‘6 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయా... షూటింగ్‌లోనే అలా పిండం పెట్టి’
చిత్ర పరిశ్రమలో టాప్ పొజిషన్‌లో ఉన్న స్టార్స్ ఈరోజు ఇలా ఉండటానికి కారణం వారి తల్లిదండ్రులు, కుటుంబం ప్రోత్సహమే. బిడ్డలను పెంచడానికి ఎన్నో కష్టాలు పడి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డారు. వెతికి చూస్తే ప్రతిస్టార్ జీవిత కథలోనూ ఇలాంటి త్యాగమూర్తులు ఎందరో. తెలుగు ప్రజలను తన కామెడీతో కడుపుబ్బా నవ్వించి, హీరోగా అలరించి, విలన్‌గా భయపెట్టిన సునీల్ కూడా తన తల్లి పడిన కష్టం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..
గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్, సునీల్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ఇసకపట్నం. జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల నిర్వహిస్తోన్న సుమ ఛాట్ షోకు ఈ మూవీ టీమ్ హాజరై సందడి చేసింది. ఈ సందర్భంగా సునీల్, ఐశ్వర్య రాజేష్, సముద్రఖనిలు తమ బాల్యం, తల్లిదండ్రులు, ఇండస్ట్రీలోకి రావడానికి పడిన కష్టం గురించి చెప్పారు.

మాకు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని మా అమ్మ ఎంతో కష్టపడింది. నన్ను, ముగ్గురు అన్నయ్యలని బాగా చదివించింది. అలా కష్టాలుపడి ఇక్కడి దాకా వచ్చా. సినిమాలలో కూడా సిన్సియర్‌గా పనిచేయడం, డెడికేషన్ ఉన్నాయి కాబట్టి మేం ఇక్కడ ఉన్నాం. ఒకసారి లక్ష్మీదేవి వచ్చి తలుపు తడుతుంది మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా ఆవిడ టెస్ట్ చేస్తుంది, దానికి నువ్వు మర్యాద ఇవ్వకపోతే లక్ష్మీదేవి మళ్లీ రాదు. సినిమా కూడా అంతే.. డెడికేషన్, రెస్పాన్సిబిలిటీతో నటించాలి అని ఐశ్వర్య తెలిపారు.
ప్రొడ్యూసర్‌ని దేవుడిలాగా చూసుకోవాలి. అలా కాకుండా ఎక్స్‌ట్రాలు చేస్తే దేవుడికి మనల్ని ఎక్కడ ఉంచాలో తెలుసు. మా నాన్నగారిని నేను చూడలేదు. నేను ఏదైనా సెట్‌కి వెళితే మా నాన్నతో పనిచేసిన వారు వచ్చి పలకరించేవారు. మీ నాన్నగారు చాలా అందంగా ఉండేవారు, ఎంతోమంచి వారు.. చాలా మందికి సాయం చేసేవారని చెప్పేవారు. తెలుగులో కంటే తమిళంలో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. నా పేరు ఐశ్వర్యనే.. కానీ నాన్న నాతోనే ఉండాలని డాడీ పేరు యాడ్ చేసుకున్నానని ఐశ్వర్య రాజేష్ అన్నారు.
మా అమ్మగారి పేరు కూడా ఐశ్వర్య అమ్మగారి పేరే నాగమణి. మా నాన్న సుబ్బరాజు గారు పోస్ట్‌మాస్టర్ కావడంతో 1970లలోనే ఇక్కడ సెటిల్ అయ్యాం. నటుడు కావాలన్నది మా నాన్న గారి కల. అల్లూరి సీతారామరాజుగా రవీంద్ర భారతిలో చేశాడు. మా అమ్మకి 21 ఏళ్ల వయసు, నాకు ఆరేళ్లు, సిస్టర్‌కి 5 ఇయర్స్ ఉన్నప్పుడు నాన్నగారు చనిపోయారు. మా నాన్న ఉద్యోగం అమ్మకి రావడంతో 21 ఏళ్ల వితంతువుగా ఉండి మమ్మల్ని పెంచారు. రవీంద్ర భారతిలో మా నాన్నగారు ఏ స్టేజ్ మీద డ్రామాలు వేశారో... అదే స్టేజ్ మీద నేను యాక్టింగ్ వర్క్ షాప్ చేశాం. ఓయ్ సినిమాలో ఎల్ఐసీ ఏజెంట్ క్యారెక్టర్ నాది. ఇంట్రడక్షన్ సీన్‌లో నేను పిండం ప్రధానం చేస్తున్న సీన్. తద్దినం పెట్టే సీన్ వారణాసిలో.. ఆ సీన్ చేసే టైంలో నిజంగా మా నాన్నగారి రోజు వచ్చింది. నేను నిజంగా మా నాన్నగారిదే చేస్తుంటే అది షూట్ చేసి మూవీలో పెట్టారు. ఆయన కోరిక తీరలేదు కాబట్టి.. ఆయన తీర్చుకున్నారేమో అని సునీల్ ఎమోనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎన్నో కష్టాలుపడి వీరంతా స్టార్‌లుగా ఎదిగారని ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications


