జూ. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. రూమర్లపై యంగ్ టైగర్ టీమ్ క్లారిటీ
తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలకు ఎప్పటి నుంచో విడదీయలేని అనుబంధం ఉంది. అందుకే స్టార్ హీరోలకు సంబంధించిన రాజకీయ వార్తలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అనేది తరుచూ తెరపైకి వస్తుంటుంది. తాజాగా గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం ఇస్తున్నారనీ, జూలై 18న ఎన్టీఆర్ భారీ మీటింగ్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఆల్ ఇండియా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధికారికంగా స్పందించింది. ఇంతకీ ఏమన్నారు?
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ టాపిక్.. ఇటు సినిమా ఇండస్ట్రీలో .. అటు రాజకీయవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజులుగా జూలై 18న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెడతారని, ఇందుకు సంబంధించిన సమావేశాలు కూడా జరుగుతున్నాయని సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారం అభిమానుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఆల్ ఇండియా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.

జూలై 18న రాజకీయ ఎంట్రీ అంటూ
ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం స్పందిస్తూ.. అభిమానులకు ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం పేరుతో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని, వాటిని నమ్మవద్దని అభిమానులను కోరింది.
RAW NTRతో ఎలాంటి సంబంధం లేదు
మరో ప్రకటనలో 'RAW NTR'సంస్థ గురించి కూడా ప్రస్తావించారు. ఆ సంస్థకు జూనియర్ ఎన్టీఆర్‌తో గానీ, ఆయన కార్యాలయంతో గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అలాగే ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదని, ఆయన పేరుతో సమావేశాలు నిర్వహించడం, ప్రకటనలు విడుదల చేయడం లేదా రాజకీయ కార్యక్రమాలను ప్రకటించే అధికారం కూడా లేదని అభిమాన సంఘం పేర్కొంది.
జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు లేదా ఇతర ముఖ్యమైన సమాచారం ఏదైనా ఉంటే, అది ఆయన లేదా ఆయన అధికారిక బృందం ద్వారానే వెల్లడిస్తారని అభిమాన సంఘం స్పష్టం చేసింది. అనధికారిక వ్యక్తులు, సంస్థలు లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా వచ్చే సమాచారాన్ని అధికారికంగా పరిగణించవద్దని విజ్ఞప్తి చేసింది.
OTT Releases This Week: మా ఇంటి బంగారం డిజిటల్ ఎంట్రీ.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!
ఈ ప్రకటనతో ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న రాజకీయ ఎంట్రీ ప్రచారానికి చెక్ పడినట్టైంది. ఈ అంశంపై ఇదే తమ తుది వివరణ అని అభిమాన సంఘం పేర్కొంది. ఇకపై ఇలాంటి వదంతులు, ఊహాగానాలను నమ్మవద్దని, ధృవీకరించని సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అభిమానులను కోరింది.ఈ నేపథ్యంలో ఆయన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని, రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అభిమాన సంఘం మరోసారి స్పష్టం చేసింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పీక్స్ లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' ప్రాజెక్టు ఆయన చేతిలో ఉంది.


Click it and Unblock the Notifications



