర వంద రూపాయలు ఉంటే మీకు నచ్చని వస్తువు కోసం ఖర్చు చేస్తారా? చేయరు కదా. అలాగే మీకు నచ్చని వ్యక్తి కోసం కూడా మీ సమయం, శక్తి ఎందుకు ఖర్చు చేయాలి? వదిలేయండి" అంటూ అభిమానులకు సలహా ఇచ్చారు.

You May Also Like
మనిద్దరం పెళ్లి చేసుకుందామా?.. యాంకర్‌కు హీరో నవదీప్ షాకింగ్ ప్రపోజల్!
మనిద్దరం పెళ్లి చేసుకుందామా?.. యాంకర్‌కు హీరో నవదీప్ షాకింగ్ ప్రపోజల్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ ఎక్కువవుతున్నాయని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు. ఒక హీరో అభిమానులు మరో హీరోను ట్రోల్ చేయడం, మీమ్స్ తయారు చేసి నెగెటివిటీ వ్యాప్తి చేయడం సాధారణంగా మారిందని అన్నారు. అలాంటి వాటిలో పాల్గొనకుండా పాజిటివ్ గా ఉండాలని అభిమానులకు సూచించారు. "సమయం చాలా విలువైంది. దాన్ని ఎవరికైనా కౌంటర్లు ఇవ్వడానికి కాదు.. మీ భవిష్యత్తు కోసం ఉపయోగించండి. మీ ఎదుగుదలపై దృష్టి పెట్టండి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడండి" అంటూ అభిమానులకు సూచించారు.

'నేను ఆట బొమ్మను కాదు.. అలాంటి ఆఫర్లు అక్కర్లేదు’
'నేను ఆట బొమ్మను కాదు.. అలాంటి ఆఫర్లు అక్కర్లేదు’

అల్లు అర్జున్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాకా' చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో బన్నీ నటించనున్నారు. దీంతో ఆయన అభిమానులు ఈ రెండు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more about: atlee allu arjun lokesh kanagaraj
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X