మనిద్దరం పెళ్లి చేసుకుందామా?.. యాంకర్‌కు హీరో నవదీప్ షాకింగ్ ప్రపోజల్!
Kaakamma Kathalu S3 Promo: టాలీవుడ్ హీరో నవదీప్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించారు. సరదా మాటలు, స్పాంటేనియస్ కామెంట్స్‌తో ఎప్పుడూ ఆకట్టుకునే నవదీప్.. ఈసారి యాంకర్ తేజస్వీ మదివాడను ఆటపట్టిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన 'కాకమ్మ కథలు సీజన్ 3' ప్రోమోలో నవదీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
తేజస్వీ మదివాడ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కాకమ్మ కథలు' సీజన్3 షోకు ఈసారి హీరో నవదీప్, నటి అనిషా ఆంబ్రోస్ అతిథులుగా హాజరయ్యారు. ప్రోమో ప్రారంభం నుంచే సరదా సంభాషణలతో నవ్వులు పూశాయి. నవదీప్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ తేజస్వీ తనదైన స్టైల్‌లో పంచ్ వేసింది. "నవ మన్మధుడు.. పెళ్లి గురించి అడిగితే బీప్ వచ్చేది మన నవదీప్" అంటూ ఫన్నీగా పరిచయం చేసింది. దీంతో నవదీప్ కూడా నవ్వుతూ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు.

షోలో భాగంగా "ఆశకు హద్దు ఉండాలి" అనే టాస్క్ నిర్వహించారు. ఇందులో నవదీప్ ఒక విచిత్రమైన కథ చెప్పి అందరినీ నవ్వించాడు. ఒడిశాలోని ఓ గ్రామంలో వర్షం కురిసిన రాత్రి కవల పిల్లలు పుట్టారని చెప్పాడు. ఒకరికి వెన్నెల, మరొకరికి అమావాస్య అని పేర్లు పెట్టారని చెప్పి కథను విచిత్రంగా మలిచాడు. అంతటితో ఆగకుండా, "ఆ అమ్మాయి ఎప్పుడూ కుర్చీలు మడతపెట్టేది. అందుకే ఆమెను ఊటీకి పంపించారు. అక్కడ ఫుల్‌గా వెళ్తున్న టాక్సీలో నేను కలిశాను" అంటూ ఊహించని ట్విస్టులతో కథ చెప్పి నవ్వులు పూయించాడు.
ఈ క్రమంలో తేజస్వీ నవదీప్‌ను వ్యక్తిగత విషయాలపై ప్రశ్నించింది. "ఈ మధ్య మీ గురించి వచ్చిన పెద్ద రూమర్ ఏంటి?" అని అడిగింది. దానికి నవదీప్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. "నా లైఫ్‌లో చాలా రొమాన్స్‌లు వచ్చాయి. కానీ..." అంటూ మాట మార్చిన నవదీప్ ఒక్కసారిగా తేజస్వీ వైపు చూస్తూ,"మనిద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఏమో?" అంటూ సరదాగా ప్రపోజ్ చేశాడు. ఈ కామెంట్స్ తో తేజస్వీ ఒక్కసారిగా షాక్ అయింది. నవదీప్ అక్కడితో ఆగకుండా చేతిలో పువ్వు తీసుకుని ప్రపోజ్ చేసే ప్రయత్నం కూడా చేశాడు.
దానికి తేజస్వీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. "షోకు పిలిస్తే నాతోనే ఆడుకుంటున్నాడు" అంటూ నవ్వుతూ సెటైర్ వేసింది. తర్వాత నవదీప్ యాంకర్ కుర్చీలో కూర్చుని తేజస్వీని గెస్ట్‌లా ఇంటర్వ్యూ చేయడం మరో హైలైట్‌గా నిలిచింది. "మీలో మీరు తగ్గించుకోవాల్సింది ఏదైనా ఉందా?" అంటూ ప్రశ్నలు వేసి ఆమెను ఆటపట్టించాడు. ఆ తర్వాత తేజస్వీ కూడా నవదీప్‌ను వదల్లేదు. "ప్రస్తుతం మీ క్రష్ ఎవరు?" అని ప్రశ్నించింది. దానికి నవదీప్, "ఆడవాళ్లలోనా... మగవాళ్లలోనా?" అంటూ రివర్స్ ప్రశ్న వేయడంతో అక్కడున్నవారంతా నవ్వేశారు.
పక్కనే ఉన్న అనిషా ఆంబ్రోస్ కూడా ఈ సంభాషణలో పాల్గొంది. "ఈ ప్రాబ్లమ్ కోవిడ్ నుంచి వచ్చింది. అప్పటి నుంచి ఇలాగే మాట్లాడుతున్నాడు" అంటూ నవదీప్‌పై సరదా సెటైర్ వేసింది. ఈ ప్రోమో విడుదలైన తర్వాత మరోసారి తేజస్వీ-నవదీప్ రిలేషన్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. గతంలో కూడా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు చాలాసార్లు వైరల్ అయ్యాయి.
అయితే ఆ ప్రచారంపై తేజస్వీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. నవదీప్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని ఆమె స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చాలా మంది "మీ పెళ్లి ఎప్పుడు?" అని అడుగుతుంటారని చెప్పింది. "ఒక అబ్బాయి, అమ్మాయి క్లోజ్‌గా ఉంటే తప్పనిసరిగా ప్రేమలోనే ఉండాలా? పెళ్లి చేసుకోవాలా?" అంటూ తేజస్వీ ప్రశ్నించింది. అలాంటి ప్రచారాల్లో నిజం లేదని ఆమె తేల్చి చెప్పింది. బిగ్‌బాస్ తర్వాత తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని కూడా తేజస్వీ వెల్లడించింది. వ్యక్తిగతంగా చాలా కష్టాలు చూశానని, తన బాయ్‌ఫ్రెండ్‌ను కూడా కోల్పోయానని భావోద్వేగంగా చెప్పింది.
మరోవైపు నవదీప్ కూడా గతంలో పలు ఇంటర్వ్యూల్లో తన పెళ్లి, రిలేషన్‌షిప్‌పై ఓపెన్‌గా స్పందించారు. సరైన వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు 'కాకమ్మ కథలు సీజన్ 3' ప్రోమోలో నవదీప్ చేసిన సరదా ప్రపోజల్, తేజస్వీ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications






