జనం సెల్ఫీలు దిగి నా పేరు అడిగేవారు... కాంచన నటుడి కంటతడి
తమిళంలో వందలాది సినిమాలలో డిఫరెంట్ రోల్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీమన్. తనదైన కామెడీ టైమింగ్‌తో పాటు సీరియస్ విలన్‌గా భయపెట్టి, క్యారెక్టర్ రోల్స్‌లో ఏడిపించాడు. కాంచన తదితర సినిమాలలో ఆయన నటనకు తెలుగు ప్రజలు కూడా కడుపుబ్బా నవ్వుకున్నారు. అయితే శ్రీమన్ పక్కా తెలుగు నటుడు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఆయన స్వస్థలం. కాకపోతే తమిళంలో ఎక్కువ అవకాశాలు రావడంతో చెన్నైలోనే సెటిల్ అయిపోయాడు.
అయితే ఇన్నేళ్లుగా టాలీవుడ్‌లో తనకు సరైన అవకాశాలు రావడం లేదని శ్రీమన్ పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏళ్లుగా ఆయన ఎదురుచూపులు ఫలించాయి. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్- నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కుతోన్న సినిమాలో శ్రీమన్‌కు అవకాశం దక్కింది. తన మాతృభాషలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శకుడు అనిల్ రావిపూడికి శ్రీమన్ థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

నాతో తెలుగు డైరెక్టర్లు మాట్లాడి రెండు, మూడేళ్లు అయ్యింది. తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతుండటంతో నా క్యారెక్టర్‌కి నేనే డబ్బింగ్ చెప్పుకునేవాడిని, ఎందుకంటే నాకు తెలుగొచ్చు, తెలుగు అబ్బాయిని. కానీ తెలుగులో బాగా పేరున్న డైరెక్టర్ నుంచి ఒక్క ఛాన్స్ రాకపోతుందా అని ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. చాలామందికి నేను నటుడిగా తెలుసు, మీరు మంచి ఆర్టిస్ట్ అని నేను చేసిన తమిళ సినిమాలు చెబుతారు. కానీ నాకు గొంతు వరకు ఉంటుంది వాళ్లని ఒక ఛాన్స్ అడగాలని.. గొల్లల మామిడాడ సార్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ సార్, తెలుగువాడిని అవకాశం ఇవ్వండి అని అడలేకపోయాను అని శ్రీమన్ ఆవేదన వ్యక్తం చేశారు
అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు. అయితే వారిసు (తెలుగులో వారసుడు) హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. దానికి దిల్‌రాజు అన్న ప్రొడ్యూసర్. ఆ సమయంలో తొలిసారిగా అనిల్ రావిపూడి గారిని కలిశా. అప్పటికే తన సినిమాలు చూడటం, ఫన్ ఎలిమెంట్స్ చూసి చాలా ఇష్టపడే వాడిని. సార్ మిమ్మల్ని మీట్ అవ్వొచ్చా అని అడిగేశా. దానికి ఆయన ఆఫీస్‌కి రమ్మని పిలిచారు. ఇదంతా 2022 నాటి సంగతి. అప్పటి నుంచి ఆయనను ఫాలో అవుతూనే ఉన్నా, ఒక నటుడిగా నేను ఆయనకు చాలా ఇష్టం. నేను చేసిన సినిమాలలో కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఇష్టమని శ్రీమన్ చెప్పారు
నాతో కలిసి పనిచేయడానికి ఆయన ఎదురుచూస్తున్నారని అర్ధమైంది. ఫైనల్‌గా ఇప్పుడు పిలిచారు. వారం రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. రెండు నెలల క్రితమే ఈ సినిమాలో ఛాన్స్ వస్తుందని ముందే తెలుసు. తమిళ్‌లో మూడు నాలుగు సినిమాలు వదిలేశా.. తెలుగులో అవకాశం వచ్చింది చేసి వచ్చేస్తానని చెబితే, వాళ్లంతా నా ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాను సినిమా స్టార్ట్ అయ్యింది, చాలా ఆనందంగా ఉంది. వెంకటేష్ సార్, కళ్యాణ్ రామ్ సార్, కీర్తి సురేష్‌లతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. చాలా మంచి టెక్నీషియన్స్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మంచి టాలెంటెడ్. ఇలాంటి టీమ్‌లో ఒక అవకాశం రావడం, నా మాతృభాషలో నేను మాట్లాడి నేను నేర్చుకున్న విద్యలో చిన్న అవకాశం దొరకడం అదృష్టం శ్రీమన్ అన్నారు.
జనం నన్ను ఎయిర్‌పోర్ట్స్, రైల్వే స్టేషన్‌లోనో చూసి మిమ్మల్ని ఎక్కడో చూశాం సార్, ఈ సినిమాలో చాలా బాగా చేశారు సార్ అని మెచ్చుకునేవారు. కానీ నా పేరు ఏంటి అని నన్నే అడిగేవారు. ఎన్ని వందల సినిమాలు చేసినప్పటికీ ఇంకా ఆంధ్రాలో నా పేరు రిజిస్టర్ కాలేదు, అది అలాగే ఉండిపోయింది లోపల. కానీ ఈ సినిమాలో నా పేరు అందరికీ తెలుస్తుంది, శ్రీమన్ తెలుగు కుర్రోడు, తమిళ్‌లో సెటిలై తమిళ సినిమాలు ఎక్కువ చేస్తున్నాడని అందరికీ తెలుస్తుంది. ఆ అవకాశం నాకిచ్చిన అనిల్ గారికి ఎన్ని వేల థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ప్రతి ఆర్టిస్ట్ దగ్గర, ప్రతి టెక్నిషీయన్ దగ్గర ఎంతో కొంత నేర్చుకున్నా. నా శ్రయశక్తులా మెప్పించడానికి ట్రై చేస్తాను. మీ అందరి దగ్గర శెభాష్ అనిపించుకోవడానికి శ్రమిస్తా.. నన్ను రిసివ్ చేసుకోండి. భవిష్యత్తులో ఇంకా బెటర్‌గా చేయడానికి ట్రై చేస్తానని శ్రీమన్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications



