మీరంటే నాకు క్రష్.. కానీ పెళ్లైపోయింది'.. కిరణ్ అబ్బవరంకు యాంకర్ షాకింగ్ ప్రపోజల్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజా వారు రాణి గారు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత 'క' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన కే-ర్యాంప్ తో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు అందుకున్నారు. కెరీర్‌లో వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయన మార్కెట్ కూడా పెరిగింది. ప్రస్తుతం 'చెన్నై లవ్ స్టోరీ' అనే సినిమాతో జూలై 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో జరిగిన ఓ ఫన్నీ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
చెన్నై లవ్ స్టోరీ' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కిరణ్ అబ్బవరం పలువురు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాంటి ఓ ఇంటర్వ్యూలో నటి మౌనీషా చౌదరి యాంకర్ గా వ్యవహరించారు. ఈ సమయంలో ఆ యాంకరమ్మ కిరణ్ అబ్బవరంపై తనకు ఒకప్పుడు ఉన్న అభిమానాన్ని వెల్లడించింది. మొదట వారి సంభాషణ సాగినా కొద్ది నిమిషాల్లోనే ఆసక్తికరంగా మారింది. మౌనీషా మాట్లాడుతూ.. " ఒకప్పుడు మీరంటే నాకు చాలా పెద్ద క్రష్ ఉండేది"అని చెప్పింది. దీంతో హీరో కిరణ్ అబ్బవరం వెంటనే "ఒకప్పుడు అంటే... ఇప్పుడు లేదా?" అంటూ పంచ్ వేశాడు. దీంతో యాంకర్ కూడా అంతే చురుకుగా స్పందిస్తూ.. "ఇప్పుడు మీకు పెళ్లైపోయింది... నాకు కూడా పెళ్లైపోయింది. ఇప్పుడు క్రష్.. క్రిష్ .. అని చెబితే జనాలు వేరేలా అనుకుంటారు" అంటూ నవ్వేశారు.

అక్కడితో ఆగకుండా మౌనీషా కిరణ్ అబ్బవరాన్ని ప్రశంసిస్తూ.. "మీరు చూడటానికి చాలా బాగుంటారు. మీ యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా మీరు చాలా హంబుల్‌గా, డౌన్ టు ఎర్త్‌గా ఉంటారు. అందుకే మీంటే నాకు ప్రత్యేకమైన అభిమానం" అని అన్నారు. యాంకర్ చేసిన ఈ కామెంట్స్‌కు కిరణ్ అబ్బవరం చాలా హుందాగా స్పందించారు. ఎలాంటి అతిశయోక్తి లేకుండా చిరునవ్వుతో ఆ మాటలను స్వీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు భిన్నాభిప్రాయాలతో కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ మౌనీషా చౌదరి ఎవరు?
ఈ ఇంటర్వ్యూతో వార్తల్లో నిలిచిన యాంకర్ పేరు మౌనీషా చౌదరి. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉన్న ముద్దుగుమ్మ.. యాంకర్, కంటెంట్ క్రియేటర్, నటి కూడా.. హైదరాబాద్‌లో జన్మించిన ఆమె దాదాపు 10 సంవత్సరాల క్రితమే అమెరికాలోని ఉటాలో సెటిల్ అయ్యారు. 2016లో 'మిస్ ఆసియా ఉటా' టైటిల్‌ను కూడా గెలుచుకున్నారు. సోషల్ మీడియాలో 'స్నో అక్క'గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మౌనీషాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. ఇటీవల అమెరికాలో జరిగిన 'కన్నప్ప' సినిమా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొని హీరో మంచు విష్ణుతో కలిసి పలు కార్యక్రమాల్లో సందడి చేశారు.
'చెన్నై లవ్ స్టోరీ'పై పెరిగిన అంచనాలు
ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం నటిస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటిస్తున్నారు. 'బేబీ', 'కలర్ ఫోటో' ఫేమ్ సాయి రాజేష్ కథ అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు . ఎస్‌కేఎన్** నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కిరణ్ అబ్బవరం తనతో కలిసి నటించిన హీరోయిన్ రహస్య గోరక్ ను ప్రేమించి వివాహం చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications



